Andhra Pradesh: లోన్ యాప్ వేధింపులు బాధాకరం.. ప్రజలకు అవగాహన కల్పించాలి.. పోలీసులకు చంద్రబాబు సూచన..

|

Sep 09, 2022 | 6:43 PM

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో లోన్ యాప్ ఆగడాలు ఎక్కువైపోతున్నాయి. వారి వేధింపులు భరించలేక అమాయక ప్రజలు ప్రాణాలు తీసుకుంటున్నారు. ఈ పరిస్థితులు ఆందోళన కలిగిస్తున్నాయి. దీనిపై టీడీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్..

Andhra Pradesh: లోన్ యాప్ వేధింపులు బాధాకరం.. ప్రజలకు అవగాహన కల్పించాలి.. పోలీసులకు చంద్రబాబు సూచన..
Chandrababu Naidu
Follow us on

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో లోన్ యాప్ ఆగడాలు ఎక్కువైపోతున్నాయి. వారి వేధింపులు భరించలేక అమాయక ప్రజలు ప్రాణాలు తీసుకుంటున్నారు. ఈ పరిస్థితులు ఆందోళన కలిగిస్తున్నాయి. దీనిపై టీడీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు (Chandrababu Naidu) స్పందించారు. ఈ ఘటనలు ఆవేదన కలిగిస్తున్నాయని అన్నారు. రాజమహేంద్రవరంలో దంపతుల ఆత్మహత్య ఘటన మర్చిపోకముందే పల్నాడులో మరో యువకుడు సూసైడ్ చేసుకోవడం దారుణమని వ్యాఖ్యానించారు. మహిళల గౌరవాన్ని కించపరిచేలా వేధిస్తున్న వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వీటిని ధైర్యంగా ఎదుర్కోని ముందుకు వెళ్లాలే కానీ ప్రాణాలు తీసుకోవడం సరైనది కాదని చెప్పారు. ప్రభుత్వం, పోలీసులు ఇటువంటి యాప్‌ల (Loan App) పై ప్రజల్లో అవగాహన కలిగించే కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. బాధితులకు అండగా ఉండాలని, వారికి మనో ధైర్యాన్ని కలిగించాలని కోరారు. జీవనోపాధి కోసం రాజమండ్రికి వలస వచ్చిన దంపతులు.. ఆర్థిక ఇబ్బందులతో ఇటీవల ఆన్‌ లైన్ లోన్ యాప్‌లో అప్పు తీసుకున్నారు. కొంత నగదు చెల్లించారు. మిగతా డబ్బు సమయానికి చెల్లించకపోవడంతో యాప్‌ల నిర్వాహకుల నుంచి బెదిరింపులు, వేధింపులు ఎక్కువయ్యాయి. వారి ఆగడాలు తట్టుకోలేక మనస్తాపంతో దంపతులు సూసైడ్ చేసుకున్నారు.

కాగా.. లోన్ యాప్ వేధింపులపై సీఎం జగన్ స్పందించారు. రోజురోజుకు ఆగడాలు పెరిగిపోతుండటంతో ప్రభుత్వం సీరియస్ అయింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) అనుమతి లేని లోన్‌ యాప్‌లపై కఠినంగా వ్యవహరించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. ఈ విషయంలో కఠినంగా వ్యవహరించాలని నేరుగా నేరుగా సీఏం జగన్మోహన్ రెడ్డి అధికారులకు చెప్పారు. ఇక నుంచి రాష్ట్రంలో లోన్ యాప్ వేధింపుల వల్ల ఎవరూ ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఉండకూడదని స్పష్టం చేశారు. అయితే.. ఈ లోన్ యాప్ ప్రతినిధులు ఇటీవల కాలంలో మంత్రులు, పలువురు ప్రజాప్రతినిధులకు కూడా కాల్ చేసి మంత్రి లోన్ తీసుకున్నారని, మీరు కట్టాలంటూ అడిగిన సందర్భాలుండటం గమనార్హం.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..