Andhra: అడవిలో కట్టెలు తెచ్చేందుకు వెళ్లాడు.. ఎంతకూ ఇంటికి తిరిగిరాలేదు.. ఆరా తీయగా

శ్రీశైలం హటకేశ్వరం సమీపంలో యువకుడిపై ఎలుగుబంటి దాడి చేసింది. హటకేశ్వరం అటవీ ప్రాంతంలో కట్టెలు తెచ్చుకునేందుకు వెళ్లగా ఎలుగుబంటి దాడి చేసింది. కుడుముల చిన్న దేవయ్య అనే యువకుడి తొడలు గాయాలు కావడంతో సుండిపెంట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆ వివరాలు ఇలా..

Andhra: అడవిలో కట్టెలు తెచ్చేందుకు వెళ్లాడు.. ఎంతకూ ఇంటికి తిరిగిరాలేదు.. ఆరా తీయగా
Representative Image

Edited By: Ravi Kiran

Updated on: Nov 30, 2025 | 11:56 AM

పెద్దపులి, చిరుతపులి.. శ్రీశైలాన్ని వదలడం లేదు. ఎక్కడో ఒక చోట కనిపిస్తూనే ఉన్నాయి. కానీ ఈసారి ఎలుగుబంటి జనావాసాల్లోకి వచ్చింది. అంతేకాదు ఓ యువకుడిపై దాడి చేసి చంపేందుకు ప్రయత్నించింది. తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చేరాడు. ఇలా వన్య మృగాలు శ్రీశైలంలోకి వస్తుండటం, ఈసారి దాడి చేయడం పట్ల భక్తుల్లో ఆందోళన నెలకొంది. వివరాల్లోకి వెళ్తే.. నంద్యాల జిల్లా శ్రీశైలం హటకేశ్వరం సమీపంలో యువకుడిపై ఎలుగుబంటి దాడి కలకలం రేపింది. హటకేశ్వరం అటవీ ప్రాంతంలో కట్టెలు తెచ్చుకునేందుకు వెళ్లిన గిరిజన గూడెంకు చెందిన కుడుముల చిన్నదేవయ్య అనే యువకుడుపై ఎలుగుబంటి దాడి చేసింది.

ఈ దాడిలో ఆ యువకుడికి తొడలకు గాయాలయ్యాయి. వెంటనే ప్రభుత్వం ఆస్పత్రికి తరలించారు. బాధితుడు తెలిపిన వివరాల మేరకు గూడెం సమీపంలోని అటవీ ప్రాంతంలోకి కట్టెలు తెచ్చుకునేందుకు వెళ్లగా ఎలుగుబంటి దాడిచేసి తొడను గాయపరిచిందన్నాడు. గట్టిగా అరుస్తూ పారిపోతుండగా మరో 2 ఎలుగుబంట్లు దాడి చేసేందుకు ప్రయత్నించాయన్నాడు. బాధితుడిని సున్నిపెంట ప్రభుత్వ వైద్యశాలకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స పొందుతున్న గిరిజన యువకుడు చిన్న దేవయ్యను అటవీ శాఖ అధికారులు పరామర్శించారు. అడవిలో ఒంటరిగా వెళ్లే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అటవీశాఖ అధికారుల హెచ్చరించారు.