Amit Shah – Chandrababu: చంద్రబాబుకు అమిత్ షా ఫోన్.. ఏం మాట్లాడారంటే

తెలుగుదేశం అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత  చంద్రబాబుకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఫోన్ చేశారు.

Amit Shah - Chandrababu: చంద్రబాబుకు అమిత్ షా ఫోన్.. ఏం మాట్లాడారంటే
Babu Shah

Updated on: Oct 27, 2021 | 3:58 PM

తెలుగుదేశం అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత  చంద్రబాబుకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఫోన్ చేశారు. ఈ నెల 25, 26 తేదీల్లో ఢిల్లీలో పర్యటించిన చంద్రబాబు చంద్రబాబు.. అమిత్‌షా అపాయింట్‌మెంట్ కోరారుకశ్మీర్ పర్యటన, ఇతర కార్యక్రమాల షెడ్యూల్ వలన అపాయింట్‌మెంట్ కుదరకపోవడంతో.. ఈ రోజు చంద్రబాబుకు అమిత్ షా ఫోన్ చేసి వివరాలు తెలుసుకున్నట్లు టీడీపీ వర్గాలు తెలిపాయి. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను అమిత్ షాకు చంద్రబాబు వివరించినట్లు తెలిసింది. మాదకద్రవ్యాలకు వ్యతిరేకంగా టీడీపీ నేతలు పోరాడుతుంటే.. వైసీపీ దాడులకు తెగపడటంతోపాటు పోలీసు వ్యవస్థను నిర్వీర్యం చేస్తూ బాధితులపైనే అక్రమ కేసులు బనాయిస్తోందని బాబు ఫిర్యాదు చేసినట్లు సమాచారం.

ఏపీలో శాంతి భద్రతలు అదుపు తప్పాయని.. ఆర్టికల్ 356 ఉపయోగించి రాష్ట్రపతి పాలన విధించాలని రాష్ట్రపతి సహా కేంద్రంలో పెద్దలను కోరేందుకు చంద్రబాబు ఢిల్లీ వెళ్లారు.  సోమవారం రాష్ట్రపతిని కలిసి 8 పేజీల మెమోరాండంను అందజేశారు. దీంతోపాటు 323 పేజీల పుస్తకాన్ని ఇచ్చారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాలను కూడా కలవాలనుకున్నారు. అయితే.. అమిత్ షా జమ్మూ కాశ్మీర్ పర్యటనలో ఉండటంతో వీలుపడలేదు. ఈ క్రమంలో షా పర్యటన నుంచి తిరిగొచ్చిన తర్వాత బాబుకు కాల్ చేసి వివరాలు తెలుసుకున్నారు.

ఇక రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌కు ఇచ్చిన మెమోరాండంలో టీడీపీ కీలక డిమాండ్లను ప్రస్తావించింది. రాష్ట్రంలో గంజాయి, డ్రగ్స్ మాఫియా పేట్రేగిపోవడమే కాకుండా పోలీసుల అండతో ప్రభుత్వమే రాజ్యహింసకు పాల్పడతున్నందున రాష్ట్రపతి పాలన విధించాలని డిమాండ్ చేశారు. టీడీపీ కేంద్ర కార్యాలయంతో పాటు పలు చోట్ల పార్టీ ఆఫీసులు, నాయకుల ఇళ్లపై జరిగిన దాడులపై సీబీఐ విచారణ జరపాలని కోరారు. డీజీపీ గౌతమ్ సవాంగ్ ను రీకాల్ చేయాలని, డ్రగ్స్ మాఫియా వ్యవహారాలపై లోతైన విచారణ జరిపించాలని పేర్కొన్నారు.

Also Read: “చావనైనా చస్తామ్ కానీ, ఈ వాహనాన్ని పోనివ్వం”.. ఇంతకీ అందులో ఏమున్నాయ్

Loading...
Unable to load recommendations.
Follow Us