Vijayawada: విజయవాడ బస్టాండ్‌లో దారుణం.. ప్లాట్‌ఫామ్‌పైకి దూసుకెళ్లిన బస్సు.. ముగ్గురు దుర్మరణం

Vijayawada Bus Station Accident: విజయవాడ బస్టాండ్‌లో దారుణం చోటుచేసుకుంది. ఓ ఆర్టీసీ బస్సు బీభత్సం సృష్టించింది. ఉన్నట్టుండి ఓ సూపర్ లగ్జరీ బస్సు ప్లాట్‌ఫామ్‌పైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ముగ్గురు దుర్మరణం చెందారు. విజయవాడ బస్టాండ్‌లోని ప్లాట్‌ఫామ్‌ నెంబర్‌ 12 దగ్గర ఈ ప్రమాదం చోటుచేసుకుంది.

Vijayawada: విజయవాడ బస్టాండ్‌లో దారుణం.. ప్లాట్‌ఫామ్‌పైకి దూసుకెళ్లిన బస్సు.. ముగ్గురు దుర్మరణం
Bus mishap in Vijayawada

Updated on: Nov 06, 2023 | 2:04 PM

Vijayawada Bus Station Accident: విజయవాడ బస్టాండ్‌లో దారుణం చోటుచేసుకుంది. ఓ ఆర్టీసీ బస్సు బీభత్సం సృష్టించింది. ఉన్నట్టుండి ఓ సూపర్ లగ్జరీ బస్సు ప్లాట్‌ఫామ్‌పైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ముగ్గురు దుర్మరణం చెందారు. విజయవాడ బస్టాండ్‌లోని ప్లాట్‌ఫామ్‌ నెంబర్‌ 12 దగ్గర ఈ ప్రమాదం చోటుచేసుకుంది. సోమవారం ఉదయం విజయవాడ నుంచి గుంటూరు వెళ్లాల్సిన లగ్జరీ బస్సు.. ఉన్నట్టుండి ఫ్లాట్ ఫాంపైకి దూసుకెళ్లింది. ఈ క్రమంలో బస్సు చక్రాల కింద పలువురు ప్రయాణికులు పడ్డారు. ప్రయాణికులను రక్షించేందుకు అధికారులు వెంటనే చర్యలు తీసుకున్నారు. ఈ ఘటనలో చిన్నారి, కండక్టర్ తోపాటు మరోకరు మరణించారు. మృతులు కండక్టర్ వీరయ్య, కుమారి, చిన్నారి అయాన్స్ గా గుర్తించారు.

లగ్జరీ బస్సు బ్రేక్ ఫెయిల్ కావడంతోనే.. ప్లాట్‌ఫాంపైకి దూసుకెళ్లినట్లు అధికారులు చెబుతున్నారు. ఈ ఘటనలో పలువురికి గాయాలు కాగా.. వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారికి చికిత్స అందుతుందని చెబుతున్నారు. పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు పేర్కొంటున్నారు.

బస్టాండ్‌లో ప్రమాదస్థలిని ఆర్టీసీ ఎండీ ద్వారక తిరుమలరావు పరిశీలించారు. ప్రమాదంపై విచారణకు ఆదేశించారు. ఆర్టీసీ అధికారులు విచారణ చేపట్టారు. 24 గంటల్లో విచారణ చేపట్టి.. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మృతుల కుటుంబాలకు ఐదు లక్షల రూపాయలు ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు.

రివర్స్ గేర్ వేయబోయి.. ఫస్ట్ గేర్ వేయడంతోనే ఈ ప్రమాదం జరిగినట్లు పేర్కొంటున్నారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

లైవ్ వీడియో చూడండి..

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..