అమలాపురం ఆపిల్స్‌..పులుపు !

|

Sep 14, 2019 | 8:07 PM

అమలాపురం ఆపిల్స్‌..పేరు వింటేనే వింతగా ఉంది కదా..? అమలాపురం ఆపిల్స్‌ ఏంటీ..? ఎక్కడో కశ్మీర్‌లో మాత్రమే పండే ఆపిల్స్‌ అమలాపురంలో ఏంటీ..? అనుకుంటున్నారు కదా..! అవును మన తూర్పుగోదావరి జిల్లా అమలాపురంలో ఆపిల్స్‌ పండుతున్నాయి. అమలాపురం పట్టణంలో ఓ గృహిణి గతంలో ఓ ఆపిల్‌ మొక్కను కొనుగోలు చేసిందట. దానిని మూడు, నాలుగు సంవత్సరాల పాటు జాగ్రత్తగా కూలింగ్‌ ఏరియాలో కుండీలో పెంచిదట..మొక్క బ్రతికి చెట్టుగా మారటంతో..దానిని అప్పుడు భూమిలో నాటి పెట్టారట..అలా కొన్ని సంవత్సరాల పాటు […]

అమలాపురం ఆపిల్స్‌..పులుపు !
Follow us on
అమలాపురం ఆపిల్స్‌..పేరు వింటేనే వింతగా ఉంది కదా..? అమలాపురం ఆపిల్స్‌ ఏంటీ..? ఎక్కడో కశ్మీర్‌లో మాత్రమే పండే ఆపిల్స్‌ అమలాపురంలో ఏంటీ..? అనుకుంటున్నారు కదా..! అవును మన తూర్పుగోదావరి జిల్లా అమలాపురంలో ఆపిల్స్‌ పండుతున్నాయి. అమలాపురం పట్టణంలో ఓ గృహిణి గతంలో ఓ ఆపిల్‌ మొక్కను కొనుగోలు చేసిందట. దానిని మూడు, నాలుగు సంవత్సరాల పాటు జాగ్రత్తగా కూలింగ్‌ ఏరియాలో కుండీలో పెంచిదట..మొక్క బ్రతికి చెట్టుగా మారటంతో..దానిని అప్పుడు భూమిలో నాటి పెట్టారట..అలా కొన్ని సంవత్సరాల పాటు … ఐస్‌ ముక్కలు, పులిసిన మజ్జిగ, కొబ్బరి బొండాలు వేస్తూ..ఏళ్ల తరబడి శ్రమించి మొక్కను చెట్టుగా తయారు చేసింది. ఇప్పుడు ఆ ఆపిల్‌ చెట్టు కాస్త గుత్తులుగా కాయలు కాస్తోంది..దీంతో ఆ మహిళ పడ్డ శ్రమకు ఫలితం దక్కిందని..తమ అమలాపురంలో ఆపిల్స్‌ పండుతున్నాయని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే..గతంలో విశాఖ ఏజెన్సీలో ఆపిల్స్‌ పండించేందుకు వాతావరణం అనువైనదిగా గుర్తించారు. అయితే, ఇప్పుడు అమలాపురంలో ఆపిల్స్‌ చెట్టు ఎదిగి కాయలు కాస్తుండటంతో…స్థానికులు సైతం పెద్ద సంఖ్యలో చెట్టును చూసేందుకు వస్తున్నారు.