AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra News: అప్పు తిరిగి చెల్లించడం లేదని పెట్రోల్ పోసి నిప్పంటించిన మహిళ.. అంతలోనే ఊహించని ట్విస్ట్..

అప్పుతో.. ఒక్కోసారి ప్రాణాలు కూడా పోతుంటాయి.. అప్పు తీసుకునే ముందు.. ప్లీజ్ డబ్బులు కావాలి.. కుదిరితే వెంటనే ఇస్తా.. కావాలంటే వడ్డీ తీసుకోండి.. అర్జెంట్.. అర్ధం చేసుకోండి.. నా మీద నమ్మకం లేదా..? అబ్బో ఇలాంటి మాటలను ఎన్నో వినే ఉంటారు.. ఇదంతా ఎందుకు అనుకుంటున్నారా.. ఈ వార్త చదివితే.. అప్పు.. అప్పు తీసుకున్న వారిని.. ఇచ్చిన వారిని ఎలాంటి తిప్పలకు గురిచేస్తుంది అనేది అర్ధం అవుతుంది..

Andhra News: అప్పు తిరిగి చెల్లించడం లేదని పెట్రోల్ పోసి నిప్పంటించిన మహిళ.. అంతలోనే ఊహించని ట్విస్ట్..
Crime News
Shaik Madar Saheb
|

Updated on: Apr 11, 2025 | 12:50 PM

Share

అప్పు తీసుకుంటారు.. తిరిగి ఇవ్వరు.. సాధారణంగా అన్ని చోట్ల జరిగే ఘటనలే.. అప్పు తీసుకునే ముందు ఒక మాట.. తీసుకున్న తరువాత ఇంకోమాట అంటూ ఇచ్చిన వారు లబోదిబోమంటున్న ఘటనలను ఎన్నో చూసుంటాం.. అప్పుతో.. ఒక్కోసారి ప్రాణాలు కూడా పోతుంటాయి.. అప్పు తీసుకునే ముందు.. ప్లీజ్ డబ్బులు కావాలి.. కుదిరితే వెంటనే ఇస్తా.. కావాలంటే వడ్డీ తీసుకోండి.. అర్జెంట్.. అర్ధం చేసుకోండి.. నా మీద నమ్మకం లేదా..? అబ్బో ఇలాంటి మాటలను ఎన్నో వినే ఉంటారు.. ఇదంతా ఎందుకు అనుకుంటున్నారా.. ఈ వార్త చదివితే.. అప్పు.. అప్పు తీసుకున్న వారిని.. ఇచ్చిన వారిని ఎలాంటి తిప్పలకు గురిచేస్తుంది అనేది అర్ధం అవుతుంది..

తన దగ్గర తీసుకున్న అప్పు చెల్లించడంలేదని ఓ వ్యక్తిపై మహిళ పెట్రోల్‌ పోసి నిప్పంటించింది.. కానీ.. ప్లాన్‌ రివర్స్‌ అయి ఆమెకు కూడా మంటలు అంటుకోవడంతో అప్పు తీసుకున్న వ్యక్తి.. అప్పు ఇచ్చిన మహిళ.. ఇద్దరూ ఆస్పత్రి పాలయ్యారు.. బాపట్లలో చోటుచేసుకున్న ఈ ఘటన సంచలనంగా మారింది..

బాపట్ల రైల్వేస్టేషన్‌ ముందు పెట్రోల్‌ దాడి కలకలం రేపింది. అప్పు తిరిగి చెల్లించడం లేదనే కోపంతో రైల్వే రిటైర్డ్‌ ఉద్యోగి లక్ష్మీనారాయణపై అతని స్నేహితురాలు.. నల్లమోతు మాధవి పెట్రోల్‌ పోసి నిప్పంటించింది. అయితే.. ప్రమాదవశాత్తు ఆమెకు కూడా మంటలు అంటుకోవడంతో ఇద్దరికీ తీవ్రగాయాలు అయ్యాయి.

వెంటనే అప్రమత్తమైన స్థానికులు.. వారిద్దరికీ అంటుకున్న మంటలు ఆర్పివేసి సమీపంలోని బాపట్ల ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఇద్దరి మధ్య పరిచయంతో లక్ష్మినారాయణకు మాధవి లక్షల రూపాయలు.. అప్పుగా ఇచ్చినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా.. వారిద్దరి మధ్య సాన్నిహిత్య సంబంధం కూడా ఉన్నట్లు చెబుతున్నారు. మహిళ పరిస్థితి విషమంగా ఉన్నట్లు చెబుతున్నారు.

ఈ ఘటనపై బాపట్ల పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇద్దరి నుంచి వివరాలను సేకరిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
జుట్టు పెరుగుదలకు కరివేపాకా? రోజ్‌మేరీనా? రెండింట్లో ఏది బెస్ట్‌?
జుట్టు పెరుగుదలకు కరివేపాకా? రోజ్‌మేరీనా? రెండింట్లో ఏది బెస్ట్‌?
రోహిత్ శర్మకు హ్యాండిచ్చేస్తాడా.. అగార్కర్ మార్క్ వన్డే టీం ఇదేనా
రోహిత్ శర్మకు హ్యాండిచ్చేస్తాడా.. అగార్కర్ మార్క్ వన్డే టీం ఇదేనా
పెళ్లి చేసుకోకపోవడానికి కారణం అదే.. కోవై సరళ..
పెళ్లి చేసుకోకపోవడానికి కారణం అదే.. కోవై సరళ..
వారెవ్వా.. అదృష్టం అంటే వీరిదే..కేతువు ఎఫెక్ట్‌తో వీరి లైఫ్ టర్న్
వారెవ్వా.. అదృష్టం అంటే వీరిదే..కేతువు ఎఫెక్ట్‌తో వీరి లైఫ్ టర్న్
ఈ రాశులవారి జీవితంలో ఊహించని టర్నింగ్ పాయింట్.. మీరున్నారా?
ఈ రాశులవారి జీవితంలో ఊహించని టర్నింగ్ పాయింట్.. మీరున్నారా?
వీరికి అడుగడుగునా ఐశ్వర్యం అదృష్టమే..బుధ సంచారంతో ఊహించని ధన లాభం
వీరికి అడుగడుగునా ఐశ్వర్యం అదృష్టమే..బుధ సంచారంతో ఊహించని ధన లాభం
విశ్వకర్మ పూజ ఎప్పుడు? పూజా సమయం, ప్రాముఖ్యత, విశేషాలు ఇవే!
విశ్వకర్మ పూజ ఎప్పుడు? పూజా సమయం, ప్రాముఖ్యత, విశేషాలు ఇవే!
పాక్ దౌత్యవేత్తకు భారత్ సమన్లు.. సముద్రంలో భారత యుద్ధనౌకను..
పాక్ దౌత్యవేత్తకు భారత్ సమన్లు.. సముద్రంలో భారత యుద్ధనౌకను..
పీఎఫ్ శాలరీ లిమిట్ భారీగా పెంపు.. కేంద్రం బిగ్ అనౌన్స్‌మెంట్..
పీఎఫ్ శాలరీ లిమిట్ భారీగా పెంపు.. కేంద్రం బిగ్ అనౌన్స్‌మెంట్..
మేఘాంశ్ కొత్త సినిమా టీజర్ .. శ్రీహరి కుమారుడికి ఈసారి హిట్ ఖాయం
మేఘాంశ్ కొత్త సినిమా టీజర్ .. శ్రీహరి కుమారుడికి ఈసారి హిట్ ఖాయం