AP Banks Working: ఏపీలో బ్యాంకర్ల సంచలన నిర్ణయం..ఈ రోజు నుంచి బ్యాంకుల సమయాల్లో మార్పులు..!

|

May 06, 2021 | 7:41 AM

AP Banks Working: కరోనా వైరస్ మహమ్మారిని కట్టడి చేసేందుకు ఏపీ సర్కార్‌ కీలక నిర్ణయం తీసుకుంది. రెండు వారాల పాటు మధ్యాహ్నం 12 గంటల నుంచి తర్వాతి రోజు ఉదయం..

AP Banks Working: ఏపీలో బ్యాంకర్ల సంచలన నిర్ణయం..ఈ రోజు నుంచి బ్యాంకుల సమయాల్లో మార్పులు..!
Follow us on

AP Banks Working: కరోనా వైరస్ మహమ్మారిని కట్టడి చేసేందుకు ఏపీ సర్కార్‌ కీలక నిర్ణయం తీసుకుంది. రెండు వారాల పాటు మధ్యాహ్నం 12 గంటల నుంచి తర్వాతి రోజు ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ అమలు చేస్తోంది. ఈ నేపథ్యంలో గురువారం నుంచి బ్యాంకు సమయ వేళల్లో మార్పులు జరిగాయి. రాష్ట్రంలోని అన్ని బ్యాంకులు ఈ రోజు నుంచి నుంచి మే 18వ తేదీ వరకు ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు మాత్రమే పని చేస్తాయని స్టేట్ లెవల్ బ్యాంకర్స్ కమిటీ కన్వీనర్ బ్రహ్మానందరెడ్డి ఓ ప్రకటన తెలిపారు. వినియోగదారులు అత్యవసరమైతేనే బ్యాంకులకు రావాలని ఆయన సూచించారు.

ఇదిలా ఉండగా, ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకు మాత్రమే నిత్యావసర వస్తువులు, వ్యాపారాలకు అనుమతి ఇవ్వగా.. మధ్యాహ్నం 12 గంటల తర్వాత నుంచి ప్రజా రవాణా వాహనాలను పూర్తిగా బంద్ చేస్తున్నారు. అలాగే మధ్యాహ్నం 12 గంటల తర్వాత ఆర్టీసీ బస్సులు, అంతర్రాష్ట్ర సర్వీసులు, దూరప్రాంత బస్సు సర్వీసులు సైతం నిలిచిపోయాయి.

కాగా, ఏపీలో కరోనా పాజిటివ్‌ కేసులు రోజురోజుకు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. కరోనా కట్టడికి ప్రభుత్వం అన్ని విధాలుగా చర్యలు చేపడుతున్నా.. పాజిటివ్‌ కేసులు మాత్రం తగ్గడం లేదు. మరోవైపు మాస్క్‌ ధరించని వారికి పోలీసులు జరిమానా విధిస్తున్నారు. ప్రతి ఒక్కరు మాస్క్‌ ధరిస్తూ భౌతిక దూరం పాటించాలని, లేకపోతే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఇక రాష్ట్రంలో కరోనా పరీక్షలను వేగవంతం చేశారు. ఒక వైపు వ్యాక్సినేషన్‌ కొనసాగుతుంటే మరో వైపు పాజిటివ్‌ కేసులు, మరణాలు నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. కరోనా కట్టడికి పలు ప్రాంతాల్లో లాక్‌డౌన్‌ విధించుకుంటున్నారు.

ఇవీ కూడా చదవండి:

Gold Price Today: తగ్గిన బంగారం ధర.. రికార్డు స్థాయి నుంచి రూ. 9 వేలు వరకు పతనమైన పసిడి రేటు

TSRTC: ఆంధ్ర వెళ్లాలనుకునే వారికి షాకింగ్ న్యూస్.. ఏపీకి బస్సులు నిలిపేసిన టీఎస్ ఆర్టీసీ.. అక్కడి వరకే పరిమితం..!

AP Curfew : తొలిరోజు ఏపీ కర్ఫ్యూలో “సిత్రాలు”.. బంగారం, మందు, మాంసం దుకాణాలపై ఎగబడ్డ జనం.. రాష్ట్ర సరిహద్దులు మూసివేత