APSRTC Special Services: సంక్రాంతి పండగ సంబరం ముగిసింది. అందరూ కూడా తమ సొంతూళ్ల నుంచి తిరుగు ప్రయాణమయ్యారు. అయితే తక్కువ సంఖ్యలో రైళ్లు, బస్సులు ఉండటంతో కొంచెం ఇబ్బంది పడుతున్నారు. ఈ తరుణంలో ఏపీఎస్ఆర్టీసీ గుడ్ న్యూస్ అందించింది.
ప్రయాణీకుల సౌకర్యార్ధం ఏపీలోని వివిధ జిల్లాలతో పాటు హైదరాబాద్, చెన్నై, విశాఖ, బెంగళూరు సిటీలకు ఆదివారం, సోమవారం మొత్తం 2,494 ప్రత్యేక సర్వీసులు నడుపుతోంది. ఈ రెండు రోజుల్లో హైదరాబాద్‌కు 631 బస్సు సర్వీసులకు వేశారు. అటు ఆదివారం వివిధ జిల్లాల నుంచి విజయవాడకు 59, విశాఖపట్నానికి 125, బెంగళూరుకు 142, చెన్నైకి 51 సర్వీసులను అందుబాటులో ఉంచారు. అన్ని ప్రత్యేక బస్సులకు రిజర్వేషన్ సౌకర్యం ఉందని.. రద్దీ బట్టి బస్సుల సంఖ్యను పెంచుతామని ఆర్టీసీ ఎండీ బ్రహ్మానందరెడ్డి స్పష్టం చేశారు.