AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: పోలీస్‌ పేరుతో దాష్టీకం.. మతిస్థిమితం లేని మహిళను చితక్కొట్టిన ఉన్మాది..!

ఒంగోలు బస్టాండ్ బెంచీలపై నిద్రపోతున్న ప్రయాణికులను కర్రతో కొడుతూ లేవమంటూ.. తాను హెడ్ కానిస్టేబుల్‌నని ఇక్కడి నుంచి అందరూ వెళ్ళిపోవాలని హుకుం జారీ చేశాడు.

Andhra Pradesh: పోలీస్‌ పేరుతో దాష్టీకం.. మతిస్థిమితం లేని మహిళను చితక్కొట్టిన ఉన్మాది..!
Assulted In Ongole
Fairoz Baig
| Edited By: Balaraju Goud|

Updated on: Oct 24, 2024 | 6:14 PM

Share

అది ఒంగోలు ఆర్టీసీ బస్టాండ్‌.. అర్ధరాత్రి ఒంటి గంట సమయం.. దూర ప్రయాణాలకు వెళ్ళే బస్సులతో, ప్రయాణీకులతో ఆర్టీసీ బస్టాండ్ సందడిగా ఉంది. అదే సమయంలో బస్టాండ్‌ ఆవరణలో ఉన్న బెంచీలపై కొంతమంది పల్లెటూళ్ళకు తెల్లవారుజామున వెళ్ళే ప్రయాణీకులు నిద్రపోతున్నారు. ఆ పక్కగా మతిస్థిమితం లేని ఓ మహిళ కింద నేలపై పడుకుని కునికిపాట్లు పడుతోంది. ఇంతలో రాక్షసుడిలా ఒకడు వచ్చాడు. చేతిలోని కర్రతో రెచ్చిపోయాడు. ఇష్టమొచ్చిన రీతిలో ప్రయాణికులను చితకబాదుతూ.. దాష్టీకానికి పాల్పడ్డాడు.

ప్రయాణంకోసం వేచి చూస్తూ బెంచీలపై నిద్రపోతున్న వారిని కర్రతో కొడుతూ లేవమంటున్నాడు… తాను హెడ్ కానిస్టేబుల్‌నని ఇక్కడి నుంచి అందరూ వెళ్ళిపోవాలని హుకుం జారీ చేశాడు. అదే క్రమంలో కింద నేలపై పడుకుని ఉన్న ఓ మతిస్థిమితం లేని మహిళను కర్రతో విచక్షణారహితంగా చితకబాదాడు. మతిస్థిమితం లేని ఆ మహిళ ఎందుకు కొడుతున్నావంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. దీంతో మరింత రెచ్చిపోయిన ఆ ఉన్మాది కర్రతో ఆ మహిళను గొడ్డును బాదినట్టు బాదాడు. విపరీతమైన నొప్పిని తాళలేక ఆమె అరుస్తున్న చుట్టుపక్కల ప్రయాణీకులు ఒక్కరంటే ఒక్కరు కూడా అడ్డుకోలేదు. అతను పోలీసునని చెప్పడంతో అంతా కళ్ళప్పగించి చూస్తుండిపోయారు..!

ఆ అభాగ్యురాలి కేకలు విని ఆ పక్కనే ఉన్న పోలీసులు రావడం, ఆ ఉన్మాదిని అదుపులోకి తీసుకోవడం వెంటవెంటనే జరిగిపోయాయి. తీరా పోలీసులు అతడ్ని విచారిస్తే తాను ఒంగోలు బస్టాండ్‌లోని దుకాణాల్లోని ఓ దుకాణంలో పనిచేస్తున్న నాగరాజుగా చెప్పుకొచ్చాడు. బస్టాండ్‌లో బెంచీలపై పడుకుని ఉంటే వారందరిని తరిమేస్తున్నానని జవాబిచ్చాడు. పోలీసులు అతడ్ని అదుపులోకి తీసుకుని ఒంగోలు ఒన్‌టౌన్‌ ఫిఎస్‌కు తరలించారు. మతిస్థిమితం లేని మహిళను నాగరాజు దారుణంగా కొడుతున్న దృశ్యాలను ఓ ప్రయాణీకుడు తన సెల్‌లో చిత్రీకరించి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయడంతో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..