Badvel By Election: బద్వేల్ ప్రీమియర్‌ లీగ్‌లో ట్రయాంగిల్‌ వార్.. బరిలోకి బీజేపీ, కాంగ్రెస్..!

|

Oct 06, 2021 | 7:35 PM

Badvel By Election: బద్వేల్‌ ఉప ఎన్నికలో పోటీ తప్పేలా లేదు. తెలుగుదేశం, జనసేన బరిలోంచి తప్పుకున్నా.. బీజేపీ, కాంగ్రెస్ మాత్రం పోటీకి సై అంటున్నాయి.

Badvel By Election: బద్వేల్ ప్రీమియర్‌ లీగ్‌లో ట్రయాంగిల్‌ వార్.. బరిలోకి బీజేపీ, కాంగ్రెస్..!
Badvel By Poll
Follow us on

Badvel By Election: బద్వేల్‌ ఉప ఎన్నికలో పోటీ తప్పేలా లేదు. తెలుగుదేశం, జనసేన బరిలోంచి తప్పుకున్నా.. బీజేపీ, కాంగ్రెస్ మాత్రం పోటీకి సై అంటున్నాయి. వారసత్వ రాజకీయాలకు తాము వ్యతిరేకం కాబట్టి పోటీ చేసి తీరుతామంటున్నారు కమలనాథులు.. అటు కాంగ్రెస్ కమలమ్మ పేరుని ప్రకటించింది. బద్వేల్‌లో ప్రజాస్వామ్యాన్ని కాపాడుతామని, వైసీపీ బెదిరింపులకు లొంగేది లేదని తేల్చి చెప్పారు ఏపీ పీసీసీ చీఫ్ శైలజానాథ్.

బద్వేల్‌ బైపోల్‌పై క్లారిటీ వచ్చేసింది. ట్రయాంగిల్‌ వార్‌ కన్ఫాం అయింది. బద్వేల్ ఉప ఎన్నికలో పోటీ చేసి తీరుతామని ప్రకటించిన భారతీయ జనతా పార్టీ తమ అభ్యర్థిపై దాదాపు ఓ క్లారిటీకి వచ్చేసింది. అటు కాంగ్రెస్‌ నామినేషన్ వేసేందుకు సిద్ధమవుతోంది. ఎవరు బరిలో నిలిచినా వార్‌ వన్‌సైడే అంటోంది వైసీపీ. అయితే, బీజేపీ, కాంగ్రెస్ బరిలో నిలిచాయి. ఇప్పటికే మాజీ ఎమ్మెల్యే కమలమ్మ పేరుని ప్రకటించిన కాంగ్రెస్ నామినేషన్‌ వేసేందుకు సిద్ధమవుతున్నారు. బీజేపీ క్యాండిడేట్‌గా సురేష్‌ పనతాల పేరు దాదాపు ఖరారైనట్లేనని సమాచారం. హైకమాండ్‌ నుంచి గ్రీన్‌సిగ్నల్‌ రాగానే అధికారికంగా ప్రకటించే ఛాన్స్ ఉంది. గతంలో రైల్వేకోడూరు నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు సురేష్. ఏబీవీపీ స్టూడెంట్ లీడర్‌గా 14 సంవత్సరాలు పనిచేశారు. రెండు సంవత్సరాలు BJYM నేషనల్ సెక్రటరీగానూ ఉన్నారు. సంఘ్ పరివార్‌తోనూ పరిచయాలున్నాయి.

అటు వైసీపీ ప్రచారంలో దూసుకుపోతోంది. ఇంటింటి ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇప్పటికే డాక్టర్ సుధ నామినేషన్‌ వేశారు. భారీ మెజార్టే లక్ష్యంగా యాక్షన్ ప్లాన్ ప్రిపేర్ చేస్తున్నారు అధికార పార్టీ వైసీపీ నేతలు. మంత్రులు, ఎమ్మెల్యేలకు బైపోల్ బాధ్యతను అప్పగించారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్. అటు బూతు కమిటీల కన్వీనర్లకూ ఆదేశాలు వెళ్లిపోయాయి. ఇంటింటికీ తిరుగుతూ ప్రచారం సాగిస్తున్నారు. గత ఎన్నికలకంటే మెజార్టీని పెంచుకోవడమే టార్గెట్‌గా పనిచేస్తున్నారు. గోపవరం మండలంలో ఎంపీ అవినాష్ రెడ్డి, ప్రభుత్వ విప్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి క్యాంపేన్ చేశారు. బూత్ కమిటీ కన్వీనర్లతో ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశారు.

మరోవైపు, నామినేషన్లకు చివరి తేదీ దగ్గరపడుతుండటంతో అభ్యర్థుల్లో టెన్షన్ నెలకొంది. ఇప్పటికే కొందరు ఇండిపెండెంట్లు పోటీలో నిలిచారు. వీరితో విత్‌డ్రా చేయించి ఏకగ్రీవం కోసం ప్రయత్నించాలని భావించింది వైసీపీ. అయితే, కాంగ్రెస్, బీజేపీ బరిలోకి దిగుతుండటంతో ఉప ఎన్నికపై ఆసక్తి నెలకొంది. అటు బద్వేల్‌లో బీజేపీ శ్రేణులతో సమావేశం నిర్వహించారు. క్యాండిడేట్ ఎంపికపై చర్చించారు. మెత్తానికి బద్వేల్‌ బరిలో ఎవరు నిలిచినా వార్‌ మాత్రం వన్‌సైడే అంటున్నారు వైసీపీ నేతలు.

ఇదిలావుంటే, ద్వేల్‌ బైపోల్‌ను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశామని ఎన్నికల అధికారి కేతన్‌గార్గ్‌ ప్రకటించారు. 80 ఏళ్లు పైబడిన వృద్ధులు, దివ్యాంగులకు ప్రత్యకంగా పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం కల్పించామని తెలిపారు. అటు నామినేషన్లకు మరో రెండు రోజుల గడువు మాత్రమే ఉంది. ఈనెల 30న పోలింగ్..నవంబర్ 2న కౌంటింగ్ ఉంటుంది. అదే రోజు ఫలితాన్ని వెల్లడించనున్నారు.

Read Also…  బట్టలకొట్టు పాండురంగయ్య.. ఏకంగా 90 కోట్లు అప్పు చేసి ఐపీ పెట్టాడు.. ఎంతమంది బలయ్యారో తెలిస్తే షాకే