APSRTC Special Buses: సంక్రాంతికి ప్రత్యేక బస్సులు నడుపనున్నట్లు ఏపీఎస్ ఆర్టీసీ వెల్లడించింది. పండుగ నేపథ్యంలో గతంలో కంటే 35% అధికంగా ప్రత్యేక బస్సు సర్వీసులు నడపనున్నట్లు తెలిపింది. రద్దీని దృష్టిలో ఉంచుకొని మొత్తం 11 రోజుల పాటు ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు ఏపీఎస్ ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు గురువారం తెలిపారు. సంక్రాంతికి ప్రజలందరూ స్వగ్రామాలకు వస్తారని.. దీంతో ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉంటుందన్నారు. దీనిలో భాగంగా రేపటి నుంచి18 జనవరి వరకూ ఏపీ నుంచి 6970 అదనపు బస్సులు నడపడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. రోజుకు సుమారుగా 4 వేల బస్సులుంటాయని తిరుమలరావు తెలిపారు. అదనపు సర్వీసులకు సర్వీసు నంబర్లు 9వేల సిరీస్ ఉంటుందని.. ప్రయాణికులు గమనించాలని సూచించారు. రెగ్యులర్ సర్వీసుల్లో 60%, స్పెషల్ బస్సుల్లో 50% ఇప్పటి వరకూ రిజర్వ్ అయ్యాయన్నారు. ప్రయాణికులు ఎక్కువగా ఉండే ప్రాంతాల నుంచి బస్సులు బయలుదేరతాయన్నారు. కాలనీలు, కూడళ్ళ వద్ద ప్రయాణీకులు ఎక్కువగా ఉంటే, అక్కడ నుంచే బస్సు బయలుదేరుతుందన్నారు.
డీజిల్ రేటు 60% పెరిగడం, ఒకవైపు బస్సు ఖాళీగా వెళుతుంది కావున టికెట్ ఛార్జి 50% పెంచామన్నారు. మన ప్రాంతం వారు మన బస్సులను ఆదరిస్తారని ఆశిస్తున్నామన్నారు. పక్క రాష్ట్రంతో రేటు విషయంలో పోటీ, పోలిక లేదన్నారు. నువ్వా, నేనా అనుకోకుండా నువ్వు, నేను అనుకునే పరిస్థితి రావాలని ఆకాంక్షించారు. తెలంగాణ, ఏపీ కిలోమీటర్లు పెంచుకుంటే మంచిదే కదా అంటూ ఎండీ పేర్కొన్నారు. రెండు రాష్ట్రాల ఆర్టీసీలు సమిష్టిగా పనిచేస్తే ఇద్దరికీ లాభమే అంటూ తెలిపారు.కార్గో ఛార్జీలు మేం తక్కువ తీసుకుంటున్నా.. పక్క రాష్ట్రంలో ఎక్కువైనా ప్రశ్నించలేదన్నారు. రేటు తగ్గించడం ప్రైవేటు బస్సులకు లాభం చేకూర్చడమేన్నారు. దసరాలో ఏపీఎస్ఆర్టీసీకి ఆదాయం బాగా వచ్చిందని గుర్తు చేశారు.
పెద్ద మనసుతో ఏపీఎస్ఆర్టీసీ బిజినెస్ చేస్తోందన్నారు. విద్యుత్ బస్సుల సర్వీసులను ఫిబ్రవరిలో ప్లాన్ చేస్తున్నామన్నారు. డీజిల్ బస్సులను ఎలక్ట్రిక్ బస్సులుగా మార్చే ఆలోచన కూడా ఉందన్నారు. కడప బస్ డిపో రీలొకేట్ చేయనున్నట్లు వెల్లడించారు. జంగారెడ్డిగూడెం బస్సు ఘటనపై రిపోర్టు వచ్చాక స్పందిస్తామన్నారు.ర ఎస్బీటీ, ఎస్ఆర్బిఎస్ సొమ్ములు సెటిల్ చేసి రిటైర్ అయిన ఉద్యోగులకు చెల్లిస్తున్నామన్నారు. తెలంగాణ వారు టికెట్లు రేట్లు పెంచారని తాము పెంచమని పేర్కొన్నారు.
Also Read:
US Fire Accident: అమెరికాలో భారీ అగ్నిప్రమాదం.. 8 మంది చిన్నారులతో సహా 12 మంది మృతి