BJP: కోర్టులకే భద్రత లేకుంటే.. ప్రజలకు ఏం భద్రత కల్పిస్తారు.. మంత్రి రాజీనామాకు బీజేపీ డిమాండ్

| Edited By: Ravi Kiran

Apr 15, 2022 | 1:37 PM

రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వచ్చాక దోపిడీలు, దుర్మార్గాలు పెరిగిపోయాయని నెల్లూరు(Nellore) జిల్లా బీజేపీ అధ్యక్షుడు భరత్ కుమార్ అన్నారు. జగన్ పాలనలో వ్యవస్థలు నిర్వీర్యమయ్యాయని ఆరోపించారు. కోర్టులకే భద్రత లేకపోతే ప్రజలకు ఏం భద్రత..

BJP: కోర్టులకే భద్రత లేకుంటే.. ప్రజలకు ఏం భద్రత కల్పిస్తారు.. మంత్రి రాజీనామాకు బీజేపీ డిమాండ్
Theft In Nellore Court
Follow us on

రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వచ్చాక దోపిడీలు, దుర్మార్గాలు పెరిగిపోయాయని నెల్లూరు(Nellore) జిల్లా బీజేపీ అధ్యక్షుడు భరత్ కుమార్ అన్నారు. జగన్ పాలనలో వ్యవస్థలు నిర్వీర్యమయ్యాయని ఆరోపించారు. కోర్టులకే భద్రత లేకపోతే ప్రజలకు ఏం భద్రత కల్పిస్తారని ప్రశ్నించారు. మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిపై విచారణలో ఉన్న కేసు డాక్యుమెంట్లు చోరీ అయ్యాయన్న భరత్.. చోరీపై కాకాణి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. హైకోర్టు(High Court) న్యాయమూర్తితో విచారణ జరిపిస్తే నిజాలు బయటకు వస్తాయని సూచించారు. ఇన్నాళ్లు ప్రశాంతంగా ఉన్న నెల్లూరులో కాకాణి మంత్రి కాగానే కోర్టులో ఉన్న ఆధారాలు అపహరణ గురయ్యాయని విమర్శించారు. ఈ ఘటనపై అధికారులు, పోలీసులు స్పందించి దొంగతానికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మంత్రి నైతికంగా బాధ్యత వహించి, పదవికి రాజీనామా చేయాలన్నారు.

నెల్లూరుకు చెందిన ఓ ప్రజాప్రతినిధి కేసులో పత్రాలు, స్టాంపులు, ఇతర పరికరాలున్న సంచి అపహరణకు గురైనట్లు కోర్టు బెంచి క్లర్కు స్థానిక చిన్నబజారు పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. నెల్లూరు ( Nellore) కోర్టు సముదాయంలోని నాలుగో అదనపు జ్యుడీషియల్‌ మేజిస్ట్రేట్‌ కోర్టులో (Court) బుధవారం అర్ధరాత్రి గుర్తుతెలియని వ్యక్తులు చొరబడ్డారు. ఓ కేసులో కీలకంగా మారిన పత్రాలు, ఎలక్ట్రానిక్ వస్తువులను ఎత్తుకెళ్లారు. గురువారం ఉదయం కోర్టుకొచ్చిన సిబ్బంది దొంగతనం జరిగినట్లు గుర్తించారు. ఈ విషయమై పోలీసులకు సమాచారమిచ్చారు. దొంగతనానికి గురైన సంచిని కోర్టు బయట ఉన్న కాలువలో పోలీసులు గుర్తించారు. అందులో ఉండాల్సిన పలు డాక్యుమెంట్లు మాయమైనట్లు గుర్తించి.. దర్యాప్తు చేపట్టారు.

Also Read: Amazing Stunt Video: ఇవి స్టంట్స్ కాదు.. అంతకు మించి.. ఈ అమ్మడి ఫీట్స్ చూస్తే కళ్లు బైర్లు కమ్మినట్లే!

Viral Video: కోతిపిల్ల చేష్టకి నవ్వొస్తుంది.. వీడియో చేస్తే చిన్నప్పటి సంగతులు గుర్తుకొస్తాయి..!