Child Atrocity: అత్యాశతో కూతురు జీవితాన్ని నాశనం చేయబోయిన తల్లి.. హీరోయిన్‌ చేయాలని సూది మందులతో..

|

Jun 03, 2023 | 12:05 PM

విజయనగరంలో దారుణం జరిగింది. సినీ రంగుల ప్రపంచంపై ఉన్న మోజుతో కూతురుని హీరోయిన్‌గా చేయాలనుకున్నదో తల్లి. అలా అనుకోవడం వరకు అంతా బాగానే ఉంది కానీ అణ్యం పుణ్యం తెలియని తన చిన్నారిని యువతిలా కనిపించేలా చేయడం కోసం ఏవేవో ఇంజెక్షన్లు ఇవ్వడం..

Child Atrocity: అత్యాశతో కూతురు జీవితాన్ని నాశనం చేయబోయిన తల్లి.. హీరోయిన్‌ చేయాలని సూది మందులతో..
Vizianagaram Incident
Follow us on

సినిరంగం అనేది ఓ మాయా ప్రపంచం. ఆ ప్రపంచంలోకి ఒక్కసారి అడుగుపెడితే ఒవర్‌నైట్ స్టార్ అయిపోవచ్చనేది చాలా మందిలో ఉన్న ప్రధాన అపోహ. నిజానికి సినీరంగంలోకి ప్రవేశించడం ఎంత కష్టమో.. ప్రేక్షకుల ఆదరాభిమానాలు పొందడం అంతకంటే కష్టం. ఈ కారణంగానే ఎందరో నటీనటులు కనుమరుగైపోయారు. అయితే తాజాగా విజయనగరంలో దారుణం జరిగింది. సినీ రంగుల ప్రపంచంపై ఉన్న మోజుతో కూతురుని హీరోయిన్‌గా చేయాలనుకున్నదో తల్లి. అలా అనుకోవడం వరకు అంతా బాగానే ఉంది కానీ అణ్యం పుణ్యం తెలియని తన చిన్నారిని యువతిలా కనిపించేలా చేయడం కోసం ఏవేవో ఇంజెక్షన్లు ఇవ్వడం ప్రారంభించింది.

అయితే ఆ బాధ భరించలేని ఆమె కూతురు చైల్డ్‌లైన్‌ విభాగానికి ఫిర్యాదు చేసింది. ఈ మేరకు రంగంలోకి దిగిన బాలల హక్కుల పరిరక్షణ కమిషన్‌.. జిల్లా అధికారులకు సమాచారం ఇచ్చింది. వారు పోలీసుల పోలీసుల సహకారంతో వెళ్లి బాలికను తమ అధీనంలోకి తీసుకున్నారు. అనంతరం విశాఖపట్నంలో స్వధార్‌ హోమ్‌కు పంపించారు. ఇక పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. విజయనగరం ఆర్టీసీ కాంప్లెక్స్‌ సమీపంలో నివాసం ఉంటోన్న మహిళ)(40)కు ఓ కూతురు పుట్టిన జన్మించాక ఆమె భర్త చనిపోయాడు. అనంతరం ఆమె రెండో పెళ్లి చేసుకుంది. ఇక ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత ఆ రెండో భర్త ఆమెను వదిలేసి.. పిల్లలతో సహా వెళ్లిపోయాడు. దీంతో ఆమె ఇప్పుడు మరో వ్యక్తితో కలిసి ఉంటోంది.

అలాగే ఆమెకు మొదటి భర్త ద్వారా పుట్టిన చిన్నారి(15) ఇటీవలే పదో తరగతి పూర్తి చేసింది. వేసవి సెలవులు కావడంతో ఇంట్లోనే ఉంటున్న క్రమంలో.. తల్లి దగ్గరకు నిత్యం ఎవరెవరో వస్తుండడం ఆ చిన్నారికి నచ్చలేదు. అక్కడ ఉండడానికి కూడా ఇష్టపడని ఆ చిన్నారి తల్లితో గొడవపడేది. ఈ క్రమంలో సదరు మహిళ కోసం వచ్చిన ఓ వ్యక్తి ఆమె కూతురుపై కన్నేశాడు. ఆ చిన్నారిలో హీరోయిన్‌ అయ్యే లక్షణాలు ఉన్నాయని, కానీ కొన్ని అవయవాలు బొద్దుగా పెరగాలంటూ తల్లిని నమ్మబలికాడు. అతని చెెప్పుడు మాటలు విన్న సదరు మహిళ తన కూతురుకు నిత్యం ఇంజెక్షన్లు ఇప్పించడం సాగించింది.

ఇవి కూడా చదవండి

కానీ వయసు లేకుండానే యువతిలా కనిపించేందుకు ఆ చిన్నారికి ఇస్తున్న ఇంజెక్షన్లు సైడ్ ఎఫెక్ట్ చూపించాడు. ఫలితంగా ఆ చిన్నారి అనారోగ్యం బారిన పడింది. ఆ బాధ భరించలేని చిన్నారి తన తల్లిని ఎంతగా వేడుకున్నా విడిచిపెట్టలేదు. ఆ పరిస్థితిలో ఏం చేయాలో తెలియని ఆ చిన్నారి చివరకు గురువారం రాత్రి 1098 నంబర్‌కి ఫోన్‌ చేసి చైల్డ్‌లైన్‌ సిబ్బందికి తన దీనస్థితిని తెలిపింది. అలా రంగంలోకి దిగిన వారు.. ఈ ఘటనపై కేసు నమోదు చేయాలని దిశ పోలీసులను కోరారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..