Andhra Pradesh Politics: లోకల్‌ ఎవరు.. నాన్‌లోకల్‌ ఎవరు..? ఏపీ రంగస్థలం.. వేట మొదలైంది

|

Dec 14, 2023 | 6:48 PM

Big News Big Debate : ఏపీలో పొలిటికల్‌ యాక్షన్ మొదలైంది. ఉత్తరాంధ్రలోని ఉద్దానం సుజలధార, కిడ్నీ రీసెర్చ్‌ సెంటర్‌ ప్రారంభించిన సీఎం జగన్మోహన్‌ రెడ్డి విపక్షాలపై విరుచుకపడ్డారు. ఉత్తరాంధ్రను అభివృద్ధి చేస్తుంటే తట్టుకోలేక ఏడుపు రాజకీయాలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు సీఎం జగన్‌. పాలనా రాజధాని వచ్చినా, పోర్టులు, ఎయిర్‌పోర్టులు తీసుకొస్తామన్నా ప్రతిపక్షాలకు ఏడుపేనని ఆరోపించారు.

Andhra Pradesh Politics: లోకల్‌ ఎవరు.. నాన్‌లోకల్‌ ఎవరు..? ఏపీ రంగస్థలం.. వేట మొదలైంది
Andhra Pradesh Politics
Follow us on

Big News Big Debate : ఏపీలో పొలిటికల్‌ యాక్షన్ మొదలైంది. ఉత్తరాంధ్రలోని ఉద్దానం సుజలధార, కిడ్నీ రీసెర్చ్‌ సెంటర్‌ ప్రారంభించిన సీఎం జగన్మోహన్‌ రెడ్డి విపక్షాలపై విరుచుకపడ్డారు. ఉత్తరాంధ్రను అభివృద్ధి చేస్తుంటే తట్టుకోలేక ఏడుపు రాజకీయాలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు సీఎం జగన్‌. పాలనా రాజధాని వచ్చినా, పోర్టులు, ఎయిర్‌పోర్టులు తీసుకొస్తామన్నా ప్రతిపక్షాలకు ఏడుపేనని ఆరోపించారు. అటు టీడీపీతో పాటు జనసేనపైనా సంచలన వ్యాఖ్యలు చేశారు సీఎం. ఏపీలో ప్రభుత్వానికి చుక్కలు చూపిస్తామంటూ తెలంగాణ ఎన్నికల్లో ప్రచారం చేసిన జనసేనకు డిపాజిట్లు కూడా దక్కలేదన్నారు. వైసీపీ లోకల్‌ అయితే.. ప్రతిపక్షాలన్నీ నాన్‌లోకల్స్‌ అని… వాళ్లకు ఏపీ పట్ల ప్రేమ లేదన్నారు సీఎం. పొత్తులను వాళ్లు నమ్ముకుంటే, జనాన్ని వైసీపీ నమ్ముకుంటుందన్నారు.

ఇదిలాఉంటే.. చంద్రబాబు జగన్‌ లెక్కలు తారుమారయ్యాయంటూ పేర్కొన్నారు. 11 మందిని మార్చారు.. ఇక్కడ చెల్లని కాసు అక్కడ చెల్లుతుందా? వైసీపీ నుంచి వస్తే పరిశీలిస్తాం.. అంటూ చంద్రబాబు పేర్కొన్నారు.

బిగ్ న్యూస్ బిగ్ డిబేట్ లైవ్ వీడియో చూడండి..

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..