బిగ్ బ్రేకింగ్… ఏపీలో రేపటినుంచే విద్యాసంస్థలన్నీ బంద్

| Edited By: Pardhasaradhi Peri

Mar 18, 2020 | 7:47 PM

కరోనా ప్రభావంతో ఏపీ సర్కార్ కీలక నిర్ణయాలు తీసుకోంటోంది. కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా గురువారం నుంచి అన్ని విద్యాసంస్థల్ని మూసివేయాలంటూ ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. కేవలం స్కూళ్లు, కళాశాలలేకాకుండా.. యూనివర్సిటీలు, కోచింగ్ సెంటర్లను మూతపడనున్నాయి. మరోవైపు కరోనా ఎఫెక్ట్‌తో స్థానిక ఎన్నికలు కూడా వాయిదా పడ్డ విషయం తెలిసిందే. దేశంలో చాపకింద నీరులా ఈ వైరస్ వ్యాపిస్తుండటంతో.. అన్ని రాష్ట్రాలు అప్రమత్తమయ్యాయి. ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా దాదాపు ఎనిమిది వేల మంది మరణించగా.. రెండు లక్షల […]

బిగ్ బ్రేకింగ్... ఏపీలో రేపటినుంచే విద్యాసంస్థలన్నీ బంద్
Follow us on

కరోనా ప్రభావంతో ఏపీ సర్కార్ కీలక నిర్ణయాలు తీసుకోంటోంది. కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా గురువారం నుంచి అన్ని విద్యాసంస్థల్ని మూసివేయాలంటూ ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. కేవలం స్కూళ్లు, కళాశాలలేకాకుండా.. యూనివర్సిటీలు, కోచింగ్ సెంటర్లను మూతపడనున్నాయి. మరోవైపు కరోనా ఎఫెక్ట్‌తో స్థానిక ఎన్నికలు కూడా వాయిదా పడ్డ విషయం తెలిసిందే. దేశంలో చాపకింద నీరులా ఈ వైరస్ వ్యాపిస్తుండటంతో.. అన్ని రాష్ట్రాలు అప్రమత్తమయ్యాయి. ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా దాదాపు ఎనిమిది వేల మంది మరణించగా.. రెండు లక్షల మంది వరకు కరోనా బారినపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇక మనదేశంలో కరోనా ప్రభావంతో ముగ్గురు మరణించగా.. మరో 150 మందికి పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.