Badvel By Election: బద్వేల్‌ బాద్‌షా ఎవరు?.. మరికొద్ది గంటల్లో తేలనున్న నేతల భవితవ్యం..

|

Nov 01, 2021 | 10:13 PM

Badvel By Election: బద్వేల్‌ బాద్‌షా ఎవరు? ఫ్యాన్‌ గాలికి కమలం నిలబడుతుందా? లేక కొత్త హిస్టరీ క్రియేట్ అవుతుందా? మరికొన్ని గంటల్లో తేలిపోనుంది.

Badvel By Election: బద్వేల్‌ బాద్‌షా ఎవరు?.. మరికొద్ది గంటల్లో తేలనున్న నేతల భవితవ్యం..
Badvel
Follow us on

Badvel By Election: బద్వేల్‌ బాద్‌షా ఎవరు? ఫ్యాన్‌ గాలికి కమలం నిలబడుతుందా? లేక కొత్త హిస్టరీ క్రియేట్ అవుతుందా? మరికొన్ని గంటల్లో తేలిపోనుంది. రేపు ఉదయం మొదలయ్యే కౌంటింగ్‌కు‌ సర్వం సిద్ధమైంది. మధ్యాహ్నంకల్లా రిజల్ట్ తేలిపోనుంది. బద్వేల్‌పై ఎగిరేది ఎవరిజెండా? వార్‌వన్‌సైడే అవుతుందా? కమలం గట్టిపోటీ ఇస్తుందా? ఇప్పుడు అందరిలోనూ ఇదే ఉత్కంఠ. ఈ ఉత్కంఠకు మరికొన్ని గంటల్లో తెరపడనుంది.

ఉదయం 8 గంటలకు లెక్కింపు మొదలవుతుంది. మొత్తం నాలుగు హాళ్లలో 28 టేబుళ్లు ఏర్పాటు చేశారు. 10 రౌండ్లలో కౌంటింగ్ పూర్తవుతుంది. కొన్ని చోట్ల 12 రౌండ్స్‌వరకూ వెళ్లే ఛాన్స్ ఉందని ఎన్నికల అధికారి కేతన్ గార్గ్ వెల్లడించారు. మధ్యాహ్నం కల్లా రిజల్ట్స్ తెలిసిపోతాయి. అభ్యర్థుల సమక్షంలో స్ట్రాంగ్ రూమ్స్‌ తెరుస్తారు. కౌటింగ్ సూపర్ వైజర్లు, మైక్రో అబ్జర్వర్ల పర్యవేక్షణలో లెక్కింపు జరుగుతుంది. రౌండ్ వారీగా ఫలితాలను డిస్‌ప్లే చేస్తారు. వర్షం పడినా ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేశారు.

ఈసారి పోస్టల్‌ బ్యాలెట్‌ రెండు కేటగిరీలు ఉంటాయి. అవి సర్వీస్ ఓట్లు. వయోవృద్ధుల ఓట్లు. కౌంటింగ్ మొదలయ్యే వరకు సర్వీస్‌ ఓట్లను అనుమతిస్తారు. బైపోల్‌ బరిలో మొత్తం 15 మంది అభ్యర్థులు పోటీపడ్డారు. కానీ వైసీపీ-బీజేపీ మధ్యే వార్ జరిగింది. వైసీపీ నుంచి డాక్టర్‌ దాసరి సుధ, బీజేపీ నుంచి పనతల సురేష్‌, కాంగ్రెస్‌ నుంచి కమలమ్మ పోటీ చేశారు. 281 పోలింగ్‌ కేంద్రాల్లో ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకున్నారు. గతంతో పోలిస్తే పోలింగ్ పర్సెంటేజ్ తగ్గింది.

బద్వేల్‌లో ఈసారి 68.3 శాతం పోలింగ్ మాత్రమే నమోదైంది. 2019లో ఇది 77 శాతంగా ఉంది. వర్షంతో తలెత్తిన ఇబ్బందుల కారణంగా జనం పెద్దగా ఓటింగ్‌లో పాల్గొనలేదు. విజయంపై మొదటి నుంచి ధీమాగా ఉన్న వైసీపీ మెజార్టీపైనే తమ ఫోకస్ అని ప్రకటించింది. ఇక బీజేపీ మాత్రం చాలా చోట్ల రిగ్గింగ్ జరిగిందని ఆరోపిస్తోంది. 28 కేంద్రాల్లో రీపోలింగ్ నిర్వహించాలని డిమాండ్ చేసింది. బద్వేల్‌ బైపోల్‌ కౌంటింగ్‌ కోసం మొత్తం నాలుగు హాళ్లలో 28 టేబుళ్లు ఏర్పాటు చేశారు. 10 రౌండ్లలో కౌంటింగ్ పూర్తవుతుంది. కొన్ని చోట్ల 12 రౌండ్స్‌వరకూ వెళ్లే ఛాన్స్ ఉంది.

Also read:

Viral Video: పామును చెడుగుడు ఆడుకున్న ముంగీస.. ఫైట్‌లో గెలిచింది ఎవరంటే? వీడియో వైరల్!