Astro Tips: డబ్బు ఇబ్బందులు పడుతున్న గురు బలం లేనివారు.. గురువారం పాటించాల్సిన నివారణ చర్యలు ఏమిటంటే..

|

Apr 28, 2022 | 4:31 PM

Astro Tips: హిందూ మతంలో (Hindu Dharma) వారంలోని ప్రతి రోజు ఏదో ఒక దేవుడికి లేదా దేవతకు అంకితం చేయబడింది. ఈ నేపథ్యంలో  గురువారం(Tuesaday)  లేదా లక్ష్మివారం బ్రహ్మ, బృహస్పతి , విష్ణువులకు..

Astro Tips: డబ్బు ఇబ్బందులు పడుతున్న గురు బలం లేనివారు.. గురువారం పాటించాల్సిన నివారణ చర్యలు ఏమిటంటే..
Thursday For Good Luck
Follow us on

Astro Tips: హిందూ మతంలో (Hindu Dharma) వారంలోని ప్రతి రోజు ఏదో ఒక దేవుడికి లేదా దేవతకు అంకితం చేయబడింది. ఈ నేపథ్యంలో  గురువారం(Tuesaday)  లేదా లక్ష్మివారం బ్రహ్మ, బృహస్పతి , విష్ణువులకు అంకితం చేయబడింది. ఈ రోజు ప్రత్యేకంగా వీరిని  పూజిస్తారు. జాతకంలో గురు గ్రహం బలంగా ఉంటే.. ఆ వ్యక్తికి ఉన్న అన్ని సమస్యలు తొలగిపోతాయని నమ్మకం. అదే సమయంలో, చాలా మంది వ్యక్తుల జాతకంలో బృహస్పతి  బలహీనంగా ఉంటాడు. ఇలాంటి వారు అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది.  అంతేకాదు డబ్బు సంబంధిత సమస్యలు ( Thursday ), ఆర్ధిక పురోగతిలో ఆటంకాలు ఏర్పడతాయి. జాతకంలో బృహస్పతిని బలంగా ఉండేలా చేయడానికి కొన్ని చర్యలు తీసుకోవచ్చు. అవి ఏమిటో ఈరోజు తెలుసుకుందాం..

పసుపు బట్టలు ధరించండి: ఎవరి జాతకంలోనైనా బృహస్పతి బలహీనంగా ఉంటే, గురువారం నాడు ఉపవాసం ఉండాలి. ఈ రోజున పసుపు రంగు దుస్తులు ధరించాలి. ఇలా చేయడం చాలా శుభప్రదంగా భావిస్తారు. ఇది జాతకంలో బృహస్పతిని బలపరుస్తుంది.

మంత్రాన్ని జపించండి: గురువారం, మీరు ఓం గ్రాం గ్రీం గ్రౌం స: గుర్వే నమః అనే మంత్రాన్ని జపించండి. మీరు ఈ మంత్రాన్ని జపిస్తూ..  3 లేదా 5 ప్రదక్షిణలు చేయండి.

దానం చేయండి:  జాతకంలో బృహస్పతి బలపడేందుకు మీరు దానం చేయవచ్చు. తేనె, పసుపు బట్టలు, పసుపు, పుస్తకం, బంగారం, పసుపు, ధాన్యం, పుష్యరాగం దానం చేయవచ్చు.

ఉపవాసం: గురువారంరోజున ఉపవాసం ఉండండి. ఇలా చేయడం వల్ల తెలివి, జ్ఞానం పెరుగుతాయి. వివాహంలో జాప్యం అవుతుంటే ఆ సమస్య తొలగిపోతుంది.

పుష్యరాగం ధరించండి: ఎవరి జాతకంలోనైనా గురువు బలహీనంగా ఉంటే, అతను పుష్పరాగము ధరించాలి. జ్యోతిష్యుడిని సంప్రదించిన తర్వాత మీరు పుష్పరాగాన్ని ధరించవచ్చు.

అరటి చెట్టుకు పూజ : గురువారం అరటి చెట్టుకు పూజ చేయండి. కుంకుమ, పప్పు, పసుపుతో పూజించాలి. గురువారం రోజుల్లో క్రమం తప్పకుండా ఓం గ్రాం గ్రీం గ్రౌం స: గుర్వే నమః అనే మంత్రాన్ని జపించండి.

పసుపు  రంగు తీపి తినండి:  గురువారం పసుపు రంగు దుస్తులు ధరించండి. పసుపు రంగు మిఠాయిలు తినండి. మీరు శనగపిండి లడ్డూలను తీసుకోవచ్చు. స్నానపు నీటిలో పసుపు కలపుకోండి. ఇది చాలా ప్రయోజనకరంగా పరిగణించబడుతుంది.

పెద్దలను గౌరవించండి:  తల్లిదండ్రులను, పెద్దలను గౌరవించండి. పెద్దల పట్ల గౌరవం కల్గిన వ్యక్తుల జీవితంలో  బృహస్పతి గ్రహం బలంగా ఉంటుంది.

బ్రహ్మదేవుని పూజించండి: రావి చెట్టు, బ్రహ్మ దేవుడిని పూజించండి. గురువారం బృహస్పతిని పూజించడం వలన కూడా గురు గ్రహం బలపడుతుంది.

(ఇక్కడ ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలు, నమ్మకంపై ఆధారపడి ఉంటుంది, దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. సాధారణ ఆసక్తిని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించబడింది.)

Also Read: Success Story: వ్యవసాయం దండగ కాదు పండగ అంటున్న రైతు.. 23 అడుగుల పొడవు చెరకు పండించి రికార్డ్..