AP BJP: యూపీ గెలిచాం.. ఆంధ్రప్రదేశ్ గెలుస్తాం.. బీజేపీ ఇన్‌ఛార్జ్ సునీల్ ధియోధర్ కీలక వ్యాఖ్యలు

|

Mar 13, 2022 | 8:48 PM

Sunil Deodhar: దేశంలో ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీ సత్తాచాటింది. నాలుగు రాష్ట్రాల్లో అధికారాన్ని కైవసం చేసుకొని ప్రతిపక్షాలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది.

AP BJP: యూపీ గెలిచాం.. ఆంధ్రప్రదేశ్ గెలుస్తాం.. బీజేపీ ఇన్‌ఛార్జ్ సునీల్ ధియోధర్ కీలక వ్యాఖ్యలు
Sunil Deodhar
Follow us on

Sunil Deodhar: దేశంలో ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీ సత్తాచాటింది. నాలుగు రాష్ట్రాల్లో అధికారాన్ని కైవసం చేసుకొని ప్రతిపక్షాలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. ఒక్క పంజాబ్ మినహా.. ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, గోవా, మణిపూర్‌లో బీజేపీ ప్రభంజనం సృష్టించి 2024 సార్వత్రిక ఎన్నికలకు సమరశంఖం పూరించింది. దీంతోపాటు బీజేపీ అధికారంలో లేని రాష్ట్రాలపై బీజేపీ కన్నేసింది. ముఖ్యంగా దక్షిణాది ప్రాంతంలో పార్టీని బలోపేతం చేసేందుకు భారతీయ జనతా పార్టీ అగ్రనేతలు దృష్టి సారించారు. తెలుగు రాష్ట్రాల్లో పార్టీని తిరుగులేని శక్తిగా మార్చేందుకు.. స్థానిక నాయకులకు జాతీయ నాయకత్వం ఎప్పటికప్పుడు దిశానిర్ధేశం చేస్తోంది. దీనిలో భాగంగానే అటు తెలంగాణ.. ఇటు ఆంధ్రప్రదేశ్‌లో పార్టీని అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా జాతీయ నాయకులు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. దీనిలో భాగంగా ఏపీపై.. జాతీయ నేతలు స్పెషల్ ఫోకస్ చేశారు. ఇప్పటికే.. బూత్ స్థాయిలో పార్టీని బలోపేతం చేసేందుకు కేంద్రంలోని పెద్దలు నాయకులకు, కార్యకర్తలకు సూచనలు చేస్తున్నారు.

దీనిలో భాగంలో ఏపీలోని శ్రీకాళహస్తిలో నిర్వహించిన తిరుపతి పార్లమెంటరీ సంఘం జిల్లా శక్తి కేంద్ర ప్రముఖుల సమావేశంలో ఆంధ్రప్రదేశ్ బీజేపీ (AP BJP) ఇన్‌చార్జ్ సునీల్ ధియోధర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఉత్తర్ ప్రదేశ్ గెలిచాము.. ఆంధ్రప్రదేశ్ గెలుస్తామంటూ ఆశాభావం వ్యక్తంచేశారు. నాయకులు, కార్యకర్తలు ఎలాంటి నిరుత్సాహనికి గురికాకుండా బీజేపీని అధికారంలోకి తీసుకొచ్చందుకు కష్టపడాలని సూచించారు. బీజేపీ ఫ్లవర్ కాదని.. బీజేపీ అంటే ఫైర్ అని పేర్కొన్నారు. దీనికి నాలుగు రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల ఫలితాలే నిదర్శనమని పేర్కొన్నారు. ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, గోవా, మణిపూర్‌లో అఖండ విజయం సాధించామని.. ఇది ప్రజాస్వామిక విజయం అని పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేతృత్వంలో ఈ ఘనత సాధించామని సునీల్ ధియోధర్ పేర్కొన్నారు.

Also Read:

AP Politics: పరిటాల అడ్డాలో హీటెక్కుతున్న రాజకీయం.. ధర్మవరంలో శ్రీరామ్‌కు పోటీగా మరో నేత..!

CWC Meeting: మూడు గంటల పాటు వాడివేడిగా సీడబ్ల్యూసీ సమావేశం.. ప్రధానంగా వీటిపైనే చర్చ.. నాయకత్వ మార్పుపై..