బోడె రామచంద్ర యాదవ్ ఆమరణ నిరాహార దీక్ష.. ఎందుకంటే..

బీసీ వర్గాల అభ్యున్నతే లక్ష్యంగా బీసీవై పార్టీ అధినేత బోడె రామచంద్ర యాదవ్ మంగళగిరిలో ఆమరణ నిరాహార దీక్షకు దిగారు. “బీసీ సింహగర్జన”లో ప్రస్తావించిన డిమాండ్లపై ప్రభుత్వం స్పందించకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఈ దీక్షకు డా. సూరజ్ మండల్, డా. ఎస్. పూలే మద్దతు ప్రకటించారు.

బోడె రామచంద్ర యాదవ్ ఆమరణ నిరాహార దీక్ష.. ఎందుకంటే..
Ramachandra Yadav Hunger Strike

Updated on: Apr 12, 2026 | 11:56 AM

బీసీ సామాజిక వర్గాల అభ్యున్నతే లక్ష్యంగా భారత చైతన్య యువజన (బీసీవై) పార్టీ అధినేత బోడె రామచంద్ర యాదవ్ ఆమరణ నిరాహార దీక్షను ప్రారంభించారు. మంగళగిరిలోని పార్టీ ప్రధాన కార్యాలయ ఆవరణలో ప్రారంభమైన ఈ ‘ధర్మ దీక్ష’కు పలు బీసీ సంఘాల నాయకులు హాజరయ్యారు. గతంలో నిర్వహించిన “బీసీ సింహగర్జన” సభలో ప్రస్తావించిన ఐదు కీలక డిమాండ్లపై ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో ఈ దీక్షకు దిగినట్లు రామచంద్ర యాదవ్ తెలిపారు.

ఈ కార్యక్రమానికి, అణగారిన వర్గాల అభ్యున్నతి మరియు OBC రిజర్వేషన్ల కోసం పోరాడిన బీపీ మండల్ మనుమడు డా. సూరజ్ మండల్ హాజరై రామచంద్ర యాదవ్ దీక్షకు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయనతో పాటు జ్యోతిబా పూలే మనుమరాలు డా. ఎస్. పూలే మాట్లాడుతూ… బీసీ వర్గాల అభ్యున్నతి కోసం రామచంద్ర యాదవ్ చేస్తున్న పోరాటం అభినందనీయమని పేర్కొన్నారు. బీసీలందరి ఐక్యతతోనే రాజ్యాధికారం సాధ్యమవుతుందని, అప్పుడే సమన్యాయం జరుగుతుందని వారు వ్యాఖ్యానించారు. అలాగే, ఈ ఉద్యమానికి అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తామని స్పష్టం చేశారు.

కాగా  సామాజిక న్యాయం కోసం ధర్మదీక్ష చేస్తున్న భారతీయ చైతన్య యువజన (BCY) పార్టీ జాతీయ అధ్యక్షుడు బోడె రామచంద్ర యాదవ్‌కు మాజీ రాజ్యసభ సభ్యులు విజయసాయి రెడ్డి తన సంపూర్ణ మద్దతు తెలియజేశారు. ఈ మేరుకు ఆయన ఎక్స్‌లో ట్వీట్ చేశారు.

Follow Us