Brother Anil: వైఎస్ వివేకానంద రెడ్డి హత్యపై బ్రదర్ అనిల్ సంచలన కామెంట్స్.. దోషులు తప్పించుకోలేరని వ్యాఖ్యలు..

వైఎస్ వివేకానంద రెడ్డి(ys vivekananda reddy) మర్డర్‌పై  బ్రదర్ అనిల్(Brother Anil) సంచలన వ్యాఖ్యలు చేశారు. దోషులు తప్పించుకోలేరని చెప్పారు...

Brother Anil: వైఎస్ వివేకానంద రెడ్డి హత్యపై బ్రదర్ అనిల్ సంచలన కామెంట్స్.. దోషులు తప్పించుకోలేరని వ్యాఖ్యలు..
Brother Anil

Updated on: Mar 14, 2022 | 2:30 PM

వైఎస్ వివేకానంద రెడ్డి(ys vivekananda reddy) మర్డర్‌పై  బ్రదర్ అనిల్(Brother Anil) సంచలన వ్యాఖ్యలు చేశారు. దోషులు తప్పించుకోలేరని చెప్పారు. సీబీఐ(CBI) నిష్పాక్షిక దర్యాప్తు చేస్తోందని అన్నారు. ఖచ్చితంగా న్యాయం జరుగుతుందని పేర్కొన్నారు. అయితే వివేకానంద రెడ్డి హత్య కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. కేసులో అప్రూవర్‌గా మారిన వివేకా మాజీ డ్రైవర్ దస్తగిరి వాంగ్మూలం, ఆ తర్వాత అతడు ఇచ్చిన ఫిర్యాదు ఇతర అంశాలు బయటకురావడంతో ఏ క్షణానైనా కీలక వ్యక్తులను సీబీఐ అదుపులోకి తీసుకోవచ్చన్న ప్రచారం జరుగుతోంది.

ఈ నేపథ్యంలో హత్య కేసులో ఊహించని మలుపు చోటు చేసుకుంది. వివేకా హత్య కేసులో నిందితుడిగా ఉన్న దెవిరెడ్డి శివశంకర్ రెడ్డి భార్య తులసమ్మ కడప జిల్లా పులివెందుల కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అందులో పలు సంచలన విషయాలను ఆమె పేర్కొన్నారు. వై.ఎస్ వివేకానందరెడ్డి హత్య వెనుక ఆయన కుటుంబ సభ్యుల పాత్ర ఉందని ఆమె అనుమానం వ్యక్తం చేశారు. వివేకా రెండో వివాహం చేసుకోవడంతో కుటుంబంలో కొన్నేళ్లుగా అంతర్గత విభేదాలున్నాయన్నారు.

Read Also.. AP High Court: కొత్త జిల్లాలపై ఏపీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు.. మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేమని ప్రకటన..