Begger Donation: యాచకుడి గొప్ప మనస్సు ..బిక్షాటన చేసి సంపాదించిన దానిలో సగం దేవుడి హుండీలోనే

|

Nov 13, 2022 | 3:06 PM

దానం ఇవ్వమని అడిగే వ్యక్తిని యాచకులు అంటారు. అయితే తన జీవితాన్ని గడపడానికి భిక్షాటన చేస్తూ ఆర్జిస్తున్న ఓ వ్యక్తి.. తన భవిష్యత్ కోసం ఆలోచించకుండా తన సంపాదనలో కొంత మొత్తాన్ని దానం చేసి తన మంచి మనసుని చాటుకున్నాడు విశాఖపట్నానికి చెందిన యాచకుడు.

Begger Donation: యాచకుడి గొప్ప మనస్సు ..బిక్షాటన చేసి సంపాదించిన దానిలో సగం దేవుడి హుండీలోనే
Begger Donation
Follow us on

సనాతన ధర్మంలో దానానికి విశిష్ట స్థానం ఉంది. ఎవరైనా కష్టంలో ఉన్నప్పుడు అడిగినా అడగక పోయినా అవసరాన్ని తీర్చే విధంగా చేసే ఏదైనా ఇవ్వడాన్ని దానం అంటారు. ఇలా వస్తు, డబ్బు, భూమి, ఆహారపదార్ధాలు సహా అనేక రకాల దానాలు ఉన్నాయి. ఆకలితో ఉన్న వ్యక్తికీ పిడికెడు అన్నం దానం చేసినా ఆ వ్యక్తి జీవితం ధన్యం.  క్లిష్ట సమయాలలో అన్నదానం చేసిన వ్యక్తిని ప్రజలంతా దేవునితో సమానంగా పూజిస్తారు. అలా దానం చేసేవ్యక్తిని దాత అని కీర్తిస్తుంటారు. దానం ఇవ్వమని అడిగే వ్యక్తిని యాచకులు అంటారు. అయితే తన జీవితాన్ని గడపడానికి భిక్షాటన చేస్తూ ఆర్జిస్తున్న ఓ వ్యక్తి.. తన భవిష్యత్ కోసం ఆలోచించకుండా తన సంపాదనలో కొంత మొత్తాన్ని దానం చేసి తన మంచి మనసుని చాటుకున్నాడు విశాఖపట్నానికి చెందిన యాచకుడు. ఆలయం వద్ద యాచించి, పోగేసిన సొమ్ములో సగాన్ని అదే ఆలయానికి విరాళంగా సమర్పించాడు. వివరాల్లోకి వెళ్తే..

ఉత్తరప్రదేశ్‌కు చెందిన పురంధర్‌ 14 ఏళ్ల క్రితం విశాఖ నగరానికి వలస వచ్చాడు. అప్పటి నుంచి నగరంలోని నక్కవానిపాలెం ఉన్న ప్రముఖ దేవాలయం  ఉమా నీలకంఠేశ్వర స్వామి ఆలయం వద్ద బిక్షాటన చేస్తూ జీవిస్తున్నాడు. అంతేకాదు ఆలయం వెనుక ఉన్న స్నానాల గదినే నివాసంగా మార్చుకుని జీవితాన్ని గడుపుతున్నాడు. తన దుస్తులతో పాటు తాను యాచించి సంపాదించిన నగదును కూడా ఆ బాత్ రూమ్ లోనే దాస్తుంటాడు. అయితే ఇటీవల ఆలయ పూజారి బాత్ రూమ్ లో ఉన్న పురంధర్‌ బట్టలను ఇతర సామాగ్రిని బయటకు విసిరేశాడు. అయితే మూటలో ఉన్న నగదు చెల్లాచెదురుగా పడిపోయింది. అలా చెల్లాచెదురుగా పడిన డబ్బులను, చిల్లరను చూసి పూజారి సహా అక్కడ ఉన్నవారు షాక్ తిన్నారు. వెంటనే ఆలయ అధికారుల దృష్టికి  తీసుకువెళ్లారు. దేవాదాయ, ధర్మాదాయ శాఖ అధికారులు యాచకుని ఆరా తీశారు. దీంతో పురంధర్‌ దగ్గర ఉన్న డబ్బులు భక్తులు ధర్మం చేసిందేనని తేలింది. మొత్తాన్ని లెక్కించగా లక్ష రూపాయలకు పైగానే ఉంది. దీంతో పురంధర్‌ అందులోని సగం సొమ్మును స్వామి వారికి విరాళంగా సమర్పించుకున్నాడు. రూ. 50 వేల విలువైన నాణేలను హుండీలో వేశారు. మిగిలిన సగం తనకు అనారోగ్యం చేస్తే వైద్య ఖర్చుల కోసం దాచుకుంటానని వెల్లడించాడు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..