మాన్సాస్ ట్రస్ట్ బోర్డు ఛైర్మన్ నియామకం, ఆలయ భూముల విషయంలో కీలక వ్యాఖ్యలు చేశారు ఆ ట్రస్టు బోర్డు ఛైర్మన్ అశోక్ గజపతిరాజు. మాన్సాస్ ట్రస్టు విషయంలో ఆడపిల్లలకు హక్కులు వస్తాయని కొందరు మంత్రులు అందర్నీ కన్‌ఫ్యూజ్ చేశారని ఆరోపించారు. రక్తం పంచుకు పుట్టిన పిల్లలకు తమ ఆస్తి పంపకాల్లో విభేదాలు ఉండరాదన్నారు. అయితే ట్రస్టు వేరు, ప్రైవేట్ ప్రాపర్టీ వేరన్నారు. ట్రస్టు ప్రభుత్వ ఆస్తులంటూ కొందరు కన్‌ఫ్యూజ్ అవుతున్నారు. మాన్సాస్ ట్రస్టు విషయంలో భక్తులు ఇచ్చిన కానుకలు దేవుడికే చెల్లుతాయన్నారు అశోక్‌గజపతిరాజు. ఇది ప్రభుత్వ ఆస్తి ఎంత మాత్రం కాదన్నారాయన. ఈ విషయంలో గతంలో సుప్రీంకోర్టు కూడా చాలాసార్లు చెప్పిందని ఈ సందర్భంగా గుర్తు చేశారు. మాన్సాస్ ట్రస్ట్ విషయంలో ప్రభుత్వం ఓ రెగ్యులేటర్‌గానే పనిచేస్తుందన్నారు. ఐతే ఓనర్ మాత్రం కాదన్నారు. ప్రభుత్వం రోల్ ఏంటనేది స్పష్టంగా ఉందన్నారు.
రాష్ట్రంలో ఆనవాయితీగా ఉన్న దేవాలయాలు 230 వరకు ఉన్నాయన్నారు. కావాలంటే వాటికి ప్రభుత్వం ఫౌండర్ మెంబర్స్ మొత్తం మహిళలకే ఇవ్వొచ్చన్నారు. సింహాచలం దేవాలయ భూములను ఓ పాలసీ ప్రకారం ఇవ్వాలనేది తన అభిప్రాయమన్నారు. తనకు ఎవరితోనూ వ్యక్తిగత కక్ష లేదన్నారు. అందరితో కలిసి పనిచేస్తానన్నారు. ధర్మకర్తగా తనకు- అధికారులకు మధ్య భవిష్యత్తులో విభేదాలు రాకుడదన్నారు. మాన్సాస్ ఈవోను తాను వెళ్లి కలవాలని ట్రై చేశారని..ఐతే ఆయన తనకు అపాయింట్‌మెంట్ ఇవ్వలేదన్నారు. తాజాగా జరిగిన ధర్మకర్తల మండలి సమావేశం ద్వారా గతంలో తీసుకున్న నిర్ణయాలు ఏంటనేది కొంతవరకు తెలిశాయన్నారు. ఐతే రికార్డులలో మాత్రం కొన్ని తేడాలు ఉన్నాయన్నారు. భక్తులకు సౌకర్యాలకు సంబంధించి చాలా విషయాలు ఉన్నాయన్నారు. దానిపై హోంవర్క్ చేసి అన్ని కోణాల నుండి రిపోర్ట్స్ తెప్పించుకుంటాని అశోక్‌గజపతిరాజు చెప్పారు.
Also Read: ఏపీ కాంట్రాక్ట్ ఉద్యోగులకు జగన్ సర్కార్ గుడ్ న్యూస్.. ఉత్తర్వులు జారీ