Andhra Pradesh: ఏపీ BRS అధ్యక్షుడు ఆయనే..! సోమవారం పార్టీలో చేరిక

|

Jan 01, 2023 | 9:50 PM

ఏపీలో విస్తరణకు బీఆర్ఎస్‌ వేగంగా అడుగులు వేస్తోంది. త్వరలోనే పార్టీ అధ్యక్షుడ్ని నియమించనుంది. సోమవారం ఏపీ నుంచి పలువురు నేతలు బీఆర్‌ఎస్‌లో చేరనున్నారు.

Andhra Pradesh: ఏపీ BRS అధ్యక్షుడు ఆయనే..! సోమవారం పార్టీలో చేరిక
CM KCR's BRS in Andhra Pradesh
Follow us on

BRS విస్తరణపై చాలా సీరియస్‌గా వర్క్ చేస్తున్నారు సీఎం కేసీఆర్. ఫుల్ ఫోకస్‌తో ముందుకు వెళ్తున్నారు. ఈ క్రమంలో ఆంధ్రాలో భారత్ రాష్ట్ర సమితి అధ్యక్షుడిగా కీలక నాయకుడిని నియమించబోతున్నట్లు సమాచారం. బీఆర్ఎస్‌ ఏపీ అధ్యక్షుడిగా మాజీ IAS తోట చంద్రశేఖర్ పరిశీలనలో ఉన్నారు. సీఎం కేసీఆర్ సమక్షంలో సోమవారం పార్టీలో చేరనున్నారు తోట చంద్రశేఖర్. సోమవారం మధ్యాహ్నం 12 నుంచి తెలంగాణ భవన్‌లో చేరికలు ఉండనున్నాయి. మాజీ మంత్రి రావెల కిశోర్ కూడా బీఆర్‌ఎస్‌లో చేరునున్నట్లు తెలుస్తుంది. వీళ్లిద్దరితో పాటు మరికొందరు మాజీ బ్యూరోక్రాట్లు, నాయకులు కూడా బీఆర్ఎస్‌లో చేరతారని చెప్తున్నారు. తోట చంద్రశేఖర్ బీఆర్ఎస్‌లో చేర్చుకోవడం ద్వారా- ఏపీలో బలంగా ఉన్న కాపు సామాజిక వర్గం ఓటు బ్యాంకును ఎఫెక్ట్ చేసేలా కేసీఆర్ వ్యూహం రచించారు.  రిటైర్డ్ ఐఎఎస్ అధికారి అయిన చంద్రశేఖర్ కాపు సామాజిక వర్గానికి చెందినవారు. ఆయన పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడ్ని చేస్తే కాపుల్లో కొందరు బీఆర్ఎస్ వైపునకు ఆకర్షితులవుతారని కేసీఆర్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.

తోట చంద్రశేఖర్ ఇదివరకు వైసీపీలో పని చేశారు. 2014లో ఏలూరు లోక్ సభ నుంచి వైసీపీ అభ్యర్థిగా బరిలోకి దిగి.. టీడీపీ అభ్యర్థి మాగంటి బాబు చేతిలో పరాజయం పాలయ్యారు. ఆ తరువాత జనసేనలో చేరి.. యాక్టివ్‌గా పనిచేస్తున్నారు. అప్పటి నుంచి పవన్ సన్నిహితుల్లో ఒకరిగా మెలుగుతున్నారు. 2019 ఎన్నికల్లో గుంటూరు వెస్ట్ నుంచి పోటీ చేసినా.. ఫలితం దక్కలేదు.

ఇక రాజధాని అమరావతి ప్రాంతంలో BRS పార్టీ కేంద్ర కార్యాలయం ఏర్పాటయ్యే అవకాశాలు ఉన్నాయి. దీనికి సంబంధించిన అద్దె భవనాన్ని కూడా కేసీఆర్ ఫైనల్ చేసినట్లు చెబుతున్నారు ఆ పార్టీ నాయకులు. ఈ వ్యవహారాలు అన్నీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చూసుకుంటున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..