ఏలూరు ఘటనపై స్పందించిన కేంద్ర ప్రభుత్వం.. ఎలాంటి సాయం కావాలన్నా చేస్తాం.. ఏపీ సీఎస్‏కు కేంద్ర మంత్రి ఫోన్..

|

Dec 07, 2020 | 7:24 AM

పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో అంతుచిక్కని వ్యాధి ప్రజలకు ప్రబలిన ఘటనపై కేంద్ర హోంశాఖ స్పందించింది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి

ఏలూరు ఘటనపై స్పందించిన కేంద్ర ప్రభుత్వం.. ఎలాంటి సాయం కావాలన్నా చేస్తాం.. ఏపీ సీఎస్‏కు కేంద్ర మంత్రి ఫోన్..
Follow us on

పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో అంతుచిక్కని వ్యాధి ప్రజలకు ప్రబలిన ఘటనపై కేంద్ర హోంశాఖ స్పందించింది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్నికు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి ఫోన్ చేసి వివరాలను తెలుసుకున్నారు. ఏపీ ప్రభుత్వానికి ఎలాంటి సాయం కావాలన్నా చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు. అటు ఈ ఘటనకు సంబంధించి ఇప్పటికే ఏపీ గవర్నర్ కార్యాలయంతో కేంద్ర హోంశాఖ ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతోంది. గవర్నర్ నుంచి ఘటనకు సంబంధించి పూర్తి నివేదిక వచ్చాక కేంద్రం స్పందించే అవకాశం ఉంది. కాగా పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో పరిస్థితులు ఆందోళనకరంగా మారుతున్నాయి. ఏలూరులోని దక్షిణ వీధి, తూర్పు వీధి, పడమర వీధి, అశోక్ నగర్, అరుంధతి పేట తదితర ప్రాంతాలకు చెందిన వందలాది మంది ప్రజలు నురగలు కక్కుతూ పడిపోవడం, వాంతులు, తలపోటు ఇతర లక్షణాలతో ఆసుపత్రిలో చెరుతున్నారు.