Chittoor District: చిత్తూరు జిల్లాలో మూడు కాళ్ల కోడి పిల్ల అందరికి ఒక వింతగా మారింది. స్థానిక ప్రజలను ఆశ్చర్యపరుస్తోంది. వెదురుకుప్పం మండలం నల్లవెంగన పల్లి పంచాయతీలోని మిట్టూరు గ్రామానికి చెందిన డానియల్ కోళ్ల ఫారంలో మూడు కాళ్ల వింత కోడి పిల్ల కనిపించింది. డానియల్ వారం రోజుల క్రితం తమ కోళ్ల ఫారంలో కోళ్లను పెంచేందుకు 4500 పిల్లలను దిగుమతి చేసుకున్నాడు. కోడి పిల్లలకు నీళ్లు తాగించే సమయంలో మూడు కాళ్ల కోడి పిల్ల కనిపించింది. ఈ విషయాన్ని చుట్టుపక్కల స్థానికులకు చెప్పడంతో అక్కడున్న ప్రజలు ఆశ్చర్యకరంగా వచ్చి చూశారు. 3 కాళ్ల కోడి పిల్ల గురించి ఆ నోటా ఈ నోటా పాకడంతో పరిసర గ్రామాల్లో అంతటా చర్చగా మారింది. తాను ఇప్పటి వరకూ ఎప్పుడూ మూడు కాళ్లు ఉన్న కోడి పిల్లను చూడలేదని, ఇదే ఫస్ట్ టైమ్ అని డానియల్ చెప్పారు. ఇది అరుదైన విషయమని పేర్కొన్నారు. కాగా జన్యులోపం వల్ల ఇలా జరిగే అవకాశం ఉందని.. నిపుణులు చెబుతున్నారు.
Also Read: Viral News: ఇంటి బేస్‌మెంట్ కింద రహస్య అర.. అందులోకెళ్లి చెక్ చేసిన పోలీసులు షాక్
భాగ్యనగర వాసులకు గుడ్ న్యూస్.. మార్చిలో అందుబాటులోకి మరో ఫ్లైఓవర్