Chandrababu Naidu Arrested Highlights: బెయిలా..? జైలా..? విజయవాడలో హైటెన్షన్‌.. చంద్రబాబును ప్రశ్నించిన సిట్‌

| Edited By: Subhash Goud

Sep 09, 2023 | 10:04 PM

స్కిల్ డెవలప్ మెంట్ కేసులో ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడును సీఐడీ అరెస్ట్‌ చేసింది. నంద్యాల ఆర్.కే. ఫంక్షన్ హాల్ వద్ద చంద్రబాబును పోలీసులు అరెస్ట్ చేశారు. క్రైం నంబర్ 29/2021 కేసులో అరెస్ట్ చేసినట్లు సీఐడీ పోలీసులు తెలిపారు.

Chandrababu Naidu Arrested Highlights: బెయిలా..? జైలా..? విజయవాడలో హైటెన్షన్‌.. చంద్రబాబును ప్రశ్నించిన సిట్‌
Chandrababu Naidu

స్కిల్ డెవలప్ మెంట్ కేసులో ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడును సీఐడీ అరెస్ట్‌ చేసింది. నంద్యాల ఆర్.కే. ఫంక్షన్ హాల్ వద్ద చంద్రబాబును పోలీసులు అరెస్ట్ చేశారు. క్రైం నంబర్ 29/2021 కేసులో అరెస్ట్ చేసినట్లు సీఐడీ పోలీసులు తెలిపారు. 120(B), 166, 167, 418, 420, 465, సెక్షన్ల కింద పోలీసులు అరెస్ట్ చేశారు. 468, 471, 409, 201,109 రెడ్ విత్ 34, 37 సెక్షన్ల కింద పోలీసులు అరెస్ట్ చేశారు. సీఐడీ చట్టంలోని 12, 13(2) రెడ్ విత్ (1) (c)(d) సెక్షన్లను పోలీసులు చంద్రబాబుపై నమోదు చేశారు.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 09 Sep 2023 09:20 PM (IST)

    20 ప్రశ్నలను చంద్రబాబు ముందుంచిన సిట్‌

    స్కిల్‌ డెవలప్‌మెంట్‌ స్కామ్‌లో అరెస్ట్‌ చేసిన సీఐడీ తాడేపల్లిలోని సిట్‌ కార్యాలయాలకు తరలించారు. అక్కడ 20 ప్రశ్నలను చంద్రబాబు ముందుంచారు. వాటికి సమాధానం చెప్పలేదని, స్కామ్‌లో తనకు ఎలాంటి సంబంధం లేదని చెబుతున్నారని సిట్‌ తెలిపింది.

  • 09 Sep 2023 08:18 PM (IST)

    చంద్రబాబు విచారణకు సహకరించడం లేదు

    స్కిల్‌ డెవలప్‌మెంట్‌ స్కామ్‌ విషయంలో చంద్రబాబును సిట్‌ బృందం ప్రశ్నిస్తోంది. అయితే చంద్రబాబు విచారణకు సహకరించడం లేదని సిట్‌ తెలిపింది. ఆధారాలతో చంద్రబాబు ముందుంచినా తనకు స్కామ్‌తో ఎలాంటి సంబంధం లేదని చెబుతున్నారని సిట్‌ తెలిపింది.

  • 09 Sep 2023 07:55 PM (IST)

    బాలకృష్ణ ప్రత్యేక విమానంలో విజయవాడకు

    చంద్రబాబు అరెస్ట్‌ ఏపీ రాష్ట్రంలో తీవ్ర సంచలనం సృష్టించింది. విజయవాడకు తరలించిన చంద్రబాబును సిట్‌ కార్యాలయంలో ప్రవేశపెట్టారు. ఈ నేపథ్యంలో బాలకృష్ణ ప్రత్యేక విమానంలో విజయవాడకు బయలుదేరి వెళ్లారు.

  • 09 Sep 2023 07:26 PM (IST)

    రేపు ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు, నిరసనలు

    చంద్రబాబు నాయుడు అరెస్టుకు నిరసనగా ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు, ధర్నాలు చేపట్టనున్నట్లు టీడీపీ నేత అచ్చెన్నాయుడు తెలిపారు.

  • 09 Sep 2023 06:52 PM (IST)

    సిట్‌ కార్యాలయానికి భువనేశ్వరి, లోకేష్‌

    చంద్రబాబు నాయుడు అరెస్టు నేపథ్యంలో విచారణ నిమిత్తం సిట్‌ తాడేపల్లిలోని కార్యాలయానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా నారా భువనేశ్వరి, లోకేష్‌లు సిట్‌ కార్యాలయానికి చేరుకున్నారు.

  • 09 Sep 2023 06:02 PM (IST)

    చంద్రబాబును ప్రశ్నిస్తున్న సీఐడీ

    చంద్రబాబు నాయుడును సిట్‌ కార్యాలయంలో సీఐడీ అధికారులు ప్రశ్నిస్తున్నారు. చంద్రబాబు స్టేట్‌ మెంట్‌ను సీఐడీ అధికారులు రికార్డ్‌ చేశారు.

  • 09 Sep 2023 06:00 PM (IST)

    గంటన్నర పాటు విచారణ కొనసాగే అవకాశం

    కొద్దిసేపటి క్రితమే చంద్రబాబు తాడేపల్లి సిట్‌ కార్యాలయానికి చేరుకున్నారు. అక్కడ చంద్రబాబును సుమారు గంటన్నర పాటు విచారించే అవకాశం ఉంది. ఆ తర్వాత వైద్య పరీక్షల నిమిత్తం విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించనున్నట్లు తెలుస్తోంది.

  • 09 Sep 2023 05:37 PM (IST)

    సీఐడీ ఆఫీస్‌లోకి వెళ్లిన చంద్రబాబు

    స్కిల్‌ డెవలప్‌మెంట్‌ స్కామ్‌లో అరెస్టు అయిన చంద్రబాబు నాయుడును పోలీసులు విజయవాడకు తరలించారు. కొద్దిసేపటి క్రితమే తాడేపల్లి సీఐడీ కార్యాలయానికి చేరుకున్నారు. ఈ నేపథ్యంలో భారీ ఎత్తున పోలీసులు మోహరించి ఉన్నారు.

  • 09 Sep 2023 05:22 PM (IST)

    9 గంటల పాటు సాగిన చంద్రబాబు ప్రయాణం

    స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో అరెస్టు అయిన చంద్రబాబు నాయుడును విజయవాడకు తరలించారు. ఉదయం నంద్యాలలో అరెస్టు అయిన చంద్రబాబు ప్రయాణం 9 గంటల పాటు సాగింది. తాడేపల్లిలోని సిట్‌ కార్యాలయానికి చేరుకున్నారు.

  • 09 Sep 2023 04:59 PM (IST)

    తాడేపల్లి సిట్ కార్యాలయానికి చంద్రబాబు

    స్కిల్ డెవలప్ మెంట్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న చంద్రబాబు నాయుడును సీఐడీ పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. విజయవాడకు తరలిస్తున్న ఆయనను తాడేపల్లి సిట్ కార్యాలయానికి చేరుకున్నారు. దీంతో భారీ ఎత్తున పోలీసులు మోహరించి ఉన్నారు.

  • 09 Sep 2023 04:43 PM (IST)

    చంద్రబాబును కలిసేందుకు పవన్‌కు అనుమతి లేదు

    సీఐడీ పోలీసులు చంద్రబాబును అరెస్టు చేసి విజయవాడకు తరలిస్తున్న క్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. ఇక చంద్రబాబును కలిసేందుకు జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌కు అనుమతి లేదని పోలీసులు స్పష్టం చేశారు. విమానంలో విజయవాడకు రాకుండా చూడాలని పోలీసులు ఎయిర్‌పోర్ట్‌ అధికారికి తెలియజేశారు. పవన్‌ విజయవాడకు విమానంలో బయలుదేరేందుకు అనుమతి ఇవ్వొద్దని సూచించారు.

  • 09 Sep 2023 04:41 PM (IST)

    కార్యకర్తలను చెరదగొడుతున్న పోలీసులు

    స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో చంద్రబాబు నాయుడు అరెస్టు కావడంతో రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ కార్యకర్తలు రోడ్డుపై బైఠాయిస్తున్నారు. చాలా ప్రాంతాల్లో రోడ్లపై ధర్నాకు దిగుతున్నారు. దీంతో పోలీసులు రంగంలోకి దిగి వారిని చెదరగొడుతున్నారు. కాన్వాయ్‌కి అడ్డుకోకుండా పోలీసులు చర్యలు చేపడుతున్నారు.

  • 09 Sep 2023 04:06 PM (IST)

    చంద్రబాబు కేసులు వాధించేందుకు ఢిల్లీ నుంచి అడ్వకేట్‌

    చంద్రబాబు నాయుడు కేసులో సిద్ధార్ట్‌ లూథ్రా వాధించబోతున్నారు. స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో వాధించేందుకు టీడీపీ ఆయనను ఢిల్లీ నుంచి పిలిపిస్తోంది. ప్రత్యేక విమానంలో అడ్వకేట్‌ సిద్ధార్థ్‌ విజయవాడకు చేరుకోనున్నారు.

  • 09 Sep 2023 03:59 PM (IST)

    టీడీపీ శ్రేణులను అడ్డుకుంటున్న పోలీసులు

    చంద్రబాబు నాయుడును పోలీసులు విజయవాడకు తరలిస్తున్నారు .దీంతో టీడీపీ శ్రేణులు రోడ్డుపై బైఠాయించి ధర్నాకు దిగుతున్నారు. వారిని పోలీసులు అడ్డుకుని రహదారిని క్లీయర్ చేస్తున్నారు.

  • 09 Sep 2023 03:19 PM (IST)

    కాసేపట్లో కుంచనపల్లి సీట్‌ ఆఫీస్‌కు చంద్రబాబు

    చంద్రబాబు అరెస్ట్‌తో రాష్ట్రంలో తీవ్ర సంచలనంగా మారింది. సిల్క్‌ డెవలప్‌మెంట్‌ కేసులో అరెస్టు చేసిన సీఐడీ.. చంద్రబాబును విజయవాడకు తరలిస్తున్నారు. కాసేపట్లో కుంచనపల్లి సీట్‌ ఆఫీస్‌కు తరలించనున్నారు.

  • 09 Sep 2023 02:37 PM (IST)

    కాసేపట్లో విజయవాడకు చంద్రబాబు

    చంద్రబాబు అరెస్టు తర్వాత ఆయనను విజయవాడకు తరలిస్తున్నారు. కాసేపట్లో చంద్రబాబు విజయవాడకు చేరుకోనున్నారు. రహదారులపై టీడీపీ శ్రేణులు రోడ్డుపై బైఠాయిస్తున్నారు. దీంతో అన్ని ప్రాంతాల్లో పోలీసులు మోహరించి ఉన్నారు.

  • 09 Sep 2023 02:14 PM (IST)

    నిలిచిపోయిన చంద్రబాబు కాన్వాయ్‌

    చిలుకలూరిలో చంద్రబాబు కాన్వాయ్‌ ఆగిపోయింది. అక్కడ టీడీపీ కార్యకర్తలు రోడ్డుపై బైఠాయించడంతో కాన్వాయిని నిలిచిపోయింది.

  • 09 Sep 2023 01:47 PM (IST)

    స్కిల్ డెవలప్మెంట్ కేసులో 20 నెలల పాటు చంద్రబాబు ఊసే లేదు: ధూళిపాళ నరేంద్ర

    • స్కిల్ డెవలప్మెంట్ ప్రాజెక్టులో పని చేసిన అధికారులపై కేసులెందుకు పెట్టలేదు

    • స్కిల్ డెవలప్మెంట్ కేసులో 20 నెలల పాటు చంద్రబాబు ఊసే లేదు.

    • స్కిల్ డెవలప్మెంట్ కేసులో నిధుల దుర్వినియోగం జరగలేదని హైకోర్టు వివిధ సందర్భాల్లో చెప్పింది.

    • సీఎం చెబితే నిధులు విడుదల చేసేస్తారా..?

    • ఒక వేళ నిధులు విడుదల చేయడం తప్పైతే అధికారుల పేర్లను ఎందుకు కేసులో పెట్టలేదు.

    • ప్రేమ్ చంద్రారెడ్డి పేరును ఎఫ్ఐఆర్ లో ఎందుకు పెట్టలేదు..?

    • ప్రేమ్ చంద్రారెడ్డి మీ వాడని పెట్టలేదా..?

    • తాను తప్పు చేస్తున్నాననే భావన సీఐడీ చీఫ్ సంజయ్ లో కన్పిస్తోంది.

  • 09 Sep 2023 12:49 PM (IST)

    చంద్రబాబు అరెస్టు దుర్మార్గం – బాలకృష్ణ

    • చంద్రబాబు అరెస్టు దుర్మార్గం -బాలకృష్ణ

    • జగన్ పాలకుడు కాదు.. కక్ష్యదారుడు

    • సీఎం అన్నం తినటం మానేసి కోర్టుల చేత చివాట్లు తింటున్నారు

    • సీఎం జగన్ ప్రజా సంక్షేమాన్ని గాలికొదిలేశారు

    • ప్రతిపక్షనేతలపై కక్షసాధింపులకు పాల్పడుతున్నారు

    • చంద్రబాబుని 16 నిమిషాలైనా జైల్లో పెట్టాలన్నదే జగన్ జీవిత లక్ష్యం

    • చంద్రబాబు నాయుడిని ఏ చట్టం ప్రకారం అరెస్ట్ చేశారు?

    • ఇది కావాలని రాజకీయ కక్షతో చేస్తున్న కుట్ర -బాలకృష్ణ

    • దీనిపై న్యాయపోరాటం చేస్తాం..ప్రజాక్షేత్రంలో తేల్చుకుంటాం -బాలకృష్ణ

  • 09 Sep 2023 12:41 PM (IST)

    చంద్రబాబు అరెస్ట్‌పై అశోక్‌గజపతిరాజు కామెంట్స్

    చంద్రబాబు అరెస్ట్‌ అప్రజాస్వామికమన్నారు టీడీపీ నేత అశోక్‌గజపతిరాజు. ఎందుకు అరెస్ట్‌ చేస్తున్నారో కూడా చెప్పకపోవడం వైసీపీ పాలనకు నిదర్శనమన్నారు.

  • 09 Sep 2023 12:40 PM (IST)

    చంద్రబాబు అరెస్ట్‌ను జనసేన ఖండిస్తోంది: నాదెండ్ల మనోహర్..

    • చంద్రబాబు నాయుడు అరెస్ట్‌ను జనసేన తరపున తీవ్రంగా ఖండిస్తున్నాం

    • ప్రజాస్వామ్యంలో ఇలాంటి ఘటనలు దురదృష్టకరం

    • ఈరోజు మాజీ ముఖ్యమంత్రి అరెస్ట్ తీరు బాధాకరం

    • ప్రభుత్వ పెద్దల ఆదేశాల మేరకు అధికారులు రాజకీయ కక్షతో అరెస్ట్ చేశారు

    • కనీస ఇంగిత జ్ఞానం లేని వ్యక్తి జగన్

    • చంద్రబాబు నాయుడు రాష్ట్రానికి చేసిన అభివృద్ధి ప్రపంచ దేశాల్లో ఆయనకున్న పేరును చూసి తెలుగువాడిగా నేను గర్వపడతాను

    • వ్యక్తిగత కక్ష సాధింపుతో గత మూడు నాలుగు నెలల నుంచి ఏదో రకంగా రెచ్చగొట్టి కేసులు పెట్టాలని చేస్తున్న వాటిని పార్టీలకు అతీతంగా ముక్తంఠంతో ఖండించాలి

    • జగన్ ఎక్కిన దగ్గర నుంచి నెగిటివ్ ఆలోచనలు నెగిటివ్ పనులు తో రాష్ట్రాన్ని చీకట్లోకి నెట్టారు

    • చంద్రబాబు మీద గత 3ఏళ్ల క్రితం కేసు రిజిస్టర్ చేశామని.? ఇప్పుడు అరెస్ట్ చెయ్యటం ఏమిటి.?

    • జనసేన నైతిక బాధ్యతతో టిడిపికి అండగా నిలబడుతుంది

  • 09 Sep 2023 12:33 PM (IST)

    చంద్రబాబు అరెస్ట్ రాజ్యాంగబద్ధంగా, చట్టపరంగా జరిగింది: బొత్స సత్యనారాయణ

    • స్కిల్ డెవలప్మెంట్ లో అవకతవకలు జరిగాయని ఈడి పేర్కొంది

    • చంద్రబాబు అరెస్ట్ రాజ్యాంగబద్ధంగా, చట్టపరంగా జరిగింది

    • అవినీతి చేశారు కాబట్టే అరెస్ట్ చేశారు

    • ఆయన తప్పు చేయకపోతే కోర్టులో తేల్చుకోవాలి

    • దర్యాప్తు సంస్థలు పూర్తిగా దర్యాప్తు చేసిన తరువాత మాత్రమే చంద్రబాబు అరెస్ట్ జరిగింది

    • అన్ని న్యాయపరమైన అంశాలు పరిశీలించిన తరువాత మాత్రమే చంద్రబాబు అరెస్ట్

  • 09 Sep 2023 12:25 PM (IST)

    చంద్రబాబు అరెస్ట్ తప్పనిసరి పరిణామం: విడదల రజిని

    • చంద్రబాబు అరెస్ట్ తప్పనిసరి పరిణామం అన్నారు రాష్ట్ర మంత్రి విడదల రజని

    • చంద్రబాబు లా పరిధి దాటి ఉన్న వ్యక్తిలా అనుకుంటున్నారు

    • ప్రభుత్వ ధనాన్ని దుర్మార్గంగా దోచుకున్నారు

    • స్కిల్ డెవలప్మెంట్ లో ఇది తొలి అరెస్ట్ కాదు, ఇప్పటికే అనేక మంది అరెస్ట్ అయ్యారు

    • ఈ స్కాం లో అనేక మంది పాత్ర ఉంది

    • క్యాబినెట్ నిర్ణయానికి, అగ్రిమెంట్ కి, చెల్లింపులుకి పొంతన లేవు

    • చంద్రబాబు ప్రభుత్వ సొమ్ము దారుణంగా దోచుకున్నారు

  • 09 Sep 2023 12:00 PM (IST)

    ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ దర్శనానికి నారా భువనేశ్వరి

    విజయవాడ: కాసేపట్లో ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మను చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి దర్శించుకోనున్నారు. చంద్రబాబు నాయుడు అరెస్ట్ తర్వాత భువనేశ్వరి హైదరాబాద్ నుంచి హుటాహుటిన విజయవాడకు బయలుదేరారు.

  • 09 Sep 2023 11:55 AM (IST)

    చంద్రబాబు అరెస్ట్‌పై పవన్ కీలక కామెంట్స్..

    • ప్రాథమిక ఆధారాలను చూపించకుండా అర్థరాత్రి అరెస్ట్ చేయడం దుర్మార్గం.

    • విశాఖపట్నంలో జనసేన పట్ల ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు దిగింది.

    • ఏ తప్పూ చేయని నాయకులపై మర్డర్ కేసులు పెట్టీ జైళ్లకు నెడుతున్నారు.

    • శాంతి భద్రతలకు విఘాతం కలిగించే అంశంలో ప్రభుత్వం పోలీసులు అందరి పట్ల ఒకలా ఉండాలి

    • అరెస్టుపై నిరసన తెలిపితే హౌస్ అరెస్టులు చేస్తారా.

    • అక్రమాలు చేసిన జై వెళ్ళి వాళ్ళు విదేశాలకు వెల్లోచ్చు కానీ చంద్రబాబు మద్దతుగా నిరసనలు తెలిపితే తప్పా.

    • చంద్రబాబు అరెస్ట్ లా అండ్ ఆర్డర్ అంశం పూర్తిగా కక్ష సాధింపు చర్యే .

    • చంద్రబాబుకు అండగా ఉంటా మద్దతు తెలుపుతున్నా.

  • 09 Sep 2023 11:09 AM (IST)

    చంద్రబాబు అరెస్ట్‌పై ఏపీ సీఐడీ చీఫ్ ప్రెస్ మీట్..

    • — చంద్రబాబు నాయుడు కనుసన్నల్లోనే ఈ స్కామ్ జరిగింది

    • — ఈ విచారణలో ముఖ్య పాత్రధారిగా చంద్రబాబు ఉన్నారు

    • — వికాస్‌ ఖన్విల్కర్‌ను ఇంకా లోతుగా ప్రశ్నించాల్సి ఉంటుంది

    • — దారి మళ్లింపు నిధుల జాడ కనుగొనేందుకు…

    • — చంద్రబాబును ప్రశ్నించాల్సిన అవసరం ఎంతైనా ఉంది

    • — చంద్రబాబును కస్టడీలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంది

    • — అన్నింటిలోనూ చంద్రబాబు ప్రమేయం ఉందని స్పష్టమైంది

    • — అన్ని వెలుగులోకి తెచ్చేందుకు కస్టడీలో విచారణ జరపాల్సిన అవసరం ఉంది

    • — లోకేశ్‌ను కూడా ప్రశ్నించాల్సి ఉంటుంది

    • — ఇది లోతైన ఆర్థిక నేరం – సీఐడీ చీఫ్‌ సంజయ్‌ కుమార్‌

    • — నిధుల దారి మళ్లింపులో లబ్ది పొందింది చంద్రబాబే

    • — కోర్టు ముందు అన్ని పత్రాలు సమర్పిస్తాం

    • — రూ.371 కోట్లు జీ.ఓ ద్వారా విడుదలయ్యాయి

    • — ఆ 371 కోట్లు డిజైన్‌టెక్‌ సంస్థకు బదిలీ చేయడం జరిగింది

    • — ఆ కంపెనీ నుంచి PVSP, మరో డొల్ల కంపెనీకి బదిలీ అయ్యాయి

  • 09 Sep 2023 11:09 AM (IST)

    మళ్లీ రూటు మారిన చంద్రబాబు కాన్వాయ్…

    ప్రకాశం జిల్లా: చంద్రబాబు నాయుడు కాన్వాయ్ రూటు మళ్లీ మారింది. చంద్రబాబు కాన్వాయ్ పొదిలి నుంచి ఒంగోలు వైపు మళ్లింది. ఒంగోలు నుంచి హైవేపై విజయవాడకు తరలించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

    కాగా ప్రకాశం జిల్లా వ్యాప్తంగా చంద్రబాబు అరెస్టుకు నిరసనగా టీడీపీ శ్రేణుల ఆందోళన కొనసాగుతోంది. మార్కాపురం లోనీ ఎన్టీఆర్ విగ్రహానికి నల్ల గుడ్డతో కళ్లకు గంతలు కట్టి టీడీపీ శ్రేణులు నిరసన తెలిపారు

  • 09 Sep 2023 11:05 AM (IST)

    చంద్రబాబు అరెస్టుకు తెలంగాణ టీడీపీ ఖండన

    తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అరెస్టును తెలంగాణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ తీవ్రంగా ఖండించారు. శనివారం చంద్రబాబు నాయుడు అరెస్టుకు నిరసనగా వైఎస్ జగన్ దిష్టిబొమ్మ దగ్ధం కార్యక్రమం చేపడుతున్నట్టు పేర్కొన్నారు. అక్రమ కేసులు పెట్టి చంద్రబాబు నాయుడిని అరెస్టు చేశారని ఆరోపించారు. పాలన చేతకాని వైసీపీ ప్రభుత్వం టీడీపీ నాయకులను అరెస్టు చేసి ఇబ్బందిపెడుతోందని ధ్వజమెత్తారు. వచ్చే ఎన్నికల్లో ఏపీలో టీడీపీ విజయాన్ని అడ్డుకోలేరని అన్నారు. వచ్చే ఎన్నికల్లో ఓడిపోతామని గ్రహించి చంద్రబాబును నిలువరించే ప్రయత్నంలో భాగంగానే ఈ అక్రమ అరెస్ట్ అని తెలిపారు. జగన్మోహన్ రెడ్డికి ప్రజలు సరైన గుణపాఠం చెప్పే రోజు తొందరలోనే ఉందన్నారు. చంద్రబాబు అక్రమ అరెస్టును అన్ని రాజకీయ పార్టీలు ప్రజా సంఘాలు, మేధావులు, ప్రజాస్వామికవాదులు ఖండించాలని కాసాని జ్ఞానేశ్వర్ పేర్కొన్నారు.

  • 09 Sep 2023 11:01 AM (IST)

    ఆర్టీసీ బస్సులపై ఎలాంటి ఆంక్షలు లేవు..

    రాష్ట్రంలో ఆర్టీ బస్సుల రాకపోకలపై ఎలాంటి ఆంక్షలు లేవని ఏపీఎస్ఆర్టీసీ వెల్లడించింది. యథా ప్రకారం అన్ని సర్వీసులు నడుస్తున్నాయని స్పష్టం చేసింది. ప్రయాణికులు యథావిధిగా తమ ప్రయాణాలు చేసుకోవచ్చునని ఆర్టీసీ పేర్కొంది.

  • 09 Sep 2023 10:23 AM (IST)

    చంద్రబాబు అరెస్ట్ పై మంత్రి కారుమూరి నాగేశ్వరరావు కామెంట్స్..

    • స్కిల్ డెవలప్మెంట్ సంబంధించిన కేసులో చంద్రబాబు అడ్డంగా దొరికిపోయారు.

    • స్కిల్ డెవలప్మెంట్ కు సంబంధించిన రూ.371 కోట్ల రూపాయలను కేబినేట్లో ఎలాంటి ఆమోదం లేకుండా అర్జెంట్ ఫైల్ గా పెట్టేశారు.

    • కనీసం సెక్రటరీ సంతకాలు కూడా లేవు.

    • ఆ కంపెనీ పెట్టిన పెట్టుబడిలో పదిశాతం ప్రభుత్వమే కట్టాలని చెప్పడం, సెక్రటరీ వాళ్లు చెప్పినా వినకుండా స్వయంగా చంద్రబాబే ఆ స్కామ్ కు సూత్రధారి అయ్యారు.

    • షెల్ కంపెనీల ద్వారా ఆ సొమ్మును స్వాహా చేశారు.

    • సీమెన్ కంపెనీకు అసలు సంబంధమే లేదు. చంద్రబాబే దుర్మార్గంగా దోచుకున్నాడు.

    • రెండు ఎకరాలు ఉన్న వ్యక్తికి మూడు లక్షల కోట్ల ఎలా వచ్చింది, ఇలాంటి కుంభకోణాలు చేయబట్టే వచ్చాయి.

    • దీనిపై ఈడీ, ఐటీ శాఖలు క్షుణ్నంగా పరిశీలించిన తర్వాతే చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నారు.

    • ఎన్టీఆర్ ను మానసిక క్షోభకు గురి చేసిన పాపం ఇప్పుడు పండింది.

    • చంద్రబాబు ఇక జైలు ఊసలు లెక్కపెట్టడమే.

  • 09 Sep 2023 10:01 AM (IST)

    విజయవాడ ఏసీబీ కోర్టుకు చంద్రబాబు..

    • మరి కొద్దిసేపట్లో విజయవాడలోని ఎసిబి కోర్టుకు తరలించనున్న సిఐడి పోలీసులు.

    • ఏసిబి కోర్టు ఇంచార్జీ జడ్జి హిమబిందు ఎదుట చంద్రబాబును హాజరు పరచనున్న సిఐడి పోలీసులు.

    • ఏసిబి కోర్టు పరిసర ప్రాంతాల్లో భారి బందోబస్తు ఏర్పాటు చేసిన పోలీసులు.

  • 09 Sep 2023 09:22 AM (IST)

    చంద్రబాబు అరెస్ట్‌పై బీజేపీ చీఫ్ పురంధరేశ్వరి స్పందన..

    టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్‌పై బీజేపీ చీఫ్ పురంధరేశ్వరి ట్విట్టర్ వేదికగా స్పందించారు. సరైన నోటీసులు ఇవ్వకుండా, ఎఫ్‌ఐఆర్‌లో పేరు పెట్టకుండా, ఎక్స్‌ప్లనేషన్ తీసుకోకుండా, ప్రొసీజర్ ఫాలో కాకుండా చంద్రబాబును అరెస్ట్ చేయడం సమర్ధనీయం కాదని ఆమె పేర్కొన్నారు. చంద్రబాబు అరెస్ట్‌ను బీజేపీ ఖండిస్తోందంటూ స్పష్టం చేశారు.

  • 09 Sep 2023 09:09 AM (IST)

    చంద్రబాబు నాయుడు అరెస్టు ను ఖండించిన సీపీఐ నారాయణ

    స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబును సీఐడీ పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. దీనిపై సీపీఐ నేత నారాయణ స్పందించారు. చంద్రబాబు అరెస్ట్‌ను ఆయన ఖండిస్తూ.. ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.

  • 09 Sep 2023 08:55 AM (IST)

    ఎన్ని కేసులైనా ఎదుర్కోవడానికి రెడీ- గంటా శ్రీనివాస్‌

    గంటా శ్రీనివాస్‌తో పాటు టీడీపీ ఎమ్మెల్యే గణబాబు, పలువురు నేతలను ముందస్తు అరెస్ట్ చేసిన పోలీసులు.. సమీప పోలీస్ స్టేషన్ లకు తరలించారు. అరెస్ట్‌ నేపథ్యంలో గంటా శ్రీనివాస్‌ పోలీసులపై మండిపడ్డారు. చంద్రబాబు క్యాంప్ వద్ద అర్ధరాత్రి హైడ్రామా చేయాలిసిన అవసరం ఏముందని ప్రశ్నించారు. అమరావతి భూముల కేసులో నా పేరు చేర్చారు. ఎన్ని విచారణలు జరిగినా నా ప్రస్తావన రాలేదన్నారు. ఓడిపోతానని జగన్మోహన్ రెడ్డికి హీట్ తగలడంతో తనను తెరపైకి తెచ్చారని అన్నారు. ఏ కేసులైనా ఎదుర్కొవడానికి రెడీగా వున్నానని అన్నారు గంటా శ్రీనివాస్.

  • 09 Sep 2023 08:48 AM (IST)

    కడపలో టీడీపీ శ్రేణుల ఆందోళన..

    చంద్రబాబు అరెస్టు కు నిరసనగా నగరంలోని ఎన్టీఆర్ సర్కిల్ వద్ద టిడిపి నేతలు ఆందోళన చేపట్టారు. దీంతో టిడిపి నేతలు గోవర్ధన్ రెడ్డి, హరిప్రసాద్, రాంప్రసాద్, ఇతర కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు. ముందస్తుగానే కడప డిపో నుంచి అన్ని బస్సుల సర్వీసులు నిలిపివేశారు అధికారులు. బయట డిపోల నుంచి వచ్చిన బస్సులను కూడా ఎక్కడికక్కడ నిలిపివేశారు. పోలీసుల సూచనలతోనే ఆర్టీసీ అధికారులు ఈ ర్ణయం తీసుకున్నారు. బస్సులు లేకపోవటంతో ప్రయాణికులు బస్టాండ్‌లోనే పడిగాపులు పడాల్సి వస్తోంది.

  • 09 Sep 2023 08:37 AM (IST)

    శ్రీకాకుళం జిల్లాలో ముందస్తు అరెస్ట్ లు..

    టీడీపీ అదినేత చంద్రబాబు అరస్ట్ నేపధ్యంలో జిల్లాలో కొనసాగుతున్న టిడిపి నేతల ముందస్తు అరెస్టులు. టిడిపి మాజీ ఎమ్మెల్యే కలమట వెంకటరమణను అదుపులోకు తీసుకుని టెక్కలి పోలీస్ స్టేషన్ కు తరలించారు పోలీసులు. అటు, ఇచ్ఛాపురం ఎమ్మెల్యే బెందాలం అశోక్ ను అరెస్ట్ చేసేందుకు అతని నివాసం వద్దకు చేరుకున్నారు పోలీసులు.  ఎమ్మెల్యే అశోక్  పోలీసులకు మధ్య తీవ్ర వాగ్వాదం నెలకొంది. పాలకొండ టిడిపి ఇన్ చార్జ్ నిమ్మక జయక్రిష్ణ ను అతని స్వగ్రామం రాజపురంలో హౌస్ అరస్ట్ చేశారు పోలీసులు. మరోవైపు, ముందస్తు చర్యలలో బాగంగా జిల్లా వ్యాప్తంగా ఆర్టీసీ బస్సులు నిలిపివేయటంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తోంది.

  • 09 Sep 2023 08:27 AM (IST)

    రాజోలు యువగళం క్యాంప్ వద్ద నారా లోకేష్ నిరసన

    చంద్రబాబు నాయుడు అరెస్ట్ తో రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ నేతల ఆందోళన చేపడుతున్నారు. రాజోలు నియోజకవర్గం యువగళం క్యాంప్ వద్ద నారా లోకేష్ నిరసన చేపట్టారు. అడ్డుకున్న పోలీసులు లోకేష్ ను అక్కడ్నుంచి తరలించే ప్రయత్నిస్తున్నారు.

  • 09 Sep 2023 08:24 AM (IST)

    అల్లూరి సీతారామరాజు జిల్లాలో నిలిచిపోయిన బస్సులు..

    చంద్రబాబు అరెస్ట్ నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యగా జీకే వీధి మండలం సీలేరులో బస్సులను నిలిపివేశారు పోలీసులు. సీలేరు నుంచి రాజమండ్రి, విశాఖ, డొంకరాయి నుంచి పాడేరు వెళ్లే బస్సులను ఎక్కడికక్కడ నిలిపివేశారు.

  • 09 Sep 2023 08:22 AM (IST)

    బాబు అరెస్ట్‌తో బెజవాడలో అప్రమత్తం..

    చంద్రబాబు నాయుడు అరెస్ట్ తో బెజవాడలో పోలీసులు అప్రమత్తమయ్యారు. టీడీపీ నేతల ఇళ్ళవద్ద పీకేట్లు ఏర్పాటు చేశారు. ఎలాంటి అల్లర్లు జరగకుండా ముందస్తుగా భారీ బందోబస్తుతో పోలీస్ యంత్రాంగం పహారా ఏర్పాటు చేసింది.

  • 09 Sep 2023 08:17 AM (IST)

    టీడీపీ ముఖ్య నేతల హౌజ్ అరెస్ట్..

    చంద్రబాబు అరెస్ట్ నేపథ్యంలో అటు టీడీపీ నేతల ఇళ్లను కూడా ముట్టడించారు పోలీసులు.  మాజీ మంత్రి గంటా శ్రీనివాస్ తో పాటు ముఖ్య నేతల ఇళ్ళ వద్ద కు పోలీసులు భారీగా చేరుకున్నారు. టీడీపీ శ్రేణులు  ఆందోళనలు చేయకుండా ఎక్కడికక్కడ హౌజ్ అరెస్ట్ చేస్తున్నారు.

  • 09 Sep 2023 08:13 AM (IST)

    చంద్రబాబు అరెస్ట్ తో బస్సులు నిలిపేసిన ఆర్టీసీ…

    చంద్రబాబు అరెస్ట్ తో ఏపీ హీటెక్కింది. విజయవాడలో బాబు అరెస్ట్ సందర్భంగా ఆర్టీసీ బస్సులు నిలిచిపోయాయి. సిటీ బస్సులతో పాటు దూర ప్రాంతాలకు వెళ్ళే బస్సులన్నీ నిలిపేశారు అధికారులు…మళ్లీ పోలీస్ ఇన్స్ట్రక్షన్స్ వచ్చే వరకు బస్సులు బంద్.. బస్సులు నిలిపివేయటంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు.

     

Follow us on