AP Politics: మేం సిద్ధం అంటున్న వైసీపీ.. మరి మిత్రపక్షాల మధ్య సర్దుబాట్లు ఎప్పుడు?

ఏపీలో టీడీపీ- జనసేన- బీజేపీ పొత్తులు పెట్టుకున్నాయి.. చేతులు కలిపి ఉమ్మడి ప్రచారం కూడా మొదలుపెట్టాయి. కానీ ఎందుకో అభ్యర్ధులను తేల్చుకోలేక సతమతమవుతున్నాయి మూడు పార్టీలు. అటు ప్రత్యర్ధి వైసీపీ పార్లమెంట్‌ తో కలిపి 199 మందిని ఒకేసారి ప్రకటించి ఎన్నికలకు సిద్ధమంటూ సవాల్‌ విసురుతుంటే..

AP Politics: మేం సిద్ధం అంటున్న వైసీపీ.. మరి మిత్రపక్షాల మధ్య సర్దుబాట్లు ఎప్పుడు?
Big News Big Debate
Follow us

|

Updated on: Mar 19, 2024 | 6:51 PM

ఏపీలో టీడీపీ- జనసేన- బీజేపీ పొత్తులు పెట్టుకున్నాయి.. చేతులు కలిపి ఉమ్మడి ప్రచారం కూడా మొదలుపెట్టాయి. కానీ ఎందుకో అభ్యర్ధులను తేల్చుకోలేక సతమతమవుతున్నాయి మూడు పార్టీలు. అటు ప్రత్యర్ధి వైసీపీ పార్లమెంట్‌ తో కలిపి 199 మందిని ఒకేసారి ప్రకటించి ఎన్నికలకు సిద్ధమంటూ సవాల్‌ విసురుతుంటే.. సంసిద్ధమని పోస్టర్లు వేసిన మిత్రపక్షాలు మాత్రం ఇంకా సీట్లపై కుస్తీ పడుతున్నాయి.

అల్పపీడన ద్రోణితో ఏపీ వాతావరణం చల్లబడింది కానీ.. రాజకీయంగా సెగలు కక్కుతోంది.  మిత్రపక్షాల మధ్య నెంబర్‌ తేలింది కానీ.. సీట్లు ఎక్కడన్నది ఇంకా స్పష్టత రాలేదు. టీడీపీ 128, జనసేన 6 చోట్ల అభ్యర్ధులను ప్రకటించాయి. మిగిలిన సీట్లలో ఎవరెక్కడ పోటీ చేస్తారో అని తెలియక కేడర్‌లో బీపీ పెరుగుతోంది. టికెట్ల కోసం అధినేతల ఇళ్ల చుట్టూ ప్రదక్షణలు చేస్తున్నారు ఆశావహులు. ఆలేరు పంచాయితీ హైదరాబాద్‌లోని చంద్రబాబు నివాసం వద్దకు చేరగా.. విజయవాడ వెస్ట్‌, విశాఖ సౌత్‌ పంచాయితీ జనసేనలో హైటెన్షన్‌ క్రియేట్‌ చేస్తున్నాయి. ఇక తిరుపతి సీటు విషయంలో జనసేన- టీడీపీ మధ్య పోటీతో లోకల్‌, నాన్‌ లోకల్‌ నినాదం తెరమీదకు వచ్చింది.

6 పార్లమెంట్, 10 అసెంబ్లీ సీట్లలో పోటీచేస్తామంటోంది బీజేపీ. ఎక్కడ పోటీచేయాలి.. ఎవరిని బరిలో దింపాలో ఢిల్లీ కేంద్రంగా కసరత్తు చేస్తోంది పార్టీ. టీడీపీ ఇస్తామంటున్న సీట్లు కాకుండా.. తాము కోరుకున్న సీట్లు ఇవ్వాలంటోంది బీజేపీలోని ఓ వర్గం. ఇప్పటికే పార్టీలో పొత్తులకు వ్యతిరేకంగా లేఖ కలకలం రేపింది. సీట్లు, అభ్యర్ధుల ప్రకటన తర్వాత ఎలాంటి ప్రకంపనలు ఉంటాయో చూడాలి. సీట్ల సర్దుబాటులో మిత్రపక్షాల్లో కన్ఫూజన్‌ ఉండగానే వైసీపీ యుద్ధభేరి మోగించింది. ఈ నెల 27 నుంచి సీఎం జగన్మోహన్‌రెడ్డి బస్సుయాత్రకు సిద్ధమవుతున్నారు. పొత్తులు పెట్టుకుని ప్రచారం మొదలుపెట్టిన పార్టీలు సీట్లు సర్దుబాటులో మాత్రం నానాపాట్లు పడుతున్నాయి. మరి గండం దాటుకుని అసంతృప్తులను బుజ్జగించుకుని సంసిద్ధమంటూ క్షేత్రంలోకి ఎప్పుడు దిగుతాయో మిత్రపక్షాలు?

మీ మొబైల్‌కు వచ్చే ఫేక్‌ మెసేజ్‌లను ఎలా గుర్తించాలి ?
మీ మొబైల్‌కు వచ్చే ఫేక్‌ మెసేజ్‌లను ఎలా గుర్తించాలి ?
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో