జగన్‌ బెయిల్‌ రద్దు చేయాలన్న పిటిషన్‌పై సీబీఐ కోర్టులో వాడీవేడీగా వాదనలు..ధర్మాసనం ఏమన్నదంటే

|

Jul 01, 2021 | 6:01 PM

CM Jagan: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్  జగన్మోహన్ రెడ్డి బెయిల్‌ రద్దు చేయాలన్న పిటిషన్‌పై సీబీఐ కోర్టులో గురువారం వాదనలు జరిగాయి.

జగన్‌ బెయిల్‌ రద్దు చేయాలన్న పిటిషన్‌పై సీబీఐ కోర్టులో వాడీవేడీగా వాదనలు..ధర్మాసనం ఏమన్నదంటే
Cm Jagan
Follow us on

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్  జగన్మోహన్ రెడ్డి బెయిల్‌ రద్దు చేయాలన్న పిటిషన్‌పై సీబీఐ కోర్టులో గురువారం వాదనలు జరిగాయి. అధికారం ఉపయోగించి జగన్ సాక్షులను ప్రభావితం చేస్తున్నారని ఎంపీ రఘురామకృష్ణరాజు తరఫున న్యాయవాది శ్రీవెంకటేశ్‌ వాదనలు వినిపించారు. పిటిషన్‌ వేసిన తనపైనే తప్పుడు కేసులు పెట్టి వేధించారని రఘురామ కోర్టుకు తెలిపారు. సీబీఐ అభిప్రాయం వెల్లడించకపోవడం సరికాదని రఘురామ న్యాయవాది కోర్టుకు విన్నవించారు. మరోవైపు రఘురామకు పిటిషన్‌ వేసే అర్హత లేదని జగన్‌ తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. రాజకీయ ఉద్దేశాలతోనే పిటిషన్‌ వేశారన్నారని ధర్మాసనానికి వివరించారు. ఇరువైపుల వాదనలు విన్న హైదరాబాద్​లోని సీబీఐ కోర్టు.. రఘురామ ఆరోపణలకు బలమైన ఆధారాలు ఇవ్వలేదని అభిప్రాయపడింది. లిఖితపూర్వక వాదనలు సమర్పించాలని ఆదేశించింది. జగన్‌, రఘురామ, సీబీఐ లిఖితపూర్వక వాదనలు సమర్పించాలని సూచించింది. విచారణ ఈనెల 8కి వాయిదా వేసింది.

రఘురామ కృష్ణరాజు ఎంపీ సభ్యత్వం కోల్పోయినట్లే..ఎంపీ భరత్‌ రామ్‌

వెసీపీ తరఫున నరసాపురం ఎంపీగా గెలిచి ఆ పార్టీపైన, సీఎం జగన్‌పైన పెద్ద ఎత్తున విమర్శలు రఘురామకృష్ణరాజు  వ్యవహరంపై రాజమహేంద్రవరం ఎంపీ భరత్‌ రామ్‌ ఫైరయ్యారు. పార్టీ సిద్ధాంతాన్ని, పార్టీ నిర్ణయాలకు వ్యతిరేకంగా వ్యవహరించడం ద్వారా ఎంపీ రఘురామ కృష్ణరాజు పార్టీ సభ్యత్వంతో పాటు, పార్లమెంటు సభ్యత్వాన్ని వలంటీర్‌గానే కోల్పోయారని  మార్గాని భరత్‌ రామ్‌ అభిప్రాయపడ్డారు. రఘురామ కృష్ణరాజు వరుసగా సీఎం జగన్మోహన్‌ రెడ్డికి రాస్తున్న లేఖలపై మంగళవారం ఎంపీ మార్గాని భరత్‌ రామ్‌ స్పందించారు. పార్టీ విప్‌ను ధిక్కరిస్తూ, పార్టీలో ఉంటూ పార్టీ వైఖరిని దూషిస్తున్న వ్యక్తి వాలంటీర్‌గానే ఆ పార్టీ సభ్యత్వాన్ని కోల్పోయినట్లు అవుతుందని భరత్ పేర్కొన్నారు.

Also Read:  ‘విశ్వ విఖ్యాత నట సార్వభౌమ’ ఎన్టీఆర్ తనను ఎలా చూడాలనుకున్నారో చెప్పేసిన బాలయ్య

ఖమ్మం నడిరోడ్డిపై మనిషి తల.. మరి కొంచెం దూరం వెళ్లగానే….