AP Municipal Election Results 2021: వైసీపీ ప్రభంజనంలో గ్లాస్‌ గల్లంతు.. కమలం కకావికలం

|

Mar 14, 2021 | 8:35 PM

వైసీపీ ప్రభంజనంలో గ్లాస్‌ గల్లంతైంది. కమలం కకావికలమైంది. దుమ్మురేపుతాం... దంచి కొడతామన్న ఆ రెండు పార్టీల ప్రకటనల్లో పసలేదని తేలిపోయింది.

AP Municipal Election Results 2021: వైసీపీ ప్రభంజనంలో గ్లాస్‌ గల్లంతు.. కమలం కకావికలం
Bjp Janasena
Follow us on

వైసీపీ ప్రభంజనంలో గ్లాస్‌ గల్లంతైంది. కమలం కకావికలమైంది. దుమ్మురేపుతాం… దంచి కొడతామన్న ఆ రెండు పార్టీల ప్రకటనల్లో పసలేదని తేలిపోయింది. పంచాయతీ ఎన్నికల్లో జనసేన మెరిసినా…. ఇప్పుడు తేలిపోయింది. బీజేపీతో పొత్తు ప్రమాదకరంగా మారిందన్న వాదన బలంగా వినిపిస్తోంది.

మున్సిపాలిటీ ఎన్నికల్లో కనీసం ప్రభావం చూపలేకపోయింది బీజేపీ జనసేన కూటమి. పంచాయతీ ఎన్నికల్లో ఫర్వాలేదనిపించిన జనసేన ఈ సారి మాత్రం అటర్‌ ప్లాప్ అయింది. రాకెట్ స్పీడ్‌తో పోటీ పడుతున్న ధరలు, స్టీల్ ప్లాంట్‌ ప్రైవేటీకరణ, విభజన హామీలు నెరవేర్చడంలో సాకులు చెబుతున్న బీజేపీపై ప్రజలు అసెంబ్లీ ఎన్నికల నుంచే కోపంగా ఉన్నారు. అలాంటి పార్టీతో కలిసి ట్రావెల్ చేస్తుండటం పవన్‌కు గట్టి దెబ్బ తగిలిందన్న వాదన వినిపిస్తోంది. ఫలితాలు కూడా అదే చెబుతున్నాయి.

మున్సిపాలిటీ ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా 27 వార్టులను జనసేన అభ్యర్థులు విజయం సాధిస్తే… బీజేపీ డబుల్ డిజిట్ కూడా దాటలేకపోయింది. 7 స్థానాలకే పరిమితమైంది. అయితే జనసేన చాలా ప్రాంతాల్లో ప్రత్యర్థుల్లో ఓటమికి కారణమైందని ఫలితాలు చూస్తే అర్థమవుతుంది. జనసేన ఉభయ గోదావరి జిల్లాల్లో ఉన్న పట్టును మరోసారి రుజువు చేసుకుంది. ఎక్కువ స్థానాలను ఆ రెండు జిల్లాల్లోనే ఆ పార్టీ అభ్యర్థులు గెలుపొందారు. నర్సాపురంలో అయితే వైసీపీ 24 స్థానాల్లో విక్టరీ సాధిస్తే… అక్కడ టీడీపీ ఒక స్థానానికే పరిమితమైంది. జన సేన మాత్రం టీడీపీ కంటే మెరుగైన ఫలితాలు సాధించింది. నర్సాపురంలో ముగ్గురు అభ్యర్థులు విజేతలుగా నిలిచారు.

అమలాపురంలో జనసేన ఉనికి చాటుకుంది. ఇక్కడ కూడా టీడీపీ కంటే మెరుగైన ఫలితాలతో జనసేన రెండో స్థానంలో నిలిచింది. ఆరింటిలో జనసేన గెలిస్తే… సైకిల్ పార్టీ నాలుగుకే పరిమితమైంది. 2019 ఎన్నికల ఓటమి తర్వాత బీజేపీ, జనసేన కలిశాయి. కూటమిగా ఏర్పడ్డాయి. వైసీపీకి ప్రత్యామ్నాయం తామేనంటూ ప్రసంగాలు దంచారు. ఏ ఎన్నికలు వచ్చినా…. విజయం సాధిస్తాం… 2023లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామంటూ కామెంట్స్ కూడా చేశారు. మున్సిపాలిటీ ఎన్నికల మాత్రం వాళ్ల అంచనాలకు తగ్గిన ఫలితాలు కనిపించలేదు.

బీజేపీ, జనసేన అధినాయకత్వం తరచూ మీట్‌ అవుతూ కలిసి సాగాలని కేడర్‌కు బూస్టింగ్ ఇచ్చినా… ఆ స్థాయికి కలివిడితనం ఫీల్డ్‌లో ఈ రెండు పార్టీల మధ్య కనిపించలేదని క్లియర్‌గా అర్థమవుతోంది. దేవాలయాలపై బీజేపీ, జనసేన చేసిన విమర్శలను కూడా ప్రజలు పెద్దగా పట్టించుకున్నట్టు కనిపించడం లేదు. గత ఎన్నికల్లో విశాఖ నుంచి పవన్‌ కల్యాణ్, జేడీ లక్ష్మీనారాయణ పోటీ చేశారు. అక్కడ టఫ్‌ఫైట్‌నే ఇచ్చారు. కానీ ఇప్పుడు ఆ పట్టు జారి పోయిందని ఈ ఫలితాలు చెబుతున్నాయి. ముఖ్యంగా ఉక్కు ప్రైవేటీకరణ ఎఫెక్ట్‌ ఆ రెండు పార్టీలపై పడిందనే చెప్పాలి.

Also Read:

AP Municipal Election 2021 results: పారని పాచికలు.. అధినేత ప్రచారం చేసినా ఆదరణ శూన్యం

CM Jagan: సార్వత్రిక ఎన్నికలతో పోలిస్తే.. పెరిగిన వైసీపీ ఓటు బ్యాంక్.. రాష్ట్రవ్యాప్తంగా అదే జగన్ వేవ్