Vijayawada:ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) లో మరోసారి పోస్టర్ వివాదం రాజుకుంది. విజయవాడ లోని బెంజ్ సర్కిల్(Vijayawada Benz Circle flyover-II) ఫ్లై ఓవర్ 2 ఓపెనింగ్ పోస్టర్ పై వివాదం నెలకొంది. ఈ నెల 17న బెంజ్ సర్కిల్ ఫ్లై ఓవర్ 2 ప్రారంభోత్సవానికి కేంద్ర మంత్రులు నితిన్ గడ్కరీ, కిషన్ రెడ్డిలు నగరానికి రానున్నారు. అయితే ఈ కార్యక్రమం ప్రారంభానికి సంబంధించిన పోస్టర్ పై బీజేపీ ఏపీ నాయకత్వం వివాదం లేవనెత్తింది. ఫ్లైఓవర్ ప్రారంభోత్సవాన్ని పురష్కరించుకుని వైసీపీ నేతలు పీల్లర్లకు అంటించిన పోస్టర్ లో ప్రధాని మోడీ చిత్రపటం లేదని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. అంతేకాదు రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న తీరు సరికాదంటూ బీజేపీ నాయకులూ తప్పుబడుతున్నారు.
దేశ ప్రధాని కి ఇవ్వాల్సిన గౌరవం ఏపీ ప్రభుత్వం ఇవ్వలేదని బీజేపీ నాయకులు ఆరోపిస్తున్నారు. అంతేకాదు ఈ విషయంపై పి.ఏమ్. ఓ కి ఫిర్యాదు చేస్తామని చెప్పారు. బాధ్యులపై పోలీస్ కేసు నమోదుచేసి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. 24 గంటల్లో పోస్టర్ మార్చి, ప్రధాని ఫొటో ఉన్న పోస్టర్ ను పిల్లర్లపై ఏర్పాటు చేయాలని కోరారు. ఇప్పటికైనా ఏపీ ప్రభుత్వం తప్పుని సరిదిద్దుకోకపోతే తామే ప్రధాని మోడీ ఉన్న పోస్టర్లు ఇస్తామని బీజేపీ నాయకులు చెప్పారు.
Also Read: