CID Investigation: రామతీర్థం ఘటనపై వేగంవంతమైన సీఐడీ దర్యాప్తు.. పక్కా ప్రణాళికతో పకడ్బందీ స్కెచ్ వేసి..

|

Jan 05, 2021 | 6:54 PM

CID Investigation: ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం స‌ృష్టించిన విజయనగరం జిల్లా రామతీర్థం ఘటనపై సీఐడీ దర్యాప్తు మొదలైంది. దుండగుల

CID Investigation: రామతీర్థం ఘటనపై వేగంవంతమైన సీఐడీ దర్యాప్తు.. పక్కా ప్రణాళికతో పకడ్బందీ స్కెచ్ వేసి..
Follow us on

CID Investigation: ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం స‌ృష్టించిన విజయనగరం జిల్లా రామతీర్థం ఘటనపై సీఐడీ దర్యాప్తు మొదలైంది. దుండగుల దాడిలో దెబ్బతిన్న కోదండరామ స్వామి విగ్రహాన్ని సీఐడీ అడిషనల్ డీజీ సినీల్ కుమార్ పరిశీలించారు. ఈ సందర్భంగా పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు.
రామతీర్థం విగ్రహం దాడి ఎవరో ఆకతాయిలు చేసిన పని కాదని ఇది ఉద్దేశ్యపూర్వకంగానే చేశారని అన్నారు.

పక్కా ప్రణాళికతో పకడ్బందీ స్కెచ్ వేసి ఈ ఘటనకు పాల్పడ్డారని తెలిపారు. ప్రభుత్వానికి చెడ్డపేరు తీసుకురావడం కోసం అంతేకాకుండా సమాజంలో వివాదాలు సృష్టించడం కోసం చేసిన పనిగా కనిపిస్తోందని పేర్కొన్నారు. దర్యాప్తు నిష్పక్షపాతంగా నిర్వహిస్తున్నామని, ఎవరి దగ్గరైన ఆధారాలు ఉంటే అందించాలని కోరారు. ఆలయం గురించి పూర్తిగా తెలిసిన వారే ఈ ఘటనకు పాల్పడినట్టు అనుమానిస్తున్నామని వ్యక్తీకరించారు. ఆకతాయిల చర్యగా భావించడానికి ఎలాంటి ఆధారాలు లేవని, సంఘటన స్థలంలో హెక్సా బ్లెడ్ లభ్యమైందని వివరించారు. స్థానికులు కానీ వారి సాయంతో బయటి వ్యక్తులు విగ్రహంపై దాడికి పాల్పడి ఉండవొచ్చని అనుమానిస్తున్నామన్నారు. సుమారు 400మీటర్ల ఎత్తు, 300 మెట్లు ఉన్న కొండపై చేరుకుని విగ్రహం ధ్వంసం చేయడం సాధారణమైన విషయం కాదన్నారు. ప్రాథమిక ఆధారాలు సేకరించామని, డీఐజీ హరికృష్ణ కేసు దర్యాప్తును పర్యవేక్షిస్తున్నారని త్వరలోనే నిందితులను పట్టుకుంటామని ఆయన తెలిపారు.

మరిన్ని చదవండి:

ఏపీలో కొనసాగుతున్న కరోనా వైరస్ వ్యాప్తి.. కొత్తగా ఎన్ని పాజిటివ్ కేసులు నమోదయ్యాయంటే.!