AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తిరుపతి ప్యాసింజర్‌లో బాంబ్‌ కలకలం !

తిరుపతి నుండి గుంతకల్లు వెళ్తోన్న ప్యాసింజర్‌ ట్రైన్‌కు బాంబ్‌ బెదిరింపు కాల్‌ కలకలం రేపింది. అనంతపురం జిల్లా కదిరిలో ట్రైన్‌ను నిలిపివేసిన అధికారులు హుటాహుటినా బాంబ్‌స్క్వాడ్‌ తనిఖీలు చేపట్టారు. కాసేపు ప్రయాణికులంతా భయం గుప్పిట్లో గడిపారు. ఏక్షణాన ఏం జరుగుతుందోనని ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమన్నారు.. వివరాల్లోకి వెళితే… అనంతపురం జిల్లా కదిరి వద్ద ప్యాసింజర్‌ ట్రైన్‌లో బాంబ్‌ ఉందంటూ అజ్ఞాత వ్యక్తులు లెటర్‌ రాసి ప్రయాణికుల మధ్యలో పడవేశారు. అది చూసిన ప్రయాణికులు ట్రైన్‌లోని మూడో […]

తిరుపతి ప్యాసింజర్‌లో బాంబ్‌ కలకలం !
Pardhasaradhi Peri
|

Updated on: Dec 23, 2019 | 7:19 PM

Share

తిరుపతి నుండి గుంతకల్లు వెళ్తోన్న ప్యాసింజర్‌ ట్రైన్‌కు బాంబ్‌ బెదిరింపు కాల్‌ కలకలం రేపింది. అనంతపురం జిల్లా కదిరిలో ట్రైన్‌ను నిలిపివేసిన అధికారులు హుటాహుటినా బాంబ్‌స్క్వాడ్‌ తనిఖీలు చేపట్టారు. కాసేపు ప్రయాణికులంతా భయం గుప్పిట్లో గడిపారు. ఏక్షణాన ఏం జరుగుతుందోనని ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమన్నారు.. వివరాల్లోకి వెళితే…

అనంతపురం జిల్లా కదిరి వద్ద ప్యాసింజర్‌ ట్రైన్‌లో బాంబ్‌ ఉందంటూ అజ్ఞాత వ్యక్తులు లెటర్‌ రాసి ప్రయాణికుల మధ్యలో పడవేశారు. అది చూసిన ప్రయాణికులు ట్రైన్‌లోని మూడో కోచ్‌లో బాంబు ఉన్నట్లుగా లేఖలో రాసి ఉండడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే అప్రమత్తమైన అధికారులు, కదిరి టౌన్‌ పోలీసులు రైల్వే స్టేషన్‌కు చేరుకున్నారు. రైలు 3వ నెంబర్‌ కోచ్‌లో క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించారు. ఎటువంటి బాంబ్‌ లేదని తేలడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. గంట ఆలస్యంగా ట్రైన్‌  బయల్దేరింది. తిరుపతి నుండి గుంతకల్లు వెళ్తోన్న ప్యాసింజర్‌లో బాంబ్‌ ఉందంటూ లేఖరాసిన ఆగంతకున్ని పోలీసులు గుర్తించారు. గణేష్‌ అనే వ్యక్తి ఆ లేఖరాసినట్లుగా తేల్చిన పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. ఎందుకు ఇలా చేశాడు.. ఈ ఘటన వెనక ఇంకెవరైనా ఉన్నారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Follow Us
20 ఏళ్లు దాటిన మహిళల్లో పెరుగుతున్న భయం.. ఈ లక్షణాలు కనిపిస్తే..
20 ఏళ్లు దాటిన మహిళల్లో పెరుగుతున్న భయం.. ఈ లక్షణాలు కనిపిస్తే..
NTA సంస్కరణల కోసం హై-పవర్డ్ కమిటీ.. టీమ్‌లో ఉన్నది వీళ్లే..
NTA సంస్కరణల కోసం హై-పవర్డ్ కమిటీ.. టీమ్‌లో ఉన్నది వీళ్లే..
విషపూరితమైన ఈ ఆకు ఘుమఘుమలాడే బిర్యానీలో ఎందుకు వేస్తారు?
విషపూరితమైన ఈ ఆకు ఘుమఘుమలాడే బిర్యానీలో ఎందుకు వేస్తారు?
తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు.. ఇదిగో లేటెస్ట్ వెదర్ రిపోర్ట్
తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు.. ఇదిగో లేటెస్ట్ వెదర్ రిపోర్ట్
బాలయ్యను పరామర్శించిన సీఎం చంద్రబాబు.. డాక్టర్లు ఏమంటున్నారంటే?
బాలయ్యను పరామర్శించిన సీఎం చంద్రబాబు.. డాక్టర్లు ఏమంటున్నారంటే?
చిన్న ముక్కతో ఆరోగ్యం.. వంటింటి మసాలా కాదు ఆరోగ్యానికి సహజ ఔషధం!
చిన్న ముక్కతో ఆరోగ్యం.. వంటింటి మసాలా కాదు ఆరోగ్యానికి సహజ ఔషధం!
హ్యాట్రిక్ విక్టరీ.. సిరీస్ క్లీన్‌స్వీప్ చేసిన భారత్..
హ్యాట్రిక్ విక్టరీ.. సిరీస్ క్లీన్‌స్వీప్ చేసిన భారత్..
బంగారం కొనాలా వద్దా? శ్రావణ మాసంలో ధర తగ్గుతుందా? పెరుగుతుందా?
బంగారం కొనాలా వద్దా? శ్రావణ మాసంలో ధర తగ్గుతుందా? పెరుగుతుందా?
ఆ జబర్దస్త్ నటుడి పేరును మా ఫోన్‌లో 'గాడ్' అని సేవ్ చేసుకున్నాం
ఆ జబర్దస్త్ నటుడి పేరును మా ఫోన్‌లో 'గాడ్' అని సేవ్ చేసుకున్నాం
ప్రయత్నం చిన్నదే అయినా ఫలితం గొప్పగా ఉంటుంది.. తెలివైన కాకి కథ
ప్రయత్నం చిన్నదే అయినా ఫలితం గొప్పగా ఉంటుంది.. తెలివైన కాకి కథ