Makar Sankranti 2022: ఘనంగా సంక్రాంతి సంబరాలు.. సంప్రదాయ దుస్తుల్లో సీఎం జగన్ దంపతులు..

సీఎం క్యాంప్ ఆఫీసులో సంక్రాంతి సంబరాలు అంబరాన్ని తాకాయి. తాడేపల్లిలోని ముఖ్యమంత్రి నివాసంలో ఏర్పాటు చేసిన సంక్రాంతి వేడుకలు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి దంపతులు..

Makar Sankranti 2022: ఘనంగా సంక్రాంతి సంబరాలు.. సంప్రదాయ దుస్తుల్లో సీఎం జగన్ దంపతులు..
Cm Jagan With

Updated on: Jan 14, 2022 | 4:04 PM

Makar Sankranti 2022 – CM Jagan: సీఎం క్యాంప్ ఆఫీసులో సంక్రాంతి సంబరాలు అంబరాన్ని తాకాయి. తాడేపల్లిలోని ముఖ్యమంత్రి నివాసంలో ఏర్పాటు చేసిన సంక్రాంతి వేడుకలు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి దంపతులు పాల్గొన్నారు. సంప్రదాయ దుస్తుల్లో వేడుకలకు సీఎం జగన్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. పూర్ణకుంభంతో అర్చకులు సీఎం దంపతులకు స్వాగతం పలికారు. అనంతరం గోవులకు ప్రత్యేక పూజలు నిర్వహించారు సీఎంజగన్. భోగిమంటలు, హరిదాసుల కీర్తనలు, గంగిరెద్దుల విన్యాసాలు, కోలాటాలు, పిండివంటలు, సాంస్కృతిక కార్యక్రమాల్లో దంపతులు ఇద్దరు కలసి పాల్గొన్నారు. చిన్నారుల సంక్రాంతి నృత్యాలు, డప్పు కళాకారుల విన్యాసాలను చూసిన సీఎం దంపతులు వారిని మెచ్చుకున్నారు.

సంక్రాంతి సందర్భంగా ఏర్పాటు చేసిన అన్ని కార్యక్రమాల్లో సీఎం జగన్ దంపతులు పాల్గొన్నారు. అనంతరం సీఎం జగన్ మాట్లాడారు. సంక్రాంతి సంబారాల్లో పాల్గొనేందుకు వచ్చిన అక్కచెల్లెల్లకే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అక్కచెల్లెమ్మలు, సోదరులు, స్నేహితులు, అవ్వాతాతలు అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు.

అందరికి మంచి జరగాలని మనసారా కోరుకుంటున్నాని అన్నారు. ప్రభుత్వ విప్‌ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి అధ్వర్యంలో జరిగిన ఈ సంక్రాంతి సంబరాల్లో దేవాదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు, టీటీడీ ఛైర్మన్‌ వై.వి.సుబ్బారెడ్డి, పలువురు ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు హాజరయ్యారు.

Chief Minister Jagan And His Wife Bharathi

ఇవి కూడా చదవండి: Video: యూట్యూబ్‌లో దుమ్మురేపుతున్న ‘బేబీ షార్క్’ వీడియో..10 మిలియన్ల వ్యూస్ క్రాస్.. మీరు చూశారా..

Gmailలో ఈ ఫీచర్‌ని ఎప్పుడైనా ఉపయోగించారా.. ఇందులో నుంచి సీక్రెట్ ఇమెయిల్ పంపవచ్చు తెలుసా..