తూచ్‌.. నేను పార్టీ మారలేదు

| Edited By:

Dec 30, 2019 | 11:52 PM

టీడీపీకి దెబ్బ మీద దెబ్బ తగులుతూనే ఉంది. పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు ఎప్పుడు ఏ రూట్‌లో వెళ్తారో అన్నది అర్థం కాని పరిస్థితి నెలకొంది. ఇప్పటికే వంశీ టీడీపీకి దూరమైన విషయం తెలిసిందే. అయితే పార్టీ మారకుండా తటస్థ ఎమ్మెల్యేగా ఉంటూ.. టీడీపీకి ఝలక్ ఇచ్చారు. అయితే ఇప్పుడు వంశీ రూట్‌లోనే మిగతా ఎమ్మెల్యేలు కూడా వెళ్తున్నట్లు తెలుస్తోంది. టీడీపీ ఇసుక పోరాటం చేస్తున్న సమయంలో.. వంశీ వ్యూహాత్మకంగా సైకిల్‌కు దూరమైతే.. ఇప్పుడు అమరావతి రాజధాని అంశంపై […]

తూచ్‌.. నేను పార్టీ మారలేదు
Follow us on

టీడీపీకి దెబ్బ మీద దెబ్బ తగులుతూనే ఉంది. పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు ఎప్పుడు ఏ రూట్‌లో వెళ్తారో అన్నది అర్థం కాని పరిస్థితి నెలకొంది. ఇప్పటికే వంశీ టీడీపీకి దూరమైన విషయం తెలిసిందే. అయితే పార్టీ మారకుండా తటస్థ ఎమ్మెల్యేగా ఉంటూ.. టీడీపీకి ఝలక్ ఇచ్చారు. అయితే ఇప్పుడు వంశీ రూట్‌లోనే మిగతా ఎమ్మెల్యేలు కూడా వెళ్తున్నట్లు తెలుస్తోంది. టీడీపీ ఇసుక పోరాటం చేస్తున్న సమయంలో.. వంశీ వ్యూహాత్మకంగా సైకిల్‌కు దూరమైతే.. ఇప్పుడు అమరావతి రాజధాని అంశంపై పోరాటం చేస్తున్న వేళ.. అదే స్టయిల్లో మరో ఎమ్మెల్యే మద్దాలి గిరి దూరం అవుతున్నారు. గుంటూరు వెస్ట్‌ నియోజకవర్గానికి ప్రాతినిథ్యం వహిస్తోన్న ఆయన.. సోమవారం సీఎం జగన్‌ను కలుసుకోవడం రాజకీయంగా ప్రకంపనలు సృష్టించింది. చంద్రబాబువి ద్వంద్వ ప్రమాణాలనీ, ఆయన ఆత్మపరిశీలన చేసుకోవాలని మద్దాలి గిరి చేస్తున్న కామెంట్లు.. టీడీపీలో కలకలం రేపాయి. ఈ పరిస్థితుల్లో టీడీపీ, వైసీపీ రాజకీయ చదరంగంలో ఇంకేం జరగబోతోందన్న అంశంపై టీవీ9 మేనేజింగ్ ఎడిటర్ రజినీకాంత్ ఆధ్వర్యంలో బిగ్‌ డిబేట్‌ జరిగింది.

ఈ డిబేట్‌లో పాల్గొన్న ఎమ్మెల్యే మద్దాలి గిరి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను నియోజకవర్గ అభివృద్ధి కోసమే సీఎం జగన్‌ను కలవడం జరిగిందని.. అయితే ఆయన స్పందించిన తీరు ఎంతో ఆనందంగా ఉందన్నారు. ఇక పార్టీ మారినట్లేనా అన్ని ప్రశ్నకు ఆయన ఆసక్తికర సమాధానం చెప్పారు. అదేంటో ఈ వీడియోలో చూడండి.