Andhra Pradesh: నేనొక్కడినే.. ఏపీలో మారుతున్న పొలిటికల్ సీన్‌.. ప్రత్యర్థులందరినీ ఒకే గాటన కట్టిన జగన్..

|

Jan 23, 2024 | 6:58 PM

Andhra Pradesh Elections: ఏపీలో పొలిటికల్ వ్యూహంపై వైసీపీకి క్లారిటీ వచ్చినట్టే కనిపిస్తోంది. టీడీపీ తన ప్రధాన ప్రత్యర్థి అయినా.. మిగతా పార్టీలన్నీ కూడా టీడీపీ వెనకే ఉన్నాయనే వాదనను ప్రజల్లోకి తీసుకెళ్లడానికి రెడీ అవుతోంది. దీనిపై వైసీపీ అధినేత, ఏపీ సీఎం జగన్ స్పష్టత ఇచ్చేశారు. తానొక్కడు ఒక వైపు.. ప్రత్యర్థులంతా చంద్రబాబు వైపు అని తేల్చేశారు.

ఎన్నికల సీజన్ దగ్గరపడుతున్న కొద్దీ.. ఏపీలో పొలిటికల్ హీట్ పెరుగుతోంది. ఇప్పటికే వరుస సభలతో చంద్రబాబు వైసీపీని టార్గెట్ చేస్తుంటే.. తాజాగా ఏపీ సీఎం జగన్ ఉరవకొండలో జరిగిన సభలో తన ప్రత్యర్థులందరిపై విమర్శనాస్త్రాలు సంధించారు. ఏపీ ప్రజలను మోసం చేసే చంద్రబాబు కోసం అనేకమంది స్టార్ క్యాంపెయినర్లుగా పని చేస్తున్నారని ఆరోపించారు. ఏపీలో తాను ఒక్కడినే ఒకవైపు, మిగతా వాళ్లందరూ చంద్రబాబు వైపు ఉన్నారని సీఎం జగన్ కామెంట్ చేశారు. పవన్ కళ్యాణ్, పురంధేశ్వరితో పాటు ఇటీవల ఏపీ కాంగ్రెస్ బాధ్యతలు స్వీకరించిన షర్మిలపై కూడా వైఎస్ జగన్ పరోక్షంగా విమర్శలు గుప్పించారు.

సీఎం జగన్ వ్యాఖ్యలపై టీడీపీ రియాక్ట్ అయ్యింది. తనకు ప్రజలే స్టార్ క్యాంపెయినర్స్ అని సీఎం జగన్ అన్నారని.. అయితే ఆయన పతనానికి ప్రజలు స్టార్ క్యాంపెయినర్స్‌ అని టీడీపీ ఎమ్మెల్యే పయ్యావులు కేశవ్ అన్నారు.

ఇప్పటివరకు చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌ను లక్ష్యంగా చేసుకుని సీఎం జగన్ విమర్శలు చేస్తూ వచ్చారు. తాజాగా బీజేపీలోని కొంతమందితో పాటు కాంగ్రెస్‌ను కూడా వైసీపీ అధినేత టార్గెట్ చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఏపీలో రాబోయే ఎన్నికలు వైసీపీ వర్సెస్‌ మిగతా పార్టీలు అన్నట్టుగా మారబోతున్నాయని సీఎం జగన్ మాటలను బట్టి అర్థమవుతోంది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..