BJP: పేర్లు మార్చి ఏపీ సర్కార్ ప్రచారం చేసుకుంటోంది.. విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలన్న బీజేపీ చీఫ్..

|

Jun 06, 2022 | 3:29 PM

BJP JP Nadda: సొంత పథకాలుగా ప్రచారం చేసుకుంటోందని భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా విమర్శించారు. ఏపీ పర్యటనలో భాగంగా విజయవాడ చేరుకున్న ఆయన.. అక్కడ నిర్వహించిన బీజేపీ శక్తి కేంద్ర ప్రముఖుల..

BJP: పేర్లు మార్చి ఏపీ సర్కార్ ప్రచారం చేసుకుంటోంది.. విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలన్న బీజేపీ చీఫ్..
Jpnadda
Follow us on

ఏపీ ప్రభుత్వం పేర్లు మార్చి సొంత పథకాలుగా ప్రచారం చేసుకుంటోందని భారతీయ జనతా పార్టీ(BJP) జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా(JP Nadda) విమర్శించారు.  ఏపీ పర్యటనలో భాగంగా విజయవాడ చేరుకున్న ఆయన.. అక్కడ నిర్వహించిన బీజేపీ శక్తి కేంద్ర ప్రముఖుల సమ్మేళనంలో మాట్లాడారు. ‘ఆయుష్మాన్‌ భారత్‌’ పేరుతో బృహత్తర ఆరోగ్య పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిందన్నారు. అయితే అదే పథకాన్ని ‘ఆరోగ్యశ్రీ’ పేరుతో జగన్‌ సర్కార్ ప్రచారం చేసుకుంటోందని ఎద్దేవ చేశారు. అది జగన్‌ స్కీం కాదని.. నరేంద్ర మోదీదని నడ్డా అన్నారు. ఆయుష్మాన్‌ భారత్‌ పథకంతో రూ.5లక్షల వరకు వైద్యసాయం అందుతున్న విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని బీజేపీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఆయుష్మాన్‌ భారత్‌ ఎక్కడైనా పనిచేస్తుందని.. రాష్ట్రం దాటితే ఆరోగ్యశ్రీ పనికిరాదని వ్యాఖ్యానించారు. పీఎం కిసాన్‌ కింద ఏటా రూ.6వేలు రైతుల ఖాతాల్లో వేస్తున్నామని నడ్డా గుర్తుచేశారు.

దేశాన్ని సురక్షితంగా ఉంచేందుకు కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న చర్యలను బీజేపీ కార్యకర్తలు ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. రాష్ట్రంలో 46వేలకు పైగా పోలింగ్‌ బూత్‌లు ఉన్నాయని.. బూత్‌ల వారీగా ప్రజల వద్దకు పార్టీని తీసుకెళ్లాల్సిన బాధ్యత శక్తి కేంద్ర ప్రముఖులపై ఉందన్నారు. బూత్‌ కమిటీల్లో అన్ని వర్గాలకు ప్రాధాన్యమివ్వాలన్నారు. బీజేపీ కార్యకర్తలతో బూత్‌ కమిటీలను ఏర్పాటు చేయాలని.. కొత్త వారిని పార్టీలో చేర్చుకునే అంశంపై దృష్టిసారించాలని నడ్డా సూచించారు. బూత్‌ కమిటీల్లో అన్ని వర్గాల భాగస్వామ్యం ఉండేలా చూసుకోవాలన్నారు. బీజేపీ అన్ని వర్గాల పార్టీ అనే భావన వచ్చేలా పనిచేయాల్సిన బాధ్యత శక్తి కేంద్ర ప్రముఖులపై ఉంటుందన్నారు.

ఏపీ వార్తల కోసం