
రాబోయే ఎన్నికల కోసం అభ్యర్థులను ప్రకటించాక టీడీపీకి షాక్‌లు తగులుతున్నాయి. ఇటీవల ఆ పార్టీ నుంచి నెల్లూరు రూరల్ సీటును కైవసం చేసుకున్న అదాల ప్రభాకర్ ఆ పార్టీని వీడగా.. తాజాగా శ్రీశైలం బరి నుంచి బుడ్డా రాజశేఖర్ రెడ్డి తప్పుకోవాలనుకుంటున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీనిపై చర్చించేందుకు ఆయన సాయంత్రం వెల్పనూరులో కార్యకర్తలతో భేటీ కానున్నట్లు తెలుస్తోంది. దీంతో టీడీపీ నేతలలో కలకలం చోటుచేసుకుంది.