దైవ సందేశం అందించే బ్రదర్ అనిల్.. రాజకీయ అవతారం ఎప్పుడు ఎత్తారు.. క్రిస్టియన్ జేఏసీ కౌంటర్

|

Mar 16, 2022 | 5:13 PM

బ్రదర్ అనిల్ రాజకీయ పార్టీ పెడతాననడంపై ఏపీ క్రిస్టియన్ జేఏసీ(Christian JAC) కౌంటర్ ఇచ్చింది. పేరుముందు బ్రదర్‌ అని పెట్టుకుని, రాజకీయాల్లోకి రావడమేమిటని ప్రశ్నించింది. ఇటీవల వివిధ‌ సంఘాలతో...

దైవ సందేశం అందించే బ్రదర్ అనిల్.. రాజకీయ అవతారం ఎప్పుడు  ఎత్తారు.. క్రిస్టియన్ జేఏసీ కౌంటర్
Brother Anil
Follow us on

బ్రదర్ అనిల్ రాజకీయ పార్టీ పెడతాననడంపై ఏపీ క్రిస్టియన్ జేఏసీ(Christian JAC) కౌంటర్ ఇచ్చింది. పేరుముందు బ్రదర్‌ అని పెట్టుకుని, రాజకీయాల్లోకి రావడమేమిటని ప్రశ్నించింది. ఇటీవల వివిధ‌ సంఘాలతో బ్రదర్‌ అనిల్‌ కుమార్‌ భేటీ కావడం, కొత్తపార్టీపై ప్రకటనలు చేయడంతో వివాదం తెరపైకి వచ్చింది. బ్రదర్‌ అనిల్‌(Brother Anil) త్వరలోనే పార్టీ పెడతారన్న ప్రచారం, దానికి ఆయన కామెంట్లు కూడా బలం చేకూర్చడంతో రాజకీయం రసవత్తరంగా మారింది. ఈ క్రమంలో ఇవాళ తిరుపతిలో ఏపీ క్రిస్టియన్‌ జేఏసీ భేటీ అయింది. బ్రదర్‌ అనిల్‌కుమార్‌ వరుస భేటీలపై జేఏసీ సభ్యులు చర్చించారు. బ్రదర్ అనిల్ రాజకీయ పార్టీ(Political Party) పెడతాననడం హాస్యాస్పదంగా ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. దైవ సందేశం అందించే బ్రదర్ అనిల్.. ఎప్పుడు రాజకీయ అవతారం ఎత్తాడో చెప్పాలని ఎద్దేవా చేశారు. ఇప్పటికే వైఎస్‌ షర్మిల తెలంగాణలో వైఎస్సార్‌టీపీ పేరుతో పార్టీ నడిపిస్తున్నారు. తెలంగాణ కోడలిగా తనను తాను ప్రొజెక్ట్‌ చేసుకుంటున్నారు. దీంతో బ్రదర్‌ అనిల్‌ తెలంగాణలో పెట్టుకున్న పార్టీ పనులు చూసుకోవాలని, ఏపీ రాజకీయాల్లో తలదూర్చవద్దని జేఏసీ నాయకులు సూచించారు.

అగ్రకులానికి చెందిన బ్రదర్ అనిల్.. బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలను ఉద్ధరిస్తాననడంలో ఆంతర్యమేంటో చెప్పాలని క్రిస్టియన్‌ జేఏసీ సభ్యులు ప్రశ్నించారు. కేఏ పాల్ పతనం తర్వాత బ్రదర్ అనిల్ ను అప్పటి సీఎం వైఎస్సార్‌ శాంతి దూతగా ప్రపంచానికి పరిచయం చేశారన్నారు. బ్రదర్ అనిల్ రాజకీయాల్లో తలదూర్చకూడదని ప్రేమగా హెచ్చరిస్తున్నామన్నారు. అయితే గతంలో విశాఖలోని ఓ హోటల్​లో క్రైస్తవ సంఘాల ప్రతినిధులతో అనిల్ భేటీ అయ్యారు. అన్ని సమస్యలను ముఖ్యమంత్రి జగన్​దృష్టికి తీసుకెళ్తానని వెల్లడించారు. అయితే తాను, జగన్​బిజీగా ఉండటం వల్ల రెండున్నరేళ్లుగా కలవలేకపోయామని, సమయం కుదిరినప్పుడు కచ్చితంగా కలుస్తానని స్పష్టం చేశారు. తనను కలిసినవాళ్లకు సాయం చేస్తానని హామీ ఇచ్చానని, మాట ఇస్తే కచ్చితంగా వెనక్కి తగ్గకుండా నిలబడతానన్నారు. మరోవైపు పార్టీ పెట్టాలనే డిమాండ్​కూడా ఉందని వ్యాఖ్యానించారు.

Also Read

Coronavirus: భారత్‌కు మరోసారి కరోనా ముప్పు.. నాలుగో వేవ్‌లో 75 శాతం మందిపై ప్రభావం.?

Andhra Pradesh: ఏపీఎస్ఆర్టీసీలో 1800లకు పైగా కారుణ్య నియామకాలకు సీఎం గ్రీన్‌ సిగ్నల్‌!

CM Jagan: ఏపీ విద్యార్థులకు గుడ్ న్యూస్.. తల్లుల ఖాతాల్లోకి విద్యా దీవెన నిధులు..