Andhra News: కలిసి రాని కార్తీకమాసం.. ఒక్క నెలలో బూడిదపాలైన ఏడాది ఎదురు చూపులు!

కార్తీక మాసం తమకు అస్సలు కలిసి రాలేదంటున్నారు అంబేద్కర్ కోనసీమ జిల్లాలో అరటి రైతులు. గత కొన్ని రోజులుగా దారుణంగా పడిపోయిన అరటి మార్కెట్.. కార్తీక మాసంతో పెరుగుతుందనుకున్న అరటి రైతులకు ఈసారి కూడా ఎదురు దెబ్బ తగిలింది. తుఫాను ప్రభావంతో అరటి ధరలు అమాంతం పడిపోయాయి. పంటకు పెట్టిన పెట్టుబడి కూడా రాలేదని రైతులు వాపోతున్నారు.

Andhra News: కలిసి రాని కార్తీకమాసం.. ఒక్క నెలలో బూడిదపాలైన ఏడాది ఎదురు చూపులు!
Konaseema Banana Farmers

Edited By: Anand T

Updated on: Nov 09, 2025 | 5:25 PM

కార్తీక మాసం తమకు అస్సలు కలిసి రాలేదంటున్నారు అంబేద్కర్ కోనసీమ జిల్లాలో అరటి రైతులు. గత కొన్ని రోజులుగా దారుణంగా పడిపోయిన అరటి మార్కెట్.. కార్తీక మాసంతో పెరుగుతుందనుకున్న అరటి రైతులకు ఈసారి కూడా ఎదురు దెబ్బ తగిలింది. తుఫాను ప్రభావంతో అరటి ధరలు అమాంతం పడిపోయాయి. అంబాజీపేట అరటి మార్కెట్‌కు అరటి గేలలు భారీగా తరలివచ్చినా.. ధరలు మాత్రం లేవని అరటి రైతులు గగ్గోలు పెడుతున్నారు. తుఫాన్ కారణంగా గేలలు పడిపో నాసిరకంగా మారాయని.. దీంతో మార్కెట్‌లో వాటిని కొనే వారు లేక సరుకు అలాగే మిగిపోయిందన్నారు.

కొన్ని ప్రాంతాల్లో కొనుగోలు దారులు ఉన్నప్పటికీ.. సరుకు ఎక్కవ ఉండడంతో వాటి డిమాండ్ తగ్గి తక్కువ ధరలే అమ్ముడవుతున్నాయన్నారు. కార్తీక మాసంలో ధరలు పెరుగుతాయని భావించినా.. పెరగకపోవడంతో ఏడాది తీరని నష్టం జరిగిందని చెబుతున్నారు. గత ఏడాది కార్తీక మాసంలో పూజకు ఉపయోగించి కర్పూర రకము అరటి గెల 500 రూపాయలు పలికితే ఇప్పుడు 200లకు కూడా కొనేవాడు లేరని వాపోతున్నారు.

ప్రతి ఏటా కార్తీక మాసంలో పూజలకు, అలాగే అయ్యప్ప స్వాములు పూజలకు ఎక్కువగా అరటి పండ్లు అవసరమవుతాయని.. ఆ కారణంగానే వాటికి డిమాండ్‌తో పాటు ధరలు కూడా పెరుగుతాయని ఏడాదంతా కార్తీక మాసం కోసం ఎదురు చూస్తామని.. కానీ ప్రతి ఏడాదిలా ఈ సారి మాత్రం కార్తీక మాసం తమను ఆదుకోలేదని చెప్పుకొచ్చారు.

రైతులు ఏం చెబుతున్నారో చూడండి..

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.