AP News: భర్తను కోల్పోయిన హోంగార్డ్.. తానున్నానంటూ నమ్మించిన ఎస్సై.. నాలుగేళ్ల సహజీవనం తరువాత ఊహించని ట్విస్ట్..

|

Aug 29, 2022 | 6:24 PM

కృష్ణాజిల్లా బంటుమిల్లి ఎక్సైజ్ ఎస్సై కొమ్మా కిషోర్ మోసం చేశాడంటూ ఓ మహిళా హోంగార్డ్‌ పోలీసుల్ని ఆశ్రయించింది. తనతో సహ జీవనం చేస్తూ లక్షల రూపాయలు కాజేశాడని ఫిర్యాదులో పేర్కొంది.

AP News: భర్తను కోల్పోయిన హోంగార్డ్.. తానున్నానంటూ నమ్మించిన ఎస్సై.. నాలుగేళ్ల సహజీవనం తరువాత ఊహించని ట్విస్ట్..
Ap News
Follow us on

Bantumilli excise si cheating : ఆమె హోంగార్డు.. ఇద్దరు పిల్లలున్నారు. ఆమె భర్త మరణించడంతో.. ఎస్ఐ ఆమెకు దగ్గరయ్యాడు. పెళ్లి చేసుకుంటానని నాలుగేళ్ల పాటు సహజీవనం చేస్తూ.. ఆమె దగ్గర డబ్బులు కూడా తీసుకున్నాడు.. కానీ చివరకు పెళ్లి చేసుకోవాలని ఆమె కోరడంతో.. కుదరదంటూ మొహం చాటేశాడు.. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్‌లో చోటుచేసుకుంది. కృష్ణాజిల్లా బంటుమిల్లి ఎక్సైజ్ ఎస్సై కొమ్మా కిషోర్ మోసం చేశాడంటూ ఓ మహిళా హోంగార్డ్‌ పోలీసుల్ని ఆశ్రయించింది. తనతో సహ జీవనం చేస్తూ లక్షల రూపాయలు కాజేశాడని ఫిర్యాదులో పేర్కొంది. పెళ్లి చేసుకుంటానని మాయమాటలు చెప్పి ముఖం చాటేశాడని ఆవేదన వ్యక్తం చేసింది. ఎస్సై మోసాన్ని వివరిస్తూ మహిళా హోంగార్డు మచిలీపట్నం స్పందనలో ఫిర్యాదు చేసింది. డబ్బులు, పెళ్లి విషయం అడిగితే.. ఇప్పుడు తాను ఎస్ఐనని.. ఏమీ చేయలేవని బెదిరిస్తున్నాడని ఆవేదన వ్యక్తంచేసింది.

భర్త చనిపోయి ఇద్దరు పిల్లలతో కలిసి జీవనం కొనసాగిస్తోంది మహిళా హోంగార్డ్‌. నాలుగేళ్ల క్రితం పరిచయమైన ఎక్సైజ్ ఎస్సై కిషోర్‌.. పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. ప్రమోషన్‌కి డబ్బు అవసరం ఉందని చెప్పి రెండున్నర లక్షలు తీసుకున్నాడని.. తీరా ఇప్పుడు అడిగితే బెదిరిస్తున్నాడని ఆరోపించింది. డబ్బు ఇప్పించి ఎస్సైతో తనకు పెళ్లి జరిపించాలని వేడుకుంది బాధితురాలు. కాగా, బాధితురాలి ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు ఆరాతీస్తున్నారు. ఈ ఘటన జిల్లా వ్యాప్తంగా కలకలం రేపింది. దీనిపై ఉన్నతాధికారులు కూడా ఆరా తీసినట్లు సమాచారం.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..