బోండా ఉమాకు పోలీసుల షాక్..

| Edited By:

Jan 10, 2020 | 12:14 PM

టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే బోండా ఉమాకు పోలీసులు షాక్ ఇచ్చారు. మాచవరం పోలీస్ స్టేషన్‌లో ఆయనపై కేసు నమోదు చేశారు. డ్యూటీలో ఉన్న యస్.ఐ. అర్జున్, పోలీస్ సిబ్బందిపై బోండా ఉమా దౌర్జన్యానికి పాల్పడుతూ.. వారి విధులకు ఆటంకం కలిగించారన్న ఆరోపణలపై ఈ కేసు నమోదయ్యింది. అమరావతి రాజధాని ఉద్యమంపై ఆందోళన చేసేందుకు తన ఇంటి నుండి.. ర్యాలీగా బయలుదేరిన బోండా ఉమాను పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసులకు, బోండా ఉమాకు మధ్య […]

బోండా ఉమాకు పోలీసుల షాక్..
Follow us on

టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే బోండా ఉమాకు పోలీసులు షాక్ ఇచ్చారు. మాచవరం పోలీస్ స్టేషన్‌లో ఆయనపై కేసు నమోదు చేశారు. డ్యూటీలో ఉన్న యస్.ఐ. అర్జున్, పోలీస్ సిబ్బందిపై బోండా ఉమా దౌర్జన్యానికి పాల్పడుతూ.. వారి విధులకు ఆటంకం కలిగించారన్న ఆరోపణలపై ఈ కేసు నమోదయ్యింది. అమరావతి రాజధాని ఉద్యమంపై ఆందోళన చేసేందుకు తన ఇంటి నుండి.. ర్యాలీగా బయలుదేరిన బోండా ఉమాను పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసులకు, బోండా ఉమాకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో ఆయనపై పోలీసులు 353, 506, 188 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.