Andhra Pradesh: మిత్రులు ఎగతాళి చేస్తున్నారని యువకుడి మనస్తాపం.. చివరికి ఏం జరిగిందంటే..

|

Sep 13, 2021 | 8:58 AM

Andhra Pradesh: మిత్రులు చేసిన ఎగతాళి.. ఓ యువకుడి ప్రాణాలమీదకొచ్చింది. ప్రస్తుతం ఆస్పత్రిలో చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు. వివరాల్లోకెళితే..

Andhra Pradesh: మిత్రులు ఎగతాళి చేస్తున్నారని యువకుడి మనస్తాపం.. చివరికి ఏం జరిగిందంటే..
Suicide Attempt
Follow us on

Andhra Pradesh: మిత్రులు చేసిన ఎగతాళి.. ఓ యువకుడి ప్రాణాలమీదకొచ్చింది. ప్రస్తుతం ఆస్పత్రిలో చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు. వివరాల్లోకెళితే.. కృష్ణా జిల్లాలోని అవనిగడ్డ 3వ వార్డుకు చెందిన మెండు సూర్యకుమార్ కొద్ది రోజులుగా కొరియర్ బాయ్‌గా పని చేస్తున్నాడు. ఈ క్రమంలోనే ఆటో కిస్తీకి సంబంధించి తన మిత్రులతో వివాదం ఏర్పడింది. మాటా మాటా పెరిగి గత నెలలో కొట్లాట కూడా జరిగింది. అయితే, ఆ సమయంలో ఇరువురివైపు పెద్దలు రాజీ కుదిర్చారు. అలా కొద్దిరోజుల పాటు బాగానే గడిచింది. అయితే, ఆ తరువాత మిత్రులు మళ్లీ ఎగతాళి చేయడం ప్రారంభించారు. దాంతో తీవ్ర మనస్తాపానికి గురైన సూర్య కుమార్.. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పటించుకున్నాడు.

ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన సూర్య కుమార్‌ను అవనిగడ్డ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు స్థానికులు. సూర్యకుమార్ పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో.. అవనిగడ్డ న్యాయమూర్తి జీవీఎల్ సరస్వతి.. ఆస్పత్రికి వచ్చి సూర్యకుమార్ దగ్గర వాంగ్మూలం తీసుకున్నారు. అనంతరం మెరుగైన వైద్య చికిత్స కోసం సూర్యకుమార్‌ని మచిలీపట్నం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బాధితుడు ఇచ్చిన వాంగ్మూలం మేరకు ఇద్దరిపై కేసు నమోదు చేసినట్లు అవనిగడ్డ సీఐ భీమేశ్వర రవికుమార్ తెలిపారు. సూర్యకుమార్ బంధువుల ఫిర్యాదును కూడా నమోదు చేసుకున్నామని, విచారణ అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామని సీఐ తెలిపారు.

Also read:

IPL 2021: ఐపీఎల్‌ చరిత్రలో భయంకరమైన ఓపెనర్లు వీరే.. టాప్ 5లో ఈ బ్యాట్స్‌మెన్‌ని చూసి షాకవుతారంతే?

Telangana: ఆటో కిరాయి కోసం గొడవ.. పోలీస్ కానిస్టేబుల్ అరెస్ట్.. ఎక్కడ జరిగిందంటే..

Bigg Boss 5 Telugu: బయటకు వచ్చాకా.. ఆ కంటెస్టెంట్‌కు ఇచ్చిపడేసిన సరయు.. అంత ఈగో ఎందుకు నీకు అంటూ..