YS Sharmila: రాజన్న బిడ్డ.. రాగం ఎందుకు మారింది? షర్మిల చేరికతో కాంగ్రెస్‌లోకి తిరిగొచ్చే నేతలెవరు?

|

Jan 02, 2024 | 6:56 PM

Big News Big Debate: ఇన్నాళ్లూ తెలంగాణే తన రాజకీయవేదిక అని చెప్పుకొచ్చిన YSRTP అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల... ఇప్పుడు సడెన్‌గా రూటు మార్చడం పొలిటికల్‌గా సెగలు రాజేస్తోంది. మెట్టినిల్లును వదిలి.. పుట్టినిల్లు ఏపీకి వచ్చేందుకు ఆమె సిద్ధమవడం చర్చనీయాంశమవుతోంది. కాంగ్రెస్‌లో తన పార్టీని విలీనం చేసి ఏపీసీసీ బాధ్యతలు చేపట్టేందుకు రెడీ అవుతున్న షర్మిలను.. ఏపీ ఓటర్లు ఆదరిస్తారా? హస్తానికి పూర్వవైభవం వస్తుందా?

Big News Big Debate: ఇన్నాళ్లూ తెలంగాణే తన రాజకీయవేదిక అని చెప్పుకొచ్చిన YSRTP అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల… ఇప్పుడు సడెన్‌గా రూటు మార్చడం పొలిటికల్‌గా సెగలు రాజేస్తోంది. మెట్టినిల్లును వదిలి.. పుట్టినిల్లు ఏపీకి వచ్చేందుకు ఆమె సిద్ధమవడం చర్చనీయాంశమవుతోంది. కాంగ్రెస్‌లో తన పార్టీని విలీనం చేసి ఏపీసీసీ బాధ్యతలు చేపట్టేందుకు రెడీ అవుతున్న షర్మిలను.. ఏపీ ఓటర్లు ఆదరిస్తారా? హస్తానికి పూర్వవైభవం వస్తుందా?

రాజన్న బిడ్డగా తెలంగాణ రాజకీయాల్లోకి ప్రవేశించిన వైఎస్‌ షర్మిల.. ఇప్పుడు రిటర్న్‌ టు ఏపీ అంటున్నారు. తెలంగాణలో వైఎస్‌ఆర్‌టీ పేరిట పార్టీని స్థాపించి… ప్రజా సమస్యలపై ఆందోళనలు, పాదయాత్రలతో హడావుడి చేసిన షర్మిల.. కాంగ్రెస్‌ సైడ్‌ తీసుకున్నారు. ఆ పార్టీతో కలవడానికే కాదు, తన పార్టీనే అందులో విలీనం చేసేందుకు రెఢీ అయ్యారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందే ఆ ప్రయత్నాలు జరిగినా.. ఎందుకో బ్రేక్‌ పడింది. కానీ, ఇప్పుడు పూర్తిగా క్లారిటీ వచ్చేసింది.

బుధవారం సాయంత్రం ఢిల్లీ వెళ్లనున్న షర్మిల.. ఎల్లుండి కాంగ్రెస్ పెద్దల సమక్షంలో కాంగ్రెస్‌ కండువా కప్పుకోనున్నారనేది పార్టీ వర్గాల మాట. ఇదే విషయాన్ని లోటస్ పాండ్‌లో జరిగిన పార్టీ నేతల సమావేశంలోనూ ఆమె చర్చించినట్టు సమాచారం. ఏపీసీసీ చీఫ్‌ పదవిని తనకు ఆఫర్‌ చేసినట్టు సమావేశంలో తెలిపిన షర్మిల.. రెండ్రోజులాగితే అన్నీ తెలుస్తాయని మీడియాతో చెప్పారు.

షర్మిల నిర్ణయం ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో సంచలనం రేపుతోంది. ఆమె కాంగ్రెస్‌లో చేరడం.. రాష్ట్రశాఖ పగ్గాలు చేపట్టడం.. రాజకీయంగా ఎవరికి లాభం? ఎవరికి నష్టం? అనే చర్చ జరుగుతోందిప్పుడు. అయితే, ఎవరు ఏ పార్టీలో చేరినా.. ఎంత మంది కలిసొచ్చినా… మళ్లీ గెలిచేది తమ పార్టీయే అంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు వైసీపీ నేతలు.

గతంలో కాంగ్రెస్‌పై తీవ్ర ఆరోపణలు చేసిన షర్మిల.. ఇప్పుడు అదే కాంగ్రెస్‌కు ఏపీ అధ్యక్షురాలిగా నియమితులవబోతున్నారు. మరి, రాజన్న బిడ్డకు హస్తం సీనియర్లు సహకరిస్తారా? తుదికంటా తెలంగాణ కోసమే అంటూ ఇన్నాళ్లూ మాట్లాడిన షర్మిలను.. ఏపీ ప్రజలు ఓన్‌ చేసుకుంటారా? అన్నదే ఆసక్తి రేపుతోంది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..