
2026 జనవరి 22, గురువారం నాడు గుంటూరు మిర్చి మార్కెట్ మిర్చి ధరలు, మార్కెట్ పరిస్థితి ఎలా ఉందో ఈ కథనంలో తెలుసుకుందాం. గురువారం మార్కెట్‌కు మొత్తం 61,000 బస్తాల కొత్త మిర్చి చేరింది. ఇందులో నాన్-ఏసీ 40,000 నుంచి 45,000 బస్తాలు, ఏసీ 15,000 నుంచి 16,000 బస్తాలు వచ్చినట్లు తెలుస్తోంది. మార్కెట్‌కు వచ్చిన సరుకులో, ముఖ్యంగా ఏసీ శాంపిల్స్‌లో తేజా రకాలు అధికంగా కనిపించాయి, ఇది ఆ రకాల ధరలపై ప్రభావం చూపింది.
రకాల వారీగా మిర్చి ధరల వివరాలు:
తేజా రకాలు: తేజా, షార్కు తేజా, రోమి 26 వంటి తేజా సెగ్మెంట్ రకాల ధరలలో గురువారం కాస్త స్లో అయినట్లు కనిపించింది. భారీగా సరుకు రావడం వల్ల ఈ రకాలపై ఒత్తిడి పడింది. కొత్త తేజా రకాలు గరిష్టంగా రూ. 19,000 పలికాయి. ఏసీ తేజా రకాలు రూ. 18,500 నుంచి రూ. 19,000 లోపు అమ్ముడయ్యాయి. షార్కు తేజా, రోమి రకాలు రూ.17,000 లోపే పలికాయి.
కర్నూల్ డీడీ, నాటు, సీడ్ రకాలు: తేజా రకాల మినహా, ఇతర రకాల మార్కెట్ స్థిరంగా, డిమాండ్‌తో కొనసాగింది. కర్నూల్ డీడీ 341 రకం గరిష్టంగా రూ. 25,000 పలికింది, కనిష్టంగా రూ16,000 క్వింటా అమ్ముడయ్యాయి. మధ్యస్థ రకాలకు రూ.16,000 నుండి రూ.20,000 వరకు ధరలు నమోదయ్యాయి. సీడ్ రకాలకు డిమాండ్ తగ్గకుండా, మార్కెట్ బాగానే ఉంది. నెంబర్ ఫైవ్ కొత్త మిర్చి రకాలు రూ.16,000 నుంచి రూ. 23,000 వరకు, నాణ్యతను బట్టి రూ.23,500 నుండి రూ.24,000 వరకు పలికాయి.
బ్యాడిగి రకాలు: 355 బ్యాడిగి కొత్త రకాలు రూ.16,000 నుంచి రూ.22,000 వరకు అమ్ముడయ్యాయి. సింజెంటా బ్యాడిగి కొత్త మిర్చి రకాలు రూ.15,000 నుంచి రూ.21,000 వరకు పలికాయి.
ఇతర ప్రధాన రకాలు: 2043 ఈ రకం మార్కెట్ బాగానే ఉంది. నాణ్యత ఉన్న మిర్చి లభ్యత తక్కువగా ఉండటంతో, మంచి నాణ్యతకు రూ.30,000 పైన, ఏసీ రకాలకు రూ.35,000 వరకు ధరలు నమోదయ్యాయి. సాధారణ క్వాలిటీ రూ.30,000 నుంచి రూ.32,000 వరకు పలికింది.
బంగారం: కొత్త మిర్చి రకాలు రూ.15,000 నుంచి రూ.20,000 వరకు అమ్ముడయ్యాయి. ఏసీ రకాలు రూ.19,500 నుంచి రూ20,000 వరకు పలికాయి.
బుల్లెట్: ఈ రకం కూడా బంగారం రకం వలె రూ.15,000 నుంచి రూ.20,000 వరకు పలికింది. ఏసీ రకాలు రూ.19,500 నుంచి రూ.20,000 వరకు అమ్ముడయ్యాయి.
273 కుబేరా: నాణ్యతను బట్టి రూ.20,000 నుంచి రూ.21,000 వరకు, ఒరిజినల్ నాణ్యత రూ.22,000 వరకు పలికింది. ఏసీ రకాలు రూ.20,000 నుంచి రూ.21,000 వరకు పలికాయి.
నాటు రకాలు: రూ.21,000 నుంచి రూ.22,000 వరకు అమ్ముడయ్యాయి. 334 రకం కూడా నాణ్యతను బట్టి రూ.22,000 వరకు పలికింది.
ఆర్మూర్: ఈ రకం రూ.17,000 నుండి రూ.17,500 వరకు అమ్ముడై, అమ్మకాలు బాగానే ఉన్నాయి. కొత్తవి రూ.17,500 వరకు పలికాయి, బుధవారం రూ.18,000 కూడా జరిగింది. ఏసీ రకాలు రూ.16,500 నుంచి రూ.17,500 వరకు పలికాయి.
క్లాసిక్: ఈ రకం రూ.17,000 పరిధిలో మార్కెట్ నడుస్తోంది.
108 వన్: కొత్తవి రూ.15,000 నుంచి రూ.16,000 నుంచి ప్రారంభమై, నాణ్యతను బట్టి రూ.23,000 వరకు, గరిష్టంగా రూ.23,500 వరకు పలికాయి.
నాందేడ్ సీడ్ రకాలు: రూ.15,000 నుంచి రూ.16,000 పరిధిలో ఉన్నాయి.
ఎల్లో మిర్చి:నాణ్యమైన డీలక్స్ రకాలు రూ.48,000 నుంచి రూ.49,000 వరకు అద్భుతంగా అమ్ముడయ్యాయి.
తాలు రకాలు: కొత్త తాలు, డీడీ తాలు, 341 తాలు, నెంబర్ ఫైవ్ తాలు వంటి రంగు తాలు రూ.15,000 వరకు పలికాయి. మెత్త తాలు రూ.10,000 నుంచి రూ.11,000 వరకు, మంచి రంగు తాలు రూ.13,000 నుండి రూ.15,000 వరకు పలికాయి. తేజా తాలు రంగు తాలు రూ.12,500 పరిధిలో అమ్ముడయ్యాయి. 334 తాలు రూ.10,000 పైన మంచి ధరలు పలికాయి. మొత్తం మీద, గుంటూరు మార్కెట్‌కు భారీగా సరుకు రావడంతో, ముఖ్యంగా తేజా రకాలపై కొంత ఒత్తిడి పెరిగి ధరలు మందగించాయి. అయితే, నాణ్యతను బట్టి ఇతర సీడ్, బ్యాడిగి, నాటు రకాలు స్థిరంగా మంచి ధరలు పలికాయి. మార్కెట్ నాణ్యతపై ఆధారపడి నడుస్తుందని అర్థమువుతుంది.
మిర్చి ధరలు ఇంకా పెరుగుతాయా…?
అనేక మిర్చి వెరైటీలు ఇప్పటికే క్వింటాలుకు రూ.25,000 మార్కును దాటాయి. మిర్చి ధరల పెరుగుదలకు ప్రధాన కారణాలు సాగు విస్తీర్ణం గణనీయంగా పడిపోవడం. నల్లి, ఇతర తెగుళ్ల కారణంగా వేసిన పంట దిగుబడి కూడా ఆశాజనకంగా లేకపోవడమే. కొత్త పంట మార్కెట్‌లోకి వస్తున్నప్పటికీ, ధరలు నిరంతరం పెరుగుతున్నాయి, ఇది ప్రస్తుత ధోరణి కొనసాగుతుందని సూచిస్తుంది. చాలా వెరైటీలకు తదుపరి లక్ష్యం రూ.30,000 గా ఉంది. ఇప్పటికే పసుపు మిర్చి క్వింటాలుకు రూ.44,000 చేరుకుంది, ఇది రూ.70,000 కు వెళ్లినా ఆశ్చర్యపోనవసరం లేదని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. అయితే ఇది తక్కువ మంది రైతులు మాత్రమే సాగుచేస్తున్నారు. కోల్డ్ స్టోరేజీలలోని స్టాక్ సుమారు 20 రోజులలో ఖాళీ అయిపోయే అవకాశం ఉంది. వ్యాపారస్తులు సరుకు కోసం తీవ్రంగా పోటీపడుతున్నారు. రైతులు మంచి ధర వస్తుందని ఆశించి కోల్డ్ స్టోరేజీల నుంచి సరుకును బయటకు తీయడం లేదు. గత వారం రోజులుగా, అన్ని రకాల మిర్చి ధరలు ప్రతిరోజూ పెరుగుతూనే ఉన్నాయి. కోల్డ్ స్టోరేజీల నుంచి సరుకు బయటకు రావాలంటే ధరలు మరింత పెంచడం తప్ప వేరే మార్గం లేదు. మంచి క్వాలిటీ సరుకు అంతా కోల్డ్ స్టోరేజీలలోనే ఉంది. కొత్తగా వచ్చే పంట మొదటి కోతలు కాబట్టి, అంత నాణ్యత ఉండదు. రాబోయే రోజుల్లో చైనాకు ఎగుమతులు మరింత పెరిగే అవకాశం ఉంది, వ్యాపారస్తులు సుపీరియర్, డీలక్స్ క్వాలిటీల కోసం పోటీపడుతున్నారు. దీంతో ధర పెరిగే అవకాశాలే ఎక్కువ ఉన్నాయన్నది నిపుణులు అంచనా.