Ashadam Special: మన్యంలో ఆ కర్రీ ఘుమఘుమలు.. ఈ మాసంలో దొరికే అరుదైన ఆకుకూరలతో ఆషాడం కూర.. భలే పసందు

|

Jul 16, 2022 | 1:41 PM

అల్లూరి జిల్లా మన్యంలో ఆకుకూరలకు విశేష ప్రాముఖ్యత ఉంది. అదీ కూడా నిత్యం లభించే, పండించే ఆకుకూరలు కాదు.. సీజన్ లో ప్రత్యేకంగా ఉండే ఆకులు, పూలతో వంటకాలు ఈ అడవి బిడ్డల సొంతం

Ashadam Special: మన్యంలో ఆ కర్రీ ఘుమఘుమలు.. ఈ మాసంలో దొరికే అరుదైన ఆకుకూరలతో ఆషాడం కూర.. భలే పసందు
Ashadam Special Manyam Dist
Follow us on

Ashadam Special: వాళ్ళంతా అమాయక అడవి బిడ్డలు. విసిరి పారేసినట్టుండే గూడెల్లో వారి జీవనం. అడవి తల్లిని నమ్ముకుని వారి జీవనయానం. అటువంటి మన్యంలో గిరిజన సంప్రదాయం అందరికీ కట్టిపడేస్తుంది. గిరిజన ఆచార వ్యవహారాలతో పాటు నోరూరించే వంటకాలు అందర్నీ ఆకట్టుకుంటాయి. ఈ కోవకే చెందుతుంది అషాడంలో వండే ఆకు కూర..! అదేంటి.. ఆషాడం ఆకు కూర ఏంటి అని అనుకుంటున్నారా..? అయితే ఈ సీజన్లో దొరికే ప్రత్యేకమైన ఆ కర్రీ విశేషాలు ఏమిటంటే..

అల్లూరి జిల్లా మన్యంలో ఆకుకూరలకు విశేష ప్రాముఖ్యత ఉంది. అదీ కూడా నిత్యం లభించే, పండించే ఆకుకూరలు కాదు.. సీజన్ లో ప్రత్యేకంగా ఉండే ఆకులు, పూలతో వంటకాలు ఈ అడవి బిడ్డల సొంతం. ఇక ఆషాడ మాసం వచ్చిందంటే చాలు.. ఈ సీజన్లో ఏజెన్సీలో విరివిగా దొరికే ఆ ఆకులను సేకరించే పనిలో ఉంటారు గిరిజనులు. ప్రతియేటా ఈ మాసంలో ఈ కూరకు భలే గిరాకీ ఉంటుంది. ఇష్టపడి మరీ గిరిజనులంతా దీన్ని సేకరించేందుకు పోటీపడతారు.

ఏజెన్సీలో కలగంటి, బొమ్మ తట్టెడు, కప్పకూర లాంటి ఆకుకూరలు ఆషాడ మాసంలో ఎక్కువగా చిగురిస్తాయి. ఈ చెట్లు చాలా వరకు పెరట్లోనే ఉంటాయి. మరికొన్ని మెట్ట ప్రాంతాల్లోను రోడ్డు కు ఇరువైపులా గిరిజన గ్రామాల్లో విస్తరించి ఉన్నాయి. ఆషాడ మాసంలో వర్షాలు ప్రారంభం అయినప్పుడు ఈ కూరల వంటకాలు మొదలవుతాయి. ఆకులను కోసి కూరను వండడం ఆనవాయితీ. అంతేకాదు ఆ కూరను ఇంటిల్లిపాది ఇష్టంగా ఆరగిస్తారు. లొట్టలు వేసుకుని మరి ఆహా ఏమి రుచి అంటూ తింటారు. పిల్లలు పెద్దలు కలిసి కూర ఆరాగిస్తామని గిరిజన వాసులు చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి

అయితే గిరిజనులు పవిత్రంగా భావించే కూర ఈ సీజన్లోనే తినడం వెనుక ఓ ప్రత్యేకత కూడా ఉందట…! పోషకాలు పుష్కలంగా ఉండే ఈ కూర .. కేవలం వంటకంగా మాత్రమే కాకుండా దివ్య ఔషధంగా కూడా భావిస్తారు గిరిజనులు. ఈ కూర తింటే ఈ సీజన్లో వచ్చే వ్యాదులు దరి చేరవన్నది గిరిజనుల విశ్వాసం. ఈ కలగంటి, బొమ్మ తట్టెడు, కప్పకూర లో ఇమ్యూనిటీ పవర్ పెంచే గుణం ఉంటుందని వాదన. పవిత్రంగా భావించే ఈ ఆషాడం కూరను పెసర పప్పు కలిపి వంటకాలు చేస్తారు. వాటిని అమ్మవారికి నైవేద్యంగా కుడా పెడతారు అడవి బిడ్డలు. ఇలా చేయడం వల్ల అనారోగ్య సమస్యల నుంచి బయటపడతామని విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. ఆకు కూరలతో కూరలు మాత్రమే కాదు.. వేర్వేరు రకాల వంటకాలు కుడా చేస్తారు.

ఆషాడం మాసంలో దొరికే గిరిజనుల స్పెషల్ డిష్ ఆషాడం ఆకు కూర. ఎప్పుడైనా ఈ సీజన్ లో మన్యం ఏజెన్సీ కి వెళ్తే మాత్రం ఓ సారి ఈ కూర టేస్ట్ ను ఆస్వాదించండి.

Reporter: Khaja,Tv9 Telugu

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..