Andhra Pradesh: ఫోన్ లో గట్టిగా మాట్లాడుతున్నాడని.. ముఖంపై పెట్రోల్ పోసి నిప్పంటించారు

|

May 16, 2022 | 12:06 PM

సమాజంలో నేరాలు, దాడులు, అఘాయిత్యాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. వీటికి తోడు మద్యం మహమ్మారి జీవితాలను ఛిన్నాభిన్నం చేస్తోంది. మద్యం మత్తులో విచక్షణ కోల్పోయేలా చేసి దారుణాలు చేసేలా....

Andhra Pradesh: ఫోన్ లో గట్టిగా మాట్లాడుతున్నాడని.. ముఖంపై పెట్రోల్ పోసి నిప్పంటించారు
Fire Incident
Follow us on

సమాజంలో నేరాలు, దాడులు, అఘాయిత్యాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. వీటికి తోడు మద్యం మహమ్మారి జీవితాలను ఛిన్నాభిన్నం చేస్తోంది. మద్యం మత్తులో విచక్షణ కోల్పోయేలా చేసి దారుణాలు చేసేలా ఉసిగొల్పుతోంది. చిన్న చిన్న వాటికే సహనం కోల్పోయి రాక్షసంగా ప్రవర్తిస్తున్నారు. ఓ వ్యక్తి ఫోన్ లో గట్టిగా మాట్లాడుతున్నాడంటూ అతనిపై మరో ఇద్దరు పెట్రోల్ పోసి నిప్పంటించారు. ఈ ఘటనలో బాధితుడి పరిస్థితి విషమంగా ఉంది. వైఎస్ఆర్ జిల్లాలోని ప్రొద్దుటూరు మండలం మడూరు రోడ్డుకు చెందిన నరసింహ.. పాత బట్టల వ్యాపారం చేస్తూ జీవిస్తున్నాడు. అతడికి భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఆదివారం మడూరు రోడ్డులోని ఖాళీ ప్రదేశంలో నరసింహ మద్యం సేవించాడు. అదే సమయంలో ఫోన్ లో గట్టిగా మాట్లాడుతున్నాడు. అక్కడే మరో గ్రూప్ లో మద్యం తాగుతున్న చిన్న, ప్రసాద్‌ లు ఫోన్‌లో ఎందుకు గట్టిగా మాట్లాడుతున్నావని నరసింహను ప్రశ్నించారు. ఈ విషయమై ఇరువురి మధ్య మాటామాటా పెరిగింది. దీంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన చిన్న, ప్రసాద్‌ లు నరసింహ ముఖంపై పెట్రోల్ పోసి నిప్పంటించారు.

ఈ ఘటనలో నరసింహ ముఖం, శరీరంపై తీవ్ర గాయాలయ్యాయి. బాధితుడు గట్టిగా కేకలు వేస్తుండటంతో స్థానికులు గమనించి అక్కడికి వచ్చారు. నరసింహను ప్రొద్దుటూరు జిల్లా ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం కడప రిమ్స్‌కు తరలించినట్లు ఎస్సై సంజీవ రెడ్డి తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. దర్యాప్తు చేపట్టి ఒకరిని అదుపులోకి తీసుకున్నారు.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం క్లిక్ చేయండి..

ఇవి కూడా చదవండి

Also Read: 

Vijay Devarakonda- Samantha: ‘ఖుషి’ టైటిల్‌తో వచ్చేసిన విజయ్‌ దేవరకొండ, సమంత.. అదిరిపోయిన ఫస్ట్‌ లుక్‌..

Rashmika Mandanna: స్నేహితురాలి పెళ్లిలో సందడి చేసిన రష్మిక.. నెట్టింట్లో వైరలవుతోన్న ఫొటోలు..