Balineni Srinivasa Reddy on Chiranjeevi: సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిని చిరంజీవి కలవడాన్ని రాజకీయం చేస్తున్నారంటూ ఏపీ విద్యుత్‌శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి (Balineni Srinivasa Reddy) మండిపడ్డారు. సీఎంను చిరంజీవి కలిసింది కేవలం సినిమాకు సంబంధించిన పరిస్థితులు, ఇబ్బందులు వంటి అంశాలపై మాత్రమేనంటూ శ్రీనివాసులురెడ్డి స్పష్టం చేశారు. చిరంజీవి (Chiranjeevi) అన్నదమ్ముల్లో చిచ్చు పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారంటూ కొంతమంది అవాస్తవ ప్రచారాలు చేస్తున్నారంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్ జగన్ (CM YS Jagan) పార్టీ పెట్టిన నాటి నుంచి ఒంటరిగానే పోటీ చేస్తున్నారని తెలిపారు. ఇలాంటి కార్యక్రమాలు, అవాస్తవ ప్రచారాలు చేసేది చంద్రబాబే అంటూ శ్రీనివాసులురెడ్డి ఆరోపించారు. చంద్రబాబు దళితుల్లో, కాపు కులాల్లో చిచ్చు పెట్టి రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తుంటారంటూ విమర్శించారు. అసలు విషయాన్ని దారి మళ్లించేందుకు కొంతమంది అవాస్తవ ప్రచారాలను చేస్తుంటారని ఆయన పేర్కొన్నారు.
ఇదిలాఉంటే.. సినిమా ఇండస్ట్రీ సమస్యలపై గురువారం మెగాస్టార్ చిరంజీవి ఏపీ సీఎం జగన్‌మోహన్ రెడ్డితో భేటి అయిన విషయం తెలిసిందే. ఆయన భేటీ అనంతరం మెగాస్టార్ చిరంజీవికి అధికార వైఎస్ఆర్‌సీపీ పార్టీ నుంచి రాజ్యసభ సీటు ఇస్తున్నారంటూ పుకార్లు షికార్లు చేశాయి. ఈ వార్తలపై చిరంజీవి సైతం స్పందించారు. రాజకీయాలకు తాను దూరంగా ఉన్నానని ప్రముఖ సినీనటుడు స్పష్టం చేశారు. తాను పదవులకు లోబడే వ్యక్తిని కాదని.. తనకు రాజ్యసభ సీటు ఇస్తారన్న వార్తలు ఊహాజనితమేనని ఖండించారు.
తెలుగు సినీ పరిశ్రమ మేలుకోసమే సీఎంతో భేటీ అయ్యానని.. చర్చించిన విషయాలని పక్కదోవ పట్టించే విధంగా ఆ మీటింగ్‌కు రాజకీయరంగు పులిమారన్నారు. రాజకీయాలకు దూరంగా ఉంటున్న తాను మళ్ళీ రాజకీయాల్లోకి చట్టసభలకు రావటం జరగదన్నారు. ఇప్పటివరకు జరుగుతున్న ప్రచారానికి పుల్ స్టాప్ పెట్టమని కోరుతున్నానంటూ చిరంజీవి పేర్కొన్నారు.
Also Read: