Andhra Pradesh: రోడ్డు పక్క బిర్యాని తింటున్నారా..? నాణ్యత విషయంలో జాగ్రత్తలు తప్పనిసరి

|

Jul 11, 2022 | 5:20 PM

ప్రజల బలహీనతలను క్యాష్ చేసుకుని తక్కువ ధరకు కొనుగోలు చేసిన కాక నూనె, యసేన్స్, మసాలా సైతం ఉపయోగిస్తున్నారు. మచిలీపట్నంలో సుమారు రోజుకి 5 నుంచి 10 టన్నుల పైనే బిర్యాని వాడుతున్నారు అంటే అతిశయోక్తి లేదు.

Andhra Pradesh: రోడ్డు పక్క బిర్యాని తింటున్నారా..? నాణ్యత విషయంలో జాగ్రత్తలు తప్పనిసరి
Biryani
Follow us on

Andhra Pradesh: ఒకప్పుడు మచిలీపట్నం అంటే గుర్తుకు వచ్చేది బందరు మిఠాయి బందర్ లడ్డు కానీ ఇపుడు బిర్యానీ కూడా ఫేమస్. మచిలీపట్నం ప్రజలు బిర్యానీ ప్రియులు అని తెలుస్తుంది ఎందుకు అనుకుంటున్నారా బందర్ లో ప్రతి గల్లీకి ఒకటి బిర్యానీ పాయింట్ చూసి హావక్ అవాల్సిందే. ప్రపంచ ప్రసిద్ధి పొందిన హైదరాబాద్ బిర్యానీ కి కూడా ఇన్ని బిర్యానీ పాయింట్లు ఉండేవేమో ! మంది ఎక్కువైతే.. మజ్జిగ పల్చన  అన్న సామెతను గుర్తు చేస్తూ.. పెరుగుతున్న బిర్యానీ పాయింట్లతో నాణ్యతను తిలోదకాలు ఇస్తున్నారు తయారీ దారులు. అధికారుల పర్యవేక్షణ కూడా కొరవడింది. అధికారుల పర్యవేక్షణ కొరవడటం తో ఇష్టం వచ్చినట్టు వ్యవహరిస్తున్నారు బిర్యానీ పాయింట్లు. కాక నూనె, యసేన్స్, అధిక మోతాదులో వాడుతున్నారు. ఈ విషయం తెలియక బిర్యానీ ప్రియులు కొనుగోలు చేస్తున్నారు. వీటిని తిన్న తర్వాత ఆస్పత్రి పాలవుతున్నారు.

కృష్ణాజిల్లా మచిలిపట్నంలో ఇబ్బడిముబ్బడిగా బిర్యానీ పాయింట్లు వెలుస్తున్నాయి. ఈ బిర్యానీ వంటకాలు లో చనిపోయిన కోళ్లను సైతం వినియోగిస్తున్నారని సమాచారం. రెస్టారెంట్ లో స్టాటర్స్ తిన్న తరువాత చేయి కూడా ఎర్రగా మారటం ఆర్చర్యం కలిగిస్తుంది. దమ్ బిర్యాని రూ. 100,  రోస్ట్ బిర్యాని 110 అతి తక్కువ ధరలు అందుబాటులో ఉండటం వలన ఈ బిర్యాని నీ సామాన్య పేద, మధ్య తరగతి ప్రజలు తింటున్నారు.

మచిలీపట్నం లో కొంతమంది ప్రతి రోజు బిర్యానీని తింటున్న దాఖలాలు కూడా లేకపోలేదు. ఇదే అదునుగా బిర్యానీ పాయింట్లు ప్రజల బలహీనతలను క్యాష్ చేసుకుని తక్కువ ధరకు కొనుగోలు చేసిన కాక నూనె, యసేన్స్, మసాలా సైతం ఉపయోగిస్తున్నారు. మచిలీపట్నంలో సుమారు రోజుకి 5 నుంచి 10 టన్నుల పైనే బిర్యాని వాడుతున్నారు అంటే అతిశయోక్తి లేదు. బిర్యానీ లో వాడే రసాయన కలర్లు ప్రజలకు లేనిపోని కొత్త రోగాలను క్యాన్సర్ లాంటి వ్యాధులను తెచ్చిపెడుతున్నాయి అని వైద్యులు అంటున్నారు.  ఇంత జరుగుతున్నా దీనిని పర్యవేక్షించాల్సిన అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. ప్రజల ఆరోగ్యంతో చెలగాటం ఆడుతున్న బిర్యాని పాయింట్ లను కనీసం తనిఖీ చేయకుండా వ్యవహరిస్తున్నారని ఆరోపణలు లేకపోలేదు. నగరం లో ఉన్న బిర్యానీ పాయింట్లు ఫుడ్ సేఫ్టీ అధికారులకు కాసుల వర్షం కురిపిస్తున్నయి అని లుకలుకలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా అధికారులు స్పందించి ప్రజల ఆరోగ్యంతో చేలాగతమడుతున్న బిర్యాని పాయింట్ లను నాణ్యత ప్రమాణాలు పాటించే విధంగా చూడాలని బిర్యాని ప్రియులు కోరుకుంటున్నారు.

ఇవి కూడా చదవండి

Reporter : Sivakumar, Tv9 Telugu

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..