AP Weather Report: ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అలర్ట్.. ఈ ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం

|

Apr 24, 2022 | 4:38 PM

AP Weather Alert: ఆంధ్రప్రదేశ్, యానాంలో దిగువ ట్రోపో ఆవరణంలో దక్షిణ, నైరుతి గాలులు వీస్తున్నాయని అమరావతి వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు.

AP Weather Report: ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అలర్ట్.. ఈ ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం
Imd
Follow us on

AP Weather Alert: ఆంధ్రప్రదేశ్, యానాంలో దిగువ ట్రోపో ఆవరణంలో దక్షిణ, నైరుతి గాలులు వీస్తున్నాయని అమరావతి వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. వీటి ఫలితంగా రాష్ట్రంలో రాగల మూడు రోజుల వరకు వాతావరణంలో మార్పులు చోటు చేసుకుంటాయని చెప్పారు. ఈ మేరకు రాష్ట్ర వాతావరణ నివేదికను విడుదల చేశారు ఐఎండీ అధికారులు. ఈ రిపోర్ట్ ప్రకారం.. ఉత్తర కోస్తాంధ్ర, యానాం ప్రాంతంలో ఇవాళ వాతావరణం పొడిగా అవకాశం ఉంది. రేపు అంటే సోమవారం నాడు అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇ ఎల్లుండి వాతావరణం పొడిగా ఉండే అవకాశం ఉంది.

దక్షిణ కోస్తాంధ్రలో ఇవాళ, రేపు, ఎల్లుండి వాతావరణం పొడిగా ఉంటుందని వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. రాయలసీమ జిల్లాల్లో ఇవాళ వాతావరణం పొడిగా ఉంటుందని చెప్పారు. అలాగే రేపు, ఎల్లుండి తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం డైరెక్టర్ వెల్లడించారు.

Also read:

PBKS vs CSK IPL 2022: పంజాబ్‌ ముందు చెన్నై రికార్డ్‌ ఎలా ఉందంటే..!

Credit Card: మీరు క్రెడిట్‌ కార్డులను వాడుతున్నారా..? కార్డును తెలివిగా ఉపయోగించడానికి చిట్కాలు..!

Ebola: ఆఫ్రికాలో ఎబోలా గుబులు.. ప్రపంచ దేశాలనూ వణికిస్తున్న వైరస్