BJP: ఏపీలో జనసేనతో పొత్తుపై బీజేపీ నేత సంచలన వ్యాఖ్యలు..

ఏపీలో జనసేనతో పొత్తులపై బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు విష్ణువర్థన్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో జనసేన ఓడిపోయినంత మాత్రాన.. ఏపీలో జనసేనను తక్కువగా అంచనా వేయలేమన్నారు. జనసేనతో బీజేపీ పొత్తు కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఏపీ లో కూడా బీజేపీ, జనసేన కు మంచి ఫలితాలు వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. మా వ్యూహం మాకు ఉంది.. దాని ప్రకారమే ముందుకెళ్తాం అన్నారు.

BJP: ఏపీలో జనసేనతో పొత్తుపై బీజేపీ నేత సంచలన వ్యాఖ్యలు..
Bjp State Vice President Vishnuvardhan Reddy Comments On The Alliance Of Janasena And Bjp In Ap.

Updated on: Dec 06, 2023 | 5:03 PM

ఏపీలో జనసేనతో పొత్తులపై బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు విష్ణువర్థన్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో జనసేన ఓడిపోయినంత మాత్రాన.. ఏపీలో జనసేనను తక్కువగా అంచనా వేయలేమన్నారు. జనసేనతో బీజేపీ పొత్తు కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఏపీ లో కూడా బీజేపీ, జనసేన కు మంచి ఫలితాలు వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. మా వ్యూహం మాకు ఉంది.. దాని ప్రకారమే ముందుకెళ్తాం అన్నారు.

తెలంగాణలో కాంగ్రెస్‌కు టీడీపీ మద్దతిచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. కాంగ్రెస్‌ గెలవాలని టీడీపీ సోషల్ మీడియాలో ప్రచారం కూడా చేసిందని చెప్పారు. తెలంగాణ ఎన్నికల్లో తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీలు కలిసి బీజేపీ-జనసేన పార్టీలకు వ్యతిరేకంగా పని చేయడం రాజకీయ తప్పిదం అన్నారు. ఏపీలో కూడా టీడీపీ.. కాంగ్రెస్‌తో కలిసి వెళ్తుందేమో! అని సరికొత్త అంశాన్ని తెరపైకి తెచ్చారు. మా పార్టీ పొత్తుల అంశంపై జాతీయ నేతలు నిర్ణయం తీసుకుటారన్నారు బీజేపీ నాయకులు విష్ణువర్థన్ రెడ్డి.

అలాగే విగ్రహ రాజకీయాలపై స్పందించారు. అనంతపురంలో టిప్పు సుల్తాన్ విగ్రహం ఏర్పాటు రాజకీయ దుమారం రేపుతోంది. టిప్పు సుల్తాన్ విగ్రహాన్ని ఏర్పాటు చేసి తీరుతామని వైసీపీ అంటుంటే.. అడ్డుకుని తీరుతామని బీజేపీ తెగేసి చెబుతోంది. టిప్పు సుల్తాన్ విగ్రహ ఏర్పాటు చేయాలనుకునే వారిపై కేసులు నమోదు చేయాలని జిల్లా ఎస్పీకి విజ్ఞప్తి చేశారు బీజేపీ నేతలు. ఎవరికి వారే పంతానికి వెళ్తుండటంతో.. ఎప్పుడేం జరుగుతుందోనన్న ఆందోళన మొదలైంది.

ఇవి కూడా చదవండి

అనంతపురం జిల్లా కేంద్రంలో సప్తగిరి సర్కిల్‌లో టిప్పు సుల్తాన్ విగ్రహ ఏర్పాటుకు వైసీపీ నేతలు పూజలు చేశారు. ఈ కార్యక్రమాన్ని బీజేపీ పూర్తిగా వ్యతిరేకించింది. హిందూ సంస్కృతిని రూపుమాపేందుకు టిప్పు సుల్తాన్ హిందువులపై దాడి చేశారని.. అలాంటి వ్యక్తి విగ్రహాన్ని నగరంలో ఏర్పాటు చేయడమేంటని ప్రశ్నిస్తోంది. మరోవైపు టిప్పు సుల్తాన్ విగ్రహ ఏర్పాటుపై వెనక్కి తగ్గబోమన్నారు వైసీపీ నేతలు. ఇప్పటికైతే ఆయన విగ్రహ ఏర్పాటుకి పూజలు మాత్రమే జరిగాయి. మరి అంతటితో ఆగుతుందా.. లేదంటే వ్యవహారం ముందుకెళ్తుందా? ఇరువర్గాల పంతాలు, పట్టింపులతో పోలీసులు ఎలా వ్యవహరిస్తారన్నది చూడాలి.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి..